Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pandanti Jeevitham (1981)




చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, సుజాత, విజయశాంతి 
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 01.01.1981



Songs List:



అంతులేని అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అంతులేని అనురాగం అన్నగా
చెల్లిపోని మమకారం చెల్లిగా
జీవించు వెయ్యేళ్ళు చల్లగా
దీవించనీ నిన్ను అమ్మగా నాన్నగా వెరసి నీ అన్నగా 

చరణం : 1
ఒకే కొమ్మ పువ్వులం ఒకే అమ్మ దివ్వెలం
తొడిమిలేని తోటలో - ప్రమిదలేని గూటిలో
కలసి మెలసి నవ్విన కమ్మని చిరు నవ్వులం
అన్న అనే నేను రేపు నిన్నలో కలిసినా
చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళు పచ్చగా

చరణం : 2
పుట్టినింట ప్రేమతో మెట్టినింట పేరుతో
కాలు పెడితే కలిమిగా కంటిచూపు చెలిమిగా
మహలక్ష్మికి మారుగా మమతల బంగారుగా
కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా
అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్యుగా
నీకు చిరాయుష్యుగా




ఎదుటే ఒక అందం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
ఎదుటే ఒక అందం - ఎదిగే అనుబంధం
ఏలా ఈ పంతం- బాలా నా సొంతం వలపు వసంతం
విరిసే ఈ వేళలో పిలిచే రాగాలలో

చరణం: 1
అలకలు రేపిన పులకలు చూడు
వలపుల తీయని పిలుపులు చూడు
దాగని నవ్వులు దాచకులే నీబెట్టు లెందుకు చెల్లవులే
చిరు నవ్వో అరనవ్వో నవ్వాలిలే ॥ఎదుటే||

చరణం: 2
నడకలు నేర్పిన దానా నెమలికి నటనలు తెలిపిన దానా
వొంటరి తనమిక సాగదులే తుంటరిచూపులు సోకునులే
నీపైట రెప రెప మన్నదిలే... ఆపైన ఏమైనా అడగకులే ॥ ఎదుటే||




పండంటి జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పండంటి జీవితం - రెండింటి కంకితం
ఒకటి నీ మనసు
ఒకటి నీ మమత
మమతవున్నా మనసుకన్నా ఏది శాశ్వతము

చిలక పచ్చని చీరకట్టి మొలక నవ్వుల సారెపెడితే
పులకరింతల పూలు తెస్తున్నా
చిలిపి కన్నుల పలకరించి వలపు వెన్నెల చిలకరిస్తే
కౌగిలింతకు నేను వస్తున్నా

ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను
ఆ మాట నువ్వంటే నే దొరకను
ఇంత హొయలూ ఇన్ని లయలూ నాకు శాశ్వతము ॥పండంటి॥

సందెగాలికి జలదరించే అందమంతా విందు చేస్తే
వలపు పానుపు పరుచుకొంటున్నా
హాయి తీపిని మోయలేక సాయమడి సరసకొస్తే
మల్లె చెండే దిండు చేస్తున్నా మల్లె చెండే దిండు చేస్తున్నా.
ఎదలోన ఎదవుంది పొదరిల్లుగా 
నా యిల్లు నాకుంటే అది చాలుగా
మనసు వున్న మనువుకన్న ఏది శాశ్వతము





తగ్గు బుల్లెమ్మ తగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తగ్గు బుల్లెమ్మా తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు
అడాళ్లల్లో అందం చందం - అలకల్లోనే చూడాలంట
తళుకు బెళుకూ చూస్తూ వుంటా నీతో వస్తూంటా

తగ్గు బుల్లోడా తగ్గు సిగ్గు ఓరయ్యో సిగ్గు సిగ్గు
మగాళ్ల లో మాయా మర్మం - మాటలోనే చూడాలంట
చిటికో మెటికో వింటూ వుంటా నిన్నేచూస్తూంటా

కొబ్బరినీళ్లు చల్లనా తిమ్మిరి ఒళ్లు గిల్లనా 
అవ్వాయి చువ్వాయి … అమ్మాయిగారి అలకే తీర్చేయ్యనా
చూపుల గాలం వేయనా - నోటికి తాళం పెట్టనా
ఆడేటి, పాడేటి అబ్బాయిగారి నడకే మార్చెయ్యనా
రేపో మాపో చూద్దామంటే నేడే రేపట
కాస్తో కూస్తో యిస్తానంటే అంతే చాలంట కాస్తంతే చాలంట

పక్కన వుంటే వెచ్చన చుక్కల కేసే నిచ్చెన
మబ్బుల్లో పక్కేసి వెన్నెల విందు ఈ వేళ చేసెయ్యనా

చీకటి చీరలు కట్టనా - మాపటి మల్లెలు పెట్టనా
బుగ్గల్లో మొగ్గేసే చినదాని సిగ్గు కొనగోట మీచేయ్యనా
ప్రేమా గీమా అన్నావంటే పెళ్లే ప్రేమంట
హద్దూ పద్దూ వుండాలంటే ముద్దే చాలంట
ఈ ముద్దే చాలంట




పిలిచారు మావారు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

పల్లవి : 
పిలిచారు మావారు యిన్నాళ్లకి, పలికారు వీడ్కోలు కన్నీళ్ల
పల్లవి : 
తూరుపు పడమర లేక సూర్యుడే లేడని
భార్యను భర్తను కలపనిదేవుడే వుండడని

చరణం: 1
ఇలకు జారని చినుకు కడలి చేరని వాగు
భర్త ఒడిని గుడి కట్టని భార్య బ్రతుకు లేదని
తెలిసిందీ నా జీవన సంధ్యా సమయంలో
అందుక నే.…అందుకనే వస్తున్నా ఉదయించిన హృదయంతో 

చరణం: 2
పసుపు కుంకుమాచిందే పడతి జన్మ ధన్యము
పతి మమతే ఏనాటికి సతికి నిత్య సౌభాగ్యం
తెలిసింది అరుంధతీ మెరిసిన ఈ సమయంలో
అందుకనే ......
అందుకనే వస్తున్నా పండిన నా ప్రణయంతో




కొబ్బరి చెట్టుకు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల
ఉయ్యాలేసి వూపారే జంపాలా ఓయమ్మలాల ఓయబ్బలాల
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా ...
పుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా....

కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల
ఉయ్యోలేసి వూపారే జంపాలా - ఓయమ్మలాల ఓయబ్బలాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా .....
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా....

పాతికేళ్ళ వాడమ్మ బుజ్జి పాపాయి
పారాడలేడమ్మ బుల్లి బుజ్జాయి
ఈ గోల మానేందు కేమిచ్చుకోను
ఏ జోల పాటల్లూ నే నేర్చుకోను
గిల్లి పాడేందుకు తల్లి జోలెందుకు
గిల్లి కజ్జాలతో అల్లరింకెందుకు
తోడు నువ్వుంటే నా యీడు పూల ఉయ్యాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ.... వుంగా
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా

తూనీగ నడుమేమొ తూగుటుయ్యాల
రాయంచ నడకేమొ రాగ మియాల
ఆ ముద్దు మురిపాలకేమిచ్చుకోను
ఏ పాట నేనల్లి నిను మెచ్చుకోను
ఝల్లు మంటున్నది వెల్లు వౌతున్నది
వళ్లు మైమరచి నిన్న కుంటున్నది
ఊగిపోవాలిలే నేడు జోడు ఉయ్యాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ.... వుంగా
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా

No comments

Most Recent

Default