చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి, వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, శైలజ, ఆనంద్, మాధవపెద్ది రమేష్ నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, సత్యన్నారాయణ, జమున, చంద్రమోహన్ మాటలు: జంధ్యాల దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్ నిర్మాత: కుదరవల్లి సీతారామ స్వామి విడుదల తేది: 10.04.1980 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
చక్కనైన - మా క్రిష్ణయ్యను పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: మాధవపెద్ది రమేష్, యస్.పి.శైలజ చక్కనైన - మా క్రిష్ణయ్యను ఎక్కడైన చూశారా ! మీరెక్కడైనా చూశారా ? వీధి పేరు చెప్పమ్మా అన్నీ... వీధులు అతనివే అన్నీ... ఇళ్ళు అతనిని ఎక్కడ పడితే అక్కడ వుంటాడన్నమాట బుడ్డీ పాలు తాగిననాడే పూతకిని చంపాడు చెడ్డీవేసి తిరిగిననాడే స్త్రీలవెంట బడ్డాడు గోడలైన గెంతేస్తాడు ఫ్లూటు బాగా వాయిస్తాడు అతడేనయ్యా నా జతగాడయ్యా పేపర్లో ప్రకటించైనా పట్టుకొస్తా నుండమ్మా ! ప్రియమైన నా సఖీ.... రాధికా ఏల అలక బాలికా నిన్నే వలచిన - కృష్ణుడా నీకై వచ్చిన గోవిందుడా డడడాం డడడా డడడా, డడడా రాధమ్మ ప్రియుడవే అయితే అసలైన కృష్ణయ్యవైతే నీ నీలం రంగు ఎక్కడ నీ నెమలి పించం ఎక్కడ అపునంటేనే డడడాం డడడా డడడా రేషన్ తిండి తిని రంగు వెలసిపోయిందే ! దివి గాలి వానలో పించ మెగిరిపోయిందే ఇది ఒకటి మిగిలిపోయిందే బంగారు ఫ్లూటేమైనది మార్వాడి కొట్లో ఉన్నది బృందావనం ఏమాయెను ఆది పబ్లిక్ పార్కై పోయెను అంచేత డడడాం డడడా డడడా, డడడా రావె రావె రాధవు నీవే రంగు మారిన కృష్ణుడు నేనే రావె పోదాం మేట్నీకి వేటగాడు సినిమాకి ఆరేరే వచ్చాడు కోరుకున్న అప్టుడేట్ క్రిష్ణయ్యా వీడి తస్సాదీయ మైకమంతా ప్లూటులోనే ఉన్నది ఆరేరే కృష్ణయ్య కాడే వీడు పోస్టర్లతికే పుల్లయ్య వీడి తస్సాదీయ అంటుకుంటే బంకలాగ వదలడే ! ప..... ప... ప...... ప.... పామొచ్చింది. ప్రాణంమీదకు తెచ్చింది. కాళియ మర్దన చేసినవాడివి అంబో అంటావే శంభో అంటావే
మండపేట మైనర్ పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.శైలజ ఓ... మండపేట మైనర్ హేయ్... పిండిమిల్లు ఓనర్ తిప్పకోయి కాలర్ ఇస్తావా పౌడర్ ఔతాను నీ ముందు హాజర్ గడియ తీయకుంటే ఘడియ ఆగలేవు చీర కట్టుకుంటే క్షణము ఊరుకోవు పొద్దైతే ముస్తాబై వస్తావు వద్దన్నా నా వెంట పడతావు ఏగానికోసం ! ఏడేళ్ళ బేరం తెల్లార్లు నీతోనే బంగారం చీ ఒక్కసారి చూస్తే... నీ ఊహ తెలుసుకుంటా చేయి కలుపుకుంటే నీ సేవ గనుక్కుంటా నీ చూపు ఏమేమో వెతికింది నీవైపే నా మనసు లాగింది నాతో పనుంది నా వయసు చింది నీ ఆశ నీ ద్యాస... తెలిసింది
శ్రీదేవి వంటి మా చిట్టితలికీ పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.జానకి శ్రీదేవి వంటి మా చిట్టితలికీ సీమంతము చేయరండి ధీమంతుడైన బిడ్డను కనమని మీరంత దీవించండి పసుపూ కుంకుమలే పచ్చగ ఉండాలని పదముల పారాణి పూయండి. పిల్లా పాపలతో కలకలలాడాలని గలగల గాజులే తొడగండి జడలో పువ్వులే తురమండి అందా లొలికించే అబ్బాయే పుట్టాలి అందరి ఆశలే తీర్చాలి తండ్రిని మించిన తనయుడు కావాలి తాతయ్య పేరునే నిలపాలి మనసులు కరిగించి మమతలు కలిగించి మాలో కలతలే మాపాలి అందరిని ఒకటిగా కలపాలి
ఒకనాటిది కాదు వసంతం పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, ఆనంద్ ఒకనాటిది కాదు వసంతం విడిపోవిది మా అనుబంధం కలిమికన్న చెలిమి మిన్న స్నేహమొకటే శాశ్వతము దేహాలు రెండైనా మా ప్రాణమొకటేలే ఆ ప్రాణమొకటైనా ఆది మాకు మేమేలే ప్రేమకు కోవెల నువ్వు నీ వెల నాకే తెలుసు మా ఆంతరంగాలు గంగాతరంగాలు నూరేళ్ళు పొంగాలిలే ఏ రుతువు ఏదైనా మారాగ మొకటేలే ఎదలోన కదలాడే అనురాగ మదివింటే నువ్వూ నేను కలసి పువ్వూ నవ్వై విరిసి కలిసే వికసిస్తాము కథలే వినిపిస్తాము ఈ ప్రేమ బంధాల ఎన్నో ప్రబంధాలు మాపేర వెలిసేనులే
చక్కనమ్మ వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసిందిరో చక్కనయ్య విచ్చాడు ఒక్క చూపు చూశాడు. చిత్తు చిత్తు చేశాడురో ఆ నవ్వు చూసి రివ్వు మంటే వాటేసుకో ఆ చూపులన్నీ చుట్టుకుంటే దాటేసుకో నీకంటిలో నన్ను పాపల్లె ముద్దాడుకో నీ సోకుకు దండాలు ఆదిసోకితె గండాలు నీ చూపుకు జోహారు ఆది తాకితె కంగారు కన్నుకన్ను గీటుకుంటే కన్నెతీగ మీటుకుంటే గోరువంక గొడవేమిటో మొట్టుకుంటే ముద్దులైతే పట్టుకుంటే పండగైతె నెలవంక కులుకెందుకో సిరిమల్లే గుండెల్లో జాబిల్లి ఎండించుకో నీ సన్నని మసాలు అవి మోసాలు నీ వెన్నెల దాహాలు అవి పెంచెను మోహాలు ఆకు ఒక్క లవ్వకుంటే చెమ్మచెక్క లాడుకుంటె మల్లెతీగలల్లు కుంటే అల్లిబిల్లి పిల్లదుంటే ఈ కొత్త వరసెందుకో పొగమంచు పందిట్లో చెలివుంటే చలి ఎందుకో
మంచి తనానికి పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మంచి తనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇదీ అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇదీ... అనురాగానికి ఆప్యాయతకూ, పెట్టిన పేరు ఇదీ Happy Birth Day అక్కయ్య Happy Birth Day అమ్మా Happy Happy Birth Day అమ్మా అక్కయ్య అమ్మా అక్కయ్య అమ్మా అమ్మరూప మే ఎరుగని నేను నీలో ఆమ్మనే చూశాను అమృతమూర్తి బావ చలవతో ఇంత వాణ్ణి నేనయ్యాను కరుణామూర్తులు అమ్మా నాన్నా కనిపించే మా దైవాలు ఆలుమగల అనురాగాలకు అక్కా బావలే ప్రతి రూపాలు అమ్మ జీవితమే ఆదర్శముగా పేరు తెచ్చుకొని బ్రతకాలి నాన్న గుండెలో - నవ్వులు చిలికి ఆనందం పండించాలి ప్రతిరోజు ఒక పుట్టిన రోజుగ బ్రతుకున వెన్నెల కాయాలి అనుబంధాలు ఆప్యాయతలు ఇలాగె ఎప్పుడూ వుండాలి
చిటుక్కు చిటుక్కు పాట సాహిత్యం
చిత్రం: మామా అల్లుళ్ళ సవాల్ (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికిందీ వానా బుటుక్కు బుటుక్కు బుటుక్కు బుటుక్కు కురిసింది వాన మబ్బులేని వాన మల్లెపూల వానా హోరుమని కురిసింది గుండెలోనా గుండెలోనా.... సిగ్గులేని చినుకేమో బుగ్గ మీద పడుతుంటే ఆగలేని చినుకేమో అంచుమీద పడ్డాది చిలిపి చిలిపి చూపుకన్నా చినుకేలే నిలిపి నిలిపి చూడకుంటే ఒణుకేలేదు వాన కురిసి వరదయ్యే వయసూ లేదు జత అంటు కలిశాక బ్రతుకంతా జడివానా జత అంటు కలిశాక బ్రతుకంతా జడివాన పాడుకుంటు చినుకేదో పైటమీద పడుతూంటే పైట చాటు ఉలుకేమో బయట బయట పడ్డాది తళుకు బెళుకు నవ్వుకన్నా మెరుపే లేదు ఉడుకు ఉడుకు వయసుకన్నా ఉరుమేలేదు తడిసి తడిసి ఒకటైతే నిదురేరాదు బ్రతుకంతా పాటైతే కడదాక నవ్వులవాన బ్రకుకంతా పాటైతే కడదాక నవ్వులవాన
No comments
Post a Comment