చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల, రాఘవులు నటీనటులు: శోభన్ బాబు, చంద్రకళ, సావిత్రి దర్శకత్వం: టి. మాధవరావు నిర్మాతలు: డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజ సీతారామరాజు విడుదల తేది: 26.08.1972
Songs List:
తీయ తీయని నవ్వే నువ్వు పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల, రాఘవులు తీయ తీయని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నవ్వు నన్ను కన్నతల్లివి నువ్వు నా పున్నెము పండిన పంటవు నువ్వు దేవతలిచ్చిన దీవెనలన్నీ తెచ్చిన చల్లని పాపవు నువ్వు తీరిపోని పూర్వజన్మబంధమేదో తీసుకొచ్చి నింపినావు నా ఒడిలో నింగిలోన తారకలన్నీ, నీ కన్నులలో మెరిసినవీ చందమామ చలువంతా నీ నవ్వులలో నే యిమిడినది నా యింటి దీపము నిలిపినావు నా కంటి పాపవై వెలసినావు కన్నతల్లి కలలకు కమ్మని రూపం యిచ్చిన బంగారు బొమ్మవు నీవు
కాలం మారుతుంది పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది. విడదీసి ముడివేసి ఎంతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాధను చేస్తుంది ప్రాపులేసి ససితీగకు తానే పందిరి వేసుంది ఎన్నెన్నో గారడీలు చేస్తుంది మబ్బులు మెరిసి..వానలు కురిసి వరదలౌతుంది నిషినిమాకును ఒకటిగచేసి కొట్టుకుపోతుంది ॥ కాలం॥ ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుంది. ఎందరేగినా ఎన్ని జరిగినా ఎర్పగనట్టులే వుంటుంది. ఎన్నెన్నో గారడీలు చేస్తుంది కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది కాలానిదో కన్నతల్లిదో గెలుపన్నదే తెలియనిది
నిన్నరాత్రి నిన్ను చూసి కల్లోన పిల్లా పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల నిన్నరాత్రి నిన్ను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా నిదురలోన ఉలిక్కిపడితె బెదురేదోలే అనుకున్నా చక్కిలిగింతలు పెడితేను చలిగాలేమో అనుకున్నా కళ్ళు తెరిచి చూశానే నా ఎదుటే నువ్వు ఉన్నావే నమ్మలేక నీఒళ్ళంతా తడిమి తడిమి చూశానే చేతికి వెచ్చగ తగిలావు లోపల వేడిని రేపాపు మెల్లగా చెక్కిలి చిదిమాను మెలికలే తిరిగిపోయావు మెలికలుచూసి చెమటలు పోసి పసివాణయిపడిపోయాను లేచి చూస్తే నీ ఒడిలో లేవలేక పడుకున్నాను నిలబడు నిలబడు నిమిషంసేపు నీలికన్నుల చినదానా నువ్వు నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటివే పిల్లదాన దారికి అడ్డం నిలబడతాను దాటైనా పోరాదా తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనాపోరాదా
వచ్చిందమ్మా దోర దోర వయసు పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల , రాఘవులు వచ్చిందమ్మా దోర దోర వయసు తెచ్చిందమ్మా కొత్త కొత్త సొగసు ఏదో తిక్క తిక్కగా వుంది లోపల తికమక పెడుతూంది నిమిషం సేపు మనసొకచోట నిలవనంటుంది. నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుంది అల్లరల్లరిగ తిరగాలంటే సరదాగుంటుంది హద్దులన్నా పెద్దలన్నా కోపంవస్తుంది. పైట నిలవదు పక్క కుదరదు. పగలు తరగదు. రాత్రిగడవదు ఏదో గుబులు గుబులుగా వుంది ఎదలో గుబగుబమంటుంది. వచ్చిందమ్మా దోర దోర వయసు తెచ్చిందమ్మ కొత్త కొత సొగసు ఏదో తిక్క తిక్కగా వుంది లోపల తికమక పెడుతూంది ఒంటరిగా నువు వున్నావంటే అలాగే వుంటుంది. జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుంది కళ్లుకలిస్తే గుండె ఎందుకో ఝల్లుమంటుంది నీ కౌగిలిలోనా కన్నెతనం కరిగేపోతుంది నినుమెచ్చాను మనసిచ్చాను నిలువున దోచి నీకే యిచ్చాను ఏదో హాయిహాయిగావుంది. ఎక్కడికో తేలితేలి పోతుంది వచ్చిందమ్మా దోర వయసు తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు పెద్దలు లేక హద్దులు తెలియక చిందరవందరయింది బ్రతుకు
అబ్బో అబ్బో ఎంత మొనగాడివనుకున్నా పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల అబ్బో అబ్బో ఎంత మొనగాడివనుకున్నా ఇంత పిరికాడివా నువ్వు తలపురూ ఓహో డయివరూ ఆహా డయివరూ అటు చక్రం తిప్పుతుంటే కృష్ణుడే అనుకున్నా ఇటు హారనూ కొడుతుంటె అర్జునుడే అనుకున్నా కాలికింద విసనొక్కి కారాపినప్పుడు పిక్కబలం జూచినిన్ను భీముడే అనుకున్నా (అబ్బో) చక్కనీ చుక్క నీ సక్కనొచ్చి కూచుంటే ఉక్కిరిబిక్కిరి అయినీపు వురకలెత్తుతావేల కోతలన్ని కోసవే కొండమీది కోతి తెస్తానన్నావ్ డేగకోడి నన్నావే - సైం అంతె కోసకోడివైనావె అబ్బో! అబ్బో, ఎదుటున్న అదాన్ని అటూ ఇటూ తిప్పావు. వెనుకున్న నేను నీ దొంగచూపు చూచాను చిగురుమేయు చిలకమ్మ చెట్టుకేమి సొంతమా గోరింక తోడొస్తే కోటలేమి అడ్డమా?
నువ్వు కావాలి - నీ నవ్వుకావాలి పాట సాహిత్యం
చిత్రం: కన్నతల్లి (1972) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల నువ్వు కావాలి - నీ నవ్వుకావాలి నీతోటి వుండాలి నే నవ్వుతు వుండాలి అద్దమందు నాకు నేనే ముద్దువచ్చే వేళలో ఆపలేని పొంగులేవో హద్దుమీరే వయసులో హద్దుమీరే పొంగులాపి ముద్దుచేసేటందుకు ముదు వొచ్చే నీకు నేనే అద్దమయ్యేటందుకు దుడుకు చేసే దోరవయసు వురకలెత్తే వేళలో పడుచువానికి పండువెన్నెల పగై పోయే జాములో నిమిషనిమిషం పులికి పడుతూ నిదుగ చెదరే రేయిలో నిన్నకలలే కన్నెమనసు నెమరువేసే హాయిలో వల్లమాలిన వలపులన్నీ ఒశు విరిచేటందుకు ఆశలన్నీ అలసిపోయి ఆవులించేటందుకు ఒకరి కొకరు వోడిపోయి ఒక్కటయ్యేటందుకు పగలు రేయి ఒకటిచేసి పరవశించేటందుకు
No comments
Post a Comment