చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల , యస్.పి.బాలు నటీనటులు: మోహన్ బాబు, సీమ, జయమాలిని దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: వి. వెంకట్రావు విడుదల తేది: 06.09.1980
Songs List:
రాక .... రాక రాక వచ్చారు బావగారు పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల , యస్.పి.బాలు రాక .... రాక రాక వచ్చారు బావగారు పక్కవూరికెళ్ళారు అక్కగారు పక్కకింక ఎవరొస్తారు ఆకు వక్క లెవరిస్తారు తెలిసి.... తెలిసి తెలిసి వచ్చారు బావగారు పక్కవూరికెళ్ళారని అక్కగారు పక్కకింక ఎవరొస్తారు అక్కబదులు చెల్లిస్తారు.. ఎప్పుడున్న పప్పు కూడు చెప్పిడంట అది ఎప్పుడేసే ఇంటి ఘడీయ చప్పుడంట తప్పు తప్పు అనమాకు అప్పు డప్పుడిది సోకు అప్పడాల ఒడియాలు పెట్టమంట మొన్నలేని మొగ్గలు నిన్న లేని సిగ్గులు అక్కగారు చూసిందా లెక్కలేని చిక్కులు పుడుకుంటె పక్కిస్తాను మీ పక్కలోకి దిండిస్తాను కంచ మంటే తప్పులేదు బావగారు పట్టెమంచ మంటే తప్పులేదు బావగారు అక్క ఇంటి వాసాలు లెక్క పెట్టి మోసాలు చెయ్యబోతె బడితె పూజ చేస్తారు అక్కచాటు చెల్లెలా ఆకు చాటు మల్లెలా ఒక్కమాటు రమ్మంటే శ్రీ రంగ నీతులా అక్కరొస్తెఏం చేస్తాను మీ అక్క నువ్వె అనుకుంటాను
ఒత్తరి ఒళ్లు... బిత్తరి కళ్లు అత్తరు జల్లీ పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల , యస్.పి.బాలు ఒత్తరి ఒళ్లు... బిత్తరి కళ్లు అత్తరు జల్లీ మత్తెక్కించే అమ్మాయ్ అందాలు ఆద్దిరబన్నా ....వద్దుర అన్నా.... నిద్దర పట్టని అర్ధరాతిరి సన్నాయ్ మేళాలు ఏవేవో తాళాలు వేస్తున్న బాణాలు తీస్తున్నయ్ ప్రాణాలు ఇస్.... హా అల్లరి కల్లు తిమ్మరి ఒళ్లు అల్లుకుపోయి గిల్లుకు పోయే ఆబ్బాయ్ వేషాలు అందని పిందా... అందిన పండు తుంచుకుపోయి నంజుకు తిన్న తుంటరి మేళాలు ఏవేవో తాళాలు వేస్తున్న బాణాలు తీస్తున్నయ్ ప్రాణాలు ఇస్.... హా మూర తక్కువ చీర కెక్కువ ముద్దులొలికే అందం పైట జారితే పాల పిట్టలే రివ్వు రివ్వ మన్న చందం రివ్యూ రివ్వూ మన్న చందం చేను మేసిన కంచెలాగున చెప్పరానిదీవాటం తప్పు చేసిన కొప్పు మల్లెలే గుప్పు గుప్పుమన్న ఫలితం గుప్పూ గుప్పు మన్న ఫలితం నీ సిగ్గు సిగ్గొయ్య నిన్నింక ఒగ్గెయ్యా నీ లేత బుగ్గల్లో నా ముద్దు ముగ్గెయ్య రంకె వేసిన కన్నె ఈడులో రంకె వేసిన చప్పుడు కొసరులాడిన కోడె ఊసులో గుట్టు మట్టులే చెప్పడు గుట్టూ మట్టూ చెప్పడు మొలకరించిన పులకరింతలో మొటిమి గిల్లిన చప్పుడు కన్నె కాటుక కన్ను వేసిన చిటిక లెందుకో చెప్పడు చిటికో మెటికో చెప్పదు నీ మోజు మొగ్గయ్య ఎన్నెల్లో అగ్గెయ్య మలిసంజ చుక్కలో మనజంట పక్కెయ్య
అరె వారెవ్వా అందగాడా రారా పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు అరె వారెవ్వా అందగాడా రారా ఈ సందకాడ ముసలోడా నీ బూజు దులపాల నామోజు తీరిపోవాల ఓసి నీయవ్వ అవ్వా బువ్వా నువ్వే నా గూడూ గువ్వా పసిదానా నీ జాజు లివ్వాల నా మోజు తీరిపోవాల జలతారు ముసుగూ వుంది జాబిల్లి కులుకువుంది గానా బజానా లోన గంతు లేస్తావా అరవైలో ఇకవై ఏళ్ళ పరువాల పదును వుంది కవ్వాలీ కవ్వింతల్లో కౌగిలిస్తావా వావా వస్తావా అడిగింది ఇస్తావా నేను అడగంది నువ్వు యిస్తావా ఓసి నీయవ్వ అరె వారెవ్వా వారెవ్వా కేటుగాడా రారా నా నీటుగాడా ఈవేళ నీ పోజులింకేలా నా మోజు తీరిపోవాలా చినదాని నవ్వల్లోన సిరిమల్లె చినుకుల్లోన పరదా గోదారి మీన తేలి పోవాలా చినవాడి చూపుల్లోన - చిరువేడి చురకల్లోన సరదాల దారిలోన సాగిరావాలా అరరరే వస్తావా అర ముద్దులిస్తావా తెరచాటు విందు చేస్తావా
గోధూళి వేళ గోరంతదీపం పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు గోధూళి వేళ గోరంతదీపం వెలిగింది నీ దివ్యరూపం, నాలో జరిగింది అమృతాభిషేకం గోధూళి వేళ గోరంత దీపం వెలిగింది నీ దివ్యరూపం, నాలో జరిగింది అమృతాభిషేకం సిరిమల్లె వానల్లో పరువాల హరివిల్లు విరిసింది నా కంట నేడు కాశ్మీర ముందార కుసుమాలు వెదజల్లి కలిసింది నా కన్నె ఈడు నీ మందహాసాలు మధుమాస గీతాలు పాడాలి ప్రాణాల తోడు నెలవంక చెప్పాలి నెలయింక తప్పాలి నీ పాప ఒడిచేరు వరకు ఇల్లాలినై లాలి పాడు వరకు నావూపిరేతాకి! ఉప్పొంగు కెరటాల ఆడాలి జలకాలు నీవు నా చూపులే సోకి ఉదయించు కిలణాల దిద్దాలి తిలకాలు నీవు నీ అంద చందాల ఆమని ఉయ్యాల ఊగాలి కడదాక నేను తెలవారి పోరాదు తొలి రేయిలో హాయి కలలన్ని కడ తేరు వరకు నీ నేను నిను చేరు వరకు
ఆకాశంలో వున్నా నేను నీకోసం పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల ఆకాశంలో వున్నా నేను నీకోసం శూన్యమై కన్నీటి చుక్కలే నీ కంటికి చుక్కలై నా హృదయం ముక్కలై అది ఎనిమిది దిక్కులై నీ చేతి పసుపు పాఠాణితో నీవు సాగనంపిన ఈ ప్రాణికి ఏదీ నీ కౌగిలింత మాంగల్యం ఏదీ నీసరసనున్న సౌభాగ్యం మిగిలింది ఈ విరహా రూప వైధవ్యం దివి నించి రాలేను దిగి నీ కోసం మనసుంటే నీకు ఆ అవకాశం సూర్య కిరణ నయనాలు విప్పినే చూస్తున్నా సుప్రభాత సుస్వాగత గీతం సినిపిస్తున్నా నుదుట సింధూరమై, సిగకు మందార మై కదలిరా..... తరలిరా.... ఎగసిరా..
గోధూళి వేళ గోరంతదీపం (Sad Version)పాట సాహిత్యం
చిత్రం: కేటుగాడు (1980) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు నావూపిరేతాకి ఉప్పొంగు కెరటాల ఆడాలి జలకాలు నీవు నీ చూపులే సోకి ఉదయించు కిలణాల దిద్దాలి తిలకాలు నేను నీ అంద చందాల ఆమని ఉయ్యాల ఊగాలి కడదాక నేను తెలవారి పోరాదు తొలి రేయిలో హాయి కలలన్ని కడ తేరు వరకు నీ నేను నిను చేరు వరకు గోధూళి వేళ గోరంతదీపం వెలిగింది నీ దివ్యరూపం, నాలో జరిగింది అమృతాభిషేకం
No comments
Post a Comment