Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kaksha (1980)




చిత్రం: కక్ష (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ , ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల , యస్.జానకి, మాధవపెద్ది రమేష్, యస్.పి. శైలజ, 
నటీనటులు: శోభన్ బాబు, మురళీమహన్, మోహన్ బాబు, రంగనాథ్, శ్రీదేవి, జయచిత్ర, జమున 
దర్శకత్వం: గుహనాధన్ 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 28.03.1980



Songs List:



ఐసలకడి ఘుంతలకడి పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

ఐసలకడి ఘుంతలకడి
అడకిలాడి నే నాడ కిలాడి
నాతోటి పెట్టుకోకు గడబిడి
లేపేస్తా టొపేరం అదీ సంగతి

ఓరమ్మ కొడకా....:
నువ్వు పుట్టింది ఆడదాని కేరా
ప్రతి ఆడదీ నీకోసం పుట్టలేదురా
కన్ను కొట్టావా  లొట్ట లేసావా
కంటిలో నలుసల్లె పడుతుందిగా
గొంతులో వెలక్కాయ అవుతుందిరా
చూస్తావా ఓ చాన్సు....

ఓ కారయ్యో - ఏం జోరయ్యో.....!
నీ అమ్మ కడుపులోంచి కారులో వస్తివా
నీ అబ్బ సొమ్మెట్టి రోడంత కొంటివా 
గాలి తుస్సుంటే – తోలు తిత్తయ్య
కోట్లున్నా గుప్పెడు గాలి తెచ్చుకోలేవు - నీకు
గొయ్యైనా కట్టెలైనా పేర్చేది పేదోడు
కొట్టు కొట్టు కొట్టు పొట్టయినా కరుగుతుంది కొట్టు
ఒరేయ్ ఎదవలూ ఇదా మీ చదువులు
మిమ్ము కన్నోళ్ళు కన్నవి చెడ్డ కలలా ?
వాళ్ళు చెమటోడ్చి పంపేవి చిల్ల పెంకులా
ముక్క ముట్టారా ముక్కు పిండేస్తా 
మారితే మనుషులైబతుకుతారు
కాదంటే కటకటాలు లెక్కెడతారు



కందిరీగతో చెప్పానురా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

కందిరీగతో చెప్పానురా
బూరెకాదు బుగ్గ ఇది కుట్ట వద్దని
కుట్టినా ఎవ్వరికీ చెప్పొదని
గోల చెయ్యొద్దని పరువు తీయొద్దని
దొంగ చాటుగా వసానులే
బుగమీద కాటేసి పోతానులే
అడిగితే చెప్పుకో కందిరీ గని
కాటు వేసిందని బుగ్గ వాచిందని

ఉండుండి గుండె దడ దడ మంటుందిరా
ఆగాగి వయసు పెటపెట పంటుందిరా
డాన్ని ఆపేది ఎటా
దీన్ని అణిచేది ఎట్టా
ఊగూగి మనసు రెపరెప మంటున్నదే
ఉత్తుత్తినే ఒళ్ళు చిమచిమ లాడిందిలే
దీన్ని తీర్చేది ఎట్లా
దాన్ని ఆర్బేది ఎట్టా

కళ్ళల్లో నీకు ఇల్లొకటి కట్టానురా
ఒళ్ళంత కళ్ళుగ నిన్నెదురు చూశానురా
అద్దె ఇవ్వద్దు నువ్వు
పొద్దు కో ముద్దు ఇవ్వు
పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారులే
వద్దన్న కొద్ది ముద్దెక్కు వౌతుందిలే
నీకు నెల తప్పకుండా
నేను అద్దిచ్చుకుంటా




నా మనసు పిచ్చి ముండ పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి , ఆనంద్ 

నా మనసు పిచ్చి ముండ
ఇన్నాళ్ళు దాచాను ఇవ్వకుండ
అది నీకోసమేరా అట్ట రాసుందిలేరా బంగారు కొండ
నా మనసు పాలకుండ
ఇన్నాళ్ళు దాచాను జారకుండ
అది అందించినాను ఇక పొంగించు పాలు-బంగారుకొండ

మనసిచ్చేంతవరకే మంచిదాన్ని
ఇచ్చాక మా చెడ్డ చుప్పనాతిని
చుప్పనాతి మనసెంత మంచిదని
కంటికి రెప్పల్లె కాస్తుంది ప్రియుడ్ని
అటు ఇటు చూశావా అడ్డదారి తొక్కావా
కళ్ళకు కట్టేస్తా గంతల్ని కాళ్ళకు వేసేస్తా బంధాల్ని
కళ్ళయినా కాళ్ళయినా నీతోటి కలిసే చూడాలి
నీ బాటగానే నడవాలి బంగారుకొండ ॥ నా మనసు ॥

ఒక సన్నాయి మ్రోగింది గుండెలోన
అది కళ్యాణ మేళంగా అనుకోనా
రెండు గుండెలు ఒక తాళం వేసినప్పుడే
నిండుగ ఉంటుంది ఏ మేళమైనా
చెంపల నిగ్గులలో చిగురించే సిగ్గులతో
ముగులు వేశావు ముంగిలిలో
లగ్నము చూశాను దగ్గరలో
ముగ్గులైనా లగ్నమైనా
నీ యింటి వాకిటే వేస్తాను 
నీ జంటలోనే చూస్తాను బంగారు కొండ ॥ నామనసు ॥





బుగ్గమీద ముద్దు పెట్టనా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

బుగ్గమీద ముద్దు పెట్టనా
ముద్దుమీద ఒట్టు పెట్టనా
ఒట్టు పెట్టి ఓడించనా 
ఓడగొట్టి గెలిపించనా
గెలిచినట్టు గురుతు పెట్టిపోనా

నడుము నీకు వప్పజెప్పి నడవనా అదినీ
పిడికిలంత లేదంటే నవ్వనా
గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్నన ఒక్క
గుప్పెడే నువ్వుండె నా గుండె తెలుసునా

సొగసులోని రంగులన్ని చూడనా - చూచి
వయసులోని పొంగుతోటి రంగరించనా
రంగురంగు కలలతో రాతిరంత గడపనా
రమ్మనీ తలుపులన్నీ తెరిచి వేచి వుండనా




ఓరబ్బ దెబ్బ అగ్గిబరాటారా పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్, కె. చక్రవర్తి, జి. ఆనంద్, శైలజ 

ఓరబ్బ ఊరూర సవాలు చేస్తున్నాం
సమఉజ్జీ ఎవరంటూ సభలో చూస్తున్నాం
మాటకు మాటుంది వేటుకు వేటుంది
పోటీకొస్తే పీటీ చేసి బోలాకొట్టిస్తాం

ఓరబ్బ దెబ్బ అగ్గిబరాటారా
ఒకసారి రుచిచూడు ఉక్కు కరావేరా
మాటకు మాటుంది వేటుకు వేటుంది
పోటీకొచ్చి పీటీచేసి చీటీ చింపేస్తాం

మీ తాతకు దగ్గులు నేర్పినవాణ్ణి నన్నా ఎదిరిస్తావ్
మీ ముత్తాత ముక్కును పిండినవాణ్ణి నీకా జడిసేది
బురదగుంటలో చేపలు పడతావ్ తిమింగలాన్ని మింగేవా

తిమింగలాన్ని గిలగిలకొట్టి తిక్కా తిమురు ఒదిలిస్తా
పచ్చడిచేసి పచ్చినెత్తురు భళ్ళున కక్కిస్తా
హీరోలైతే దాగారెందుకు చీరకొంగు వెనక నీ
చీరకొంగు వెనుక

సత్యభామ కథ చదవలేదటే చవటా పోపోవే
సత్యభామవో చుప్పనాతివో చప్పున తేల్చేస్తా
ముక్కు చెవులు దక్కవు నీకు టక్కున చెక్కేస్తాన్
కయ్యంలోన కాలు దువ్వితే కుయ్యో అనిపిస్తా
టెక్కు టెంపరు చూపేవా చుక్కలు కనబడతాయ్
గుర్తొచ్చి వెక్కిరించితే నడ్డి విరుగుతుంది
గుట్టూ మట్టూ బయట పెట్టితే ఆట కట్టుతుంది
 మీ ఆట కట్టుతుంది.
తెరవెనుక భాగోతం చూస్తావా
ఓరబ్బ




దుష్టుల మీద దుర్మార్గుల మీద పాట సాహిత్యం

 
చిత్రం: కక్ష (1979)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్,

దుష్టుల మీద దుర్మార్గుల మీద
దోపిడి మీద పాపులు మీద 
అందరు కక్ష పూనింది మాయమ్మ కాళికమ్మ
శిక్ష తప్పించు కోలేవు తోలు బొమ్మ

నేనే కాళిని కపాల మాలిని
మహంకాళిని మహిషాసుర మర్థినినే
ఎక్కడికే పారిపోతావు నువ్
పారిపోతే పాపాలు తీరిపోవు

ఎయ్ శాకిని ఢాకిని కామిని మోహిని
రండి రారండి రక్కి రక్కీ ముక్కలుగా చెక్కండి- పాపిని
 చెప్పుకుంటే ఆరుతుంది.
చెప్పుకుంటే అగ్గిలా కాల్చుతుంది

చెప్పమంటే ఊరికే చెప్పదీ దెయ్యమూ
చెప్పుతో నాలుగు చీపురుతో నాలుగు
వడ్డిస్తే వస్తుంది నిజము
దీని దెయ్యాన్ని ఇప్పుడే వదిలించు
దీని చేతనే సత్యాన్ని కక్కించు
కక్కపే టక్కులాడి
నిజము కక్కవే కటిక రాక్షసి

No comments

Most Recent

Default