Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchivadu (1974)




చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవిందరాజన్
విడుదల తేది: 21.02.1974



Songs List:



ఆకలుండదు పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఆకలుండదు – దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటే
మల్లెలుండవు - వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటే
మనసువుండదు—మమతవుండదు నీ మనిషిని కాకుంటె
వయసులో యీ పోరు వుండదు నీ వలపే లేకుంటే
వలపు యింత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే

పొద్దు గడచేపోతుంది - నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది - నీ చూపుపడుతుంటే 
ఆకుమడుపులు అందిస్తు నువ్వు వగలు పోతుంటె
ఎంత యెరుపో అంత వలపని - నే నాశపడుతుంటె

తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది
దానికన్న తియ్యనై నది నీ ఎదలో దాగుంది
మొదటి రేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది
పొద్ధుచాలని ముద్దులన్ని నీ వద్ధేదాచింది
ఆ ముద్రే మిగిలింది



చిట్టి పాపలు కథలువింటూ పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల

చిట్టి పాపలు కథలువింటూ నిదురపోతారు
నిదురపోతూ కమ్మకమ్మని కలలు కంటారు
కథలుచెప్పే అమ్మనాన్నలు నిదురపోలేరు
చెప్పలేని కథల వ్యధతో మేలుకుంటారు
చిట్టిరాణి పెద్దదైతే ఎలావుంటుందో
రాణి కన్నిట తగినరాజు ఎక్కడున్నాడో
పెళ్ళిచేసి మెట్టినింటికి ఎటుల పంపాలో
అని కలలుకంటూ కలతపడుతూ మేలుకుంటారు



మాపటికొస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

మాపటికొస్తావా మరి రేపటికొస్తావా
మాపటికొస్తే యిస్తానోయ్ యిస్తానోయ్
మల్లెపూల చెండు లిస్తానోయ్
రేపటికొస్తే మొక్కజొన్న కండె లిస్తానోయ్

ఇది పూలతోటకే వెలుగిస్తాది
అది మెట్టచేనుకే సిరులిస్తాది
ఇది వాసన చూస్తేనే మత్తెక్కిస్తాది
అది చెప్పలేని రుచులిస్తాది కొత్తరుచులిస్తాది

హైరా మామా - మనసైనా మామా
తమాషాగ రమ్మంటె తళుక్కుమంటావేమో
ఎగతాళికి నేనంటే ఎంటపడతావేమో
నాచుట్టు రక్కెస ముళ్ళున్నాయ్

కోడెతాచు కోరలున్నాయ్
వాటిని తెలుసుకొని - వైనం చూసుకొని
చివరికి ననుచేరుకుంటే
జాజులు మోజులు నీకేనోయ్
నవ్వులు పువ్వులు నీకేనోయ్





అమ్మాయే పుడుతుంది పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

అమ్మాయే పుడుతుంది - అచ్చం
అమ్మలాగే వుంటుంది
అబ్బాయే పుడతాడు - అచ్చం
నాన్నలాగే వుంటాడు
కోటేరులాంటి ముక్కు కోలకళ్లు...లేత
కొబ్బరంటి చెక్కిళ్లు చిలిపి నవ్వులు

ఆ నవ్వుల్లో వస్తాయి. చిన్ని నొక్కులు
ఆ నొక్కులే తెస్తాయి—మనకెన్నో సిరులు 

దోబూచులాడు కళ్లు_దొంగ చూపులు
తియ్య తియ్యని మాటలు - తెలివితేటలు
ఆ మాటలకే పడతారు కన్నెపిల్లలు
ఈ అత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్లు

నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు
ఉహు—మీలాంటి పిల్లాణ్ణి కంటాను నేను
ఇద్దర్నీ కంటె వద్దన్నదెవరు
ఆ ఇద్దరు అబ్బాయిలైతేనొ



చూస్తా బాగా చూస్తా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

చూస్తా బాగా చూస్తా
చేయిచూస్తా - చూసి చెబుతా
ముందు వెనక యేముందో - యెక్కడుందో
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా

కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు
వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు
రాజ్యాంగమందు నేడు రాహువున్నాడు.
రాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు.
ఏ ఎన్ ఆర్, ఎన్ టి ఆర్ ఏలుతారన్నాను
వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను
జగ్గయ్య, జయలలిత, శోభన్ బాబు, కృష్ణకి
పద్మనాభం, రమాప్రభ, రాజబాబుకి
దసరాబుల్లోడికి ప్రేమనగర్ నాయుడికి
ఆత్రేయ, ఆదుర్తి మహదేవన్ అందరికి
ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూంది
ఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది

వేలవేల యెకరాలకు గోలుమాలు
తాతల యెస్టేటుకైన చెప్పాలి టాటాలు

దిగమింగే నాయకులకు దిన గండాలు
పన్నెగ వేసే పెద్దలకు వెలక్కాయలు.
తాతయ్య పేరులో మనవళ్ళు పెరిగారు
మనవళు దోచింది మునిమనవళ డిగారు
అడుగునున్న వాళ్ళింక అణిగి మణిగి వుండరు
ఆడోళ్ళే ఇకమీదట అందలాన వుంటారు
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు.
చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు.

సంభాషణ: ఓ పండిట్ జీ మేరా హాత్ భీ దేఖియేనా
దేకుతా దేరుతా
అందుకే
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలేపొండి ॥చూసా॥



ఈ రేయి కవ్వించింది పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఈ రేయి కవ్వించింది
నా మేను పులకించింది
రా నీలో దాచుకొ
నా పరువాలే పంచుకో

చిలిపి మనసు నా మాట వినదు
దోరవయసు ఇకఊరుకోదు
మనసుమాటే విందాములే
వయసు ఆటే ఆడేములే
రా లోకం మరచిపో
లే ముద్దులలో మురిసిపో

నిండు వలపుల నీ కౌగిలింత
ఉండిపోని జీవితమంతా
కెంపు సొంపుల చెంపలు నావే
మధువులూరే అధరాలు నావే
రా…నాలో నిండిపో
నా ఆశలనే పంచుకో

పాలవెన్నెల కురిసేటివేళ
మల్లె పానుపు పిలిచేటివేళ
తనువులొకటై పెనవేసుకో
కన్నులొకటై కథలల్లుకోనీ
రా…ఎద పై వాలిపో
నా ఒడిలోనే సోలిపో




అబ్బాయే పుట్టాడు పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

అబ్బాయే పుట్టాడు - అచ్చం
నాన్నలాగేవున్నాడు -
దోబూచులాడు కళ్ళు ఇంకలేవని
తీయ్య తీయన్ని బంధాలు తీరెనని
తల్లిగా ననుచేసి తాను తప్పుకున్నాడు
ఆ కన్నతండ్రి పోలికతో కడుపుకోసి పోయాడు





పెట్టి పుట్టిన దానవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మంచివాడు (1974)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, ఘంటసాల

పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు - నీ
పుట్టుకే ఒక పండుగమ్మా మాకు

ఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు
అందులో ఎందరమ్మా పండుగలకు
నోచుకుంటారు - వుండి చూచుకుంటారు

కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో
నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో
నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు
నూరేళ్ళు నిండిపోతారు

ఉన్నవాళ్లు లేనివాళ్ళను భేదాలు
మనకెగాని మట్టిలోన లేవమ్మా 
ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా


No comments

Most Recent

Default