Image Source Link
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి, ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, జి.ఆనంద్ నటీనటులు: యన్. టి. రామారావు, జయసుధ అసిస్టెంట్ డైరెక్టర్: బి. గోపాల్ దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు నిర్మాత: కె. దేవి వరప్రసాద్ విడుదల తేది: 15.12.1978
Songs List:
యస్ నేనే నెంబర్ వన్ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు యస్ నేనే నెంబర్ వన్ కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్ రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్ నెంబర్ వన్... నెంబర్ వన్... నెంబర్ వన్ ॥యస్ నేనే ॥ ఇది జనతా బస్సు - జాగ్రత జాగ్రత మనిపర్సూ ఎవ్వరు ఎక్కడ దిగుతారో ఏం తలకెత్తుకుపోతారో .... ఎవడికి తెలుసు ? గోవిందా గోవిందా ముద్రలువేసే నోట్లకట్టలు ముడుపుగ వేసే పెద్దమనుషులు ముసుగులు తీస్తే రాస్కెల్సు మూట విప్పితే బాటిల్సు కేడీ నెంబర్ వన్ .... కేడ్ నెంబర్ వన్.... ॥యస్ నేనే ॥ ఈ లోకం గాంబ్లింగ్ హౌస్ ఆడేవాళ్ళు బ్లడీ ఫూల్స్ ముక్కలు మార్చేవాడెవడో లెక్కెగగొట్టేవాడెడో ....ఎవడికి తెలుసు ? రాజు రాణి జోకర్ లు కలిసొస్తేనే లాఖియర్ లు, రంగురంగుల టోపీలు రకరకాలుగా దోపిళ్ళు ॥యస్ నేనే ॥ ఇది భారతదేశం ఈ పసిపాపలదీ దేశం ఎవ్వడు గాంధీ అవుతాడో ఎవ్వడు గాడ్సే అవుతాడో ఎవరూ ఎరగం ఇస్తే చాలదు సందేశం ఇవ్వాలయ్యా సౌకర్యం ప్రతి ఒకరప్పుడు నెంబర్ వన్ చెబుతున్నాడీ నెంబర్ వన్ ॥యస్ నేనే ॥
సరిగమ పదనిస... పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు సరిగమ పదనిస... ఛ ఛ... పదనిషా అందిస్తా అమృతం కొట్లు గురూ కొట్టకుంటే చచ్చినంత ఒట్లు గురూ, గురూ గురూ పాలల్లో ఏముందిరో చల్లారే పొంగుతప్ప నీళ్ళల్లో ఏముందిరో పల్లానికి పరుగుతప్ప పాపలు తాగే పాలూ చేపలు ఈదే నీళ్లూ నీ కెందుకురా ఈ విందుకు రారా తందనానా తాగు తందనానా ఊగు తందనాలాడు తాగి తందనాలాడు గంగ తాగి నట్టుందిరో కాస్తంత చేదుతప్ప శివమెత్తి పోతోందిరా శివుడు ఎవరు నేను తప్ప బ్రాందీ తాగిన నీకూ విస్కీ తాగిన నాకు సిగ్గెందుకులే - పెగ్గందుకురా తందనానా తాగు తందనానా ఊగు తందనాలాడు తాగి తందనాలాడు ఫారిన్ బ్రాందీ వుంది అది గడ గడ తాగేస్తా కారబ్బూందీ వుంది ఇది కరకర నమిలేస్తా అది గడగడ తాగేస్తా! ఇది కరకర నమిలేస్తా కాదంటే హరహరహర శంభో అనిపిస్తా మిడి మిడి మేళం తడిపొడి తాళం చిందరవందర గందర గోళం
ఆకలుండదు దప్పికుండదు పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఆకలుండదు దప్పికుండదు పక్కకుదరదు నిదరపట్టదు ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు ఆకలుండదా దప్పికుండదా పక్కకుదరదా నిదరపట్టదా ఏమిస్తానో చూడు కాయో పండో నీకు పెదవులు వెతికే పెదవులనడుగు పెర పెర ఎందుకని పై పై కెగిరే పైటను అడుగు- రెపరెప లెందుకని గుచ్చిగుచ్చి అడుగుతువుంటే గుట్టు దాచుకోకు పిచ్చికాస్త ముదురుతువుంటే బెట్టు చేయబోకు అక్కడ నెప్పి ఇక్కడ దప్పి ఎట్టా ఎట్టా చెప్పను విప్పి ||ఆకలుండదు|| దిగులుకాని దిగులొకటుంది గుబులు, గుబులుగా పగలూ రేయీ పగపడుతుంది వగలు రగులగా వయసు రోగమై మనసు తాపమై వేధిస్తే అంతే ఏ వయసు కాముచ్చటన్నది లోపిస్తే గల్లంతే ఇప్పుడు చెప్పు ఎక్కడ నెప్పి అక్కడా ఇక్కడా ఎక్కడ ఎక్కడ కొత్త బరువులు మెత్తమెత్తగా ఆరడి పెడుతుంటే కోడెచూపులు వెచ్చవెచ్చగా - రాపిడి పెడుతుంటే దాయలేని వయసుకన్నా మోయలేని బరువేముంది దాచుకున్న మనసుకన్నా పెంచుకున్న జ్వరమేముంది వాయని వాపు తీయని తీపు-తీరే దారీతెన్నూ చూపు
మళ్ళీ మళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ అందీ కోడె వయసు పెళ్ళి పెళ్ళి పెళ్ళి అందీ కన్నె మనసు ముద్దు - వద్దు ముద్దు - వద్దు ముద్దు ముద్దుకి చిలిపి వయసు వలపు పద్దు రాస్తుంటే తొలి వలపు పద్దు రాస్తుంటే పద్దు పద్దు కీ ముద్దు ముదిరి వయసు ముద్దరేస్తుంటే వేసిన ఆకలి వెచ్చని కౌగిలి - తీర్చలేక పోతుంటే ఏదో గిలి ఇంకేదో చలి - చుక్క వేళ చక్కలిగిలి పెడితే ముద్దు వద్దు ముద్దు ॥మళ్ళీ॥ ప్రేమ - పెళ్ళి ప్రేను - పెళ్ళి ప్రేమ తొందరే పెళ్ళి పందిరై రాతిరి రానేవస్తే తొలి రాతిరి రానేవస్తే మూడు ముళ్ళతో ఇద్దరొక్కటై నిద్దరకే సెలవిస్తే తీరని కోరిక తీరిన కోద్దీ - మరోసారి అంటుంటే రేగాలని చెలరేగాలని - రేయి పగలు పక్కలు జతపడితే ప్రేమ - పెళ్ళి అహా - ఊహూఁ
హత్తెరి దొరసాని నరసమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు హత్తెరి దొరసాని నరసమ్మా ఆపమ్మా ఆప్ ఆప్ దొరబాబుల తోల్బొమ్మా తోడాదర్శన్ దేవమ్మా దేవ్ దేవ్ మెరికీది మల్లిని మద్రాసు లల్లిని బెంగుళూరు బేబిని, బొంబాయి దేవిని అదోని దొరసాని నరసమ్మని ఆలిండియాకు ఛాలెంజిని ఆలిండియాకు ఛాలెంజిని పెద్దాపురంలో నా పైట గాలికి పిచ్చెక్కి పోయారు జమిందారులు ఇనషానల్లా హాయ్, గులాములై నారు నవాబులు మెచ్చి నోళ్ళు పిచ్చివాళ్ళు - పులుపు కాస్త చచ్చినోళ్ళు గట్టివాళ్ళు తగలలేదు నీకు యిన్నాళ్ళు భాయి భాయి యిద్దరున్నాం నీ బడాయి మేము విన్నాం వెంకటస్వామి విన్నదెంతో ఉన్నదెంతో చూడబోతాము ఆ పొద్దు చాలా ఉందిలే యిద్దరము ఆసాములే ముదుగానే తెల్చుకుందాం అటో యిటో యిటో అటో నా కాలిగజ్జలు ఘల్ అంటేచాలు మెలికలే తిరిగారు మహారసికులు యిన్నాళ్ళ కొచ్చారా మొనగాళ్ళు - నాతోటి చేస్తారా సవాళ్ళు యిల్లు వెతికి వచ్చినాము నోరుతెరిచీ అడిగినాము యింతమందికి సొంతమైంది మాకు కారాదా నువ్వు పట్టేదేమిమందో యింతమైకం ఎక్కడుందో ఒక్క రాత్రి యిక్కడుండి తెలిసికోరాదా ఆ మేము నీకై వచ్చినా నీకు మేమే నచ్చినా ఖాయమేదో చేసుకుందాం ఆటో యిటో యిటో అటో
పూనిందిరోయ్ పోలేరమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.జానకి హేయ్ పూనిందిరోయ్ పోలేరమ్మా - ఆడిందిరోయ్ అంకాలమ్మా ! దమ్ముంటే చూడు నా జాతర దుమ్ము రేగి పోతుందిరా ll హేయ్ పూనిందిll మేక పులిగా మారింది తాడు పామై లేచింది తెల్ల మబ్బు ఉరిమింది మల్లెపువ్వు ఎరువైంది ఎందుకొచ్చిందో ఈ ప్రళయం ఎవడికో మరి పోయేకాలం llపూనిందిరోయ్ll సీత గీతే దాటింది లంక భస్మం అయింది చీర లొలిచారు ద్రౌపదికి చేటు వచ్చింది నూరుగురికి ఆడదంటేనే అగ్గినిప్పురా.….ఆడుకున్నోళ్లు బూడిద కుప్పరా ll పూనిందిరోయ్ll
No comments
Post a Comment