Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema Sagaram (1983)




చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి,  యస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: టి.రాజేందర్, గంగ, నళిని, సరిత 
దర్శకత్వం: టి.రాజేందర్
నిర్మాత: పి.స్వర్ణసుందరి
విడుదల తేది: 25.11.1983


ఈ చిత్రంలో గంగ,  నళిని కథానాయికలుగా తొలిసారిగా నటించారు 




Songs List:



బంతాడే బంగారు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మాధవపెద్ది రమేష్ 

బంతాడే బంగారు 



నామం పెట్టు నామం పెట్టు కాలేజికి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు 

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అల్లరి కళ్ళ పడుచు పిల్ల
చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం
అయ్యో చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అమ్మ ఊరేగని ఊరేగని యవ్వనం
అహ అహ అహ

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

ఆ..తకిట తకిట తా
అరె తళాంగు తకిట తా
అరె తరికిడితరికిడితరికిడి తా
అరె తకిడితకిడితకిడితకిడి తా

అయ్యయో.. అయ్యయో.. అయ్యయో.. అయ్యయో....
జీనతమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ భలే ఫోజు పెట్టి
జీనతమనులాగ చీర సగము కట్టి
జయమాలిని లాగ.. భలే ఫోజు పెట్టి

ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు
ఆదివారం నలుపు.. సొమవారం ఎరుపు
మంగళవారం పసుపు.. బుధవారం తెలుపు
నువ్వు వేసుకొచ్చే ఓణీలన్ని చూశామే
నీ బాడీలకు దాసోహమే చేసామే.. ఎహే ఎహే ఎహే

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అహ ఉం అహ ఉం అహ ఉం. అహ హుం...

అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల
ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు
అమావాస్య వేళ.. ఆకతాయి పిల్ల
ఎవరికో సైగ చేస్తే.. తనకనే తలచి ఒకడు

పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి
పౌడరెక్కువ పూసి.. చింపిరి జుట్టు దువ్వి
షోకులెన్నో చేసి.. వచ్చాడట పాపం
మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు
పచ్చి కారం కూడా కొడతారమ్మ కళ్ళలో
ఒహొ ఒహొ ఒహొ

నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి
నామం పెట్టు నామం పెట్టు కాలేజికి
చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికి

అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అల్లరి కళ్ళ పడుచు పిల్ల
అమ్మ చిందెయ్యని చిందెయ్యని నీ అందం
ఊరేగని ఊరేగని యవ్వనం
అరె చిందెయ్యని చిందెయ్యని నీ అందం
అయ్యో ఊరేగని ఊరేగని యవ్వనం
అహ అహ అహహ




అందాలొలికే సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ 

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు
చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల
దోర పెదవులే పలికే..ఏ..ఏ...
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే
మరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..

మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి
చెలి స్నేహం ఆ..ఆ..
పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ
పలవరింతలు రేపెను కోటి ..ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను

ఆఆఆ..రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ..



నీలో నాలో మోహాలెన్నో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

నీలో నాలో మోహాలెన్నో




హృదయమనే కోవెలలో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మాధవపెద్ది రమేష్ 

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవి గా ...

దేవత నీవని తలచీ కవితను నేను రచించా
అనురాగాలే మలిచీ ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే నీ చెవికది చేరక పోతే
జీవితమే మాయని చింతే జీవితమే మాయని చింతే !

నా ప్రేమకు మీరే సాక్షం నీ కోపము నిప్పుల సాక్షం
నీటికి నిప్పులు ఆరూ నీ కోపం ఎప్పుడు తీరు ?
నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే
నే లోకము విడిచిపోతా లోకము విడిచిపోతా!...




చక్కనైన ఓ చిరుగాలి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు 

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి..చిరుగాలి..
చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను
ఊపిరైన తీయలేను
గాలి..చిరుగాలి..
చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...

మూసారు గుడిలోని తలుపులను..
ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను..
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నా హృదయం..
కరువైపోయే ఆనందం..

అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అయిపోయె చెరసాల

గాలి..చిరుగాలి..
చెలి చెంతకు వెళ్ళి అందించాలి...
నా ప్రేమ సందేశం...

నా ప్రేమ రాగాలు కలలాయె..
కన్నీటి కథలన్ని బరువాయే
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం..
వెలుతురు నీదే రేపుదయం

శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను...
గాలి..చిరుగాలి..
చెలి చెంతకు వెళ్ళి అందించాలి...
నా ప్రేమ సందేశం...

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను...
ఊపిరైన తీయలేను
గాలి..చిరుగాలి..
చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...
ఈ నా ప్రేమ సందేశం...
ఈ నా ప్రేమ సందేశం




నీ తలపే మైకం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమసాగరం (1983)
సంగీతం: టి.రాజేందర్
సాహిత్యం: రాజశ్రీ
గానం: కళ్యాణం, యస్.జానకి 

నీ తలపే మైకం

No comments

Most Recent

Default