చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, మాధవపెద్ది, జేసుదాస్, రామకృష్ణ నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, కృష్ణం రాజు, లత, జగ్గయ్య, జమున, మోహన్ బాబు దర్శకత్వం: వై.ఈశ్వర రెడ్డి నిర్మాత: యం.యస్.రెడ్డి (మల్లెమాల సుందర రామిరెడ్డి) విడుదల తేది: 02.03.1979
Songs List:
పచ్చిమిరపకాయ బజ్జీలూ పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.జానకి పచ్చిమిరపకాయ బజ్జీలూ,.. బల్ పసందైన బుల్లి బజ్జీలూ... కారంలో... ఆకారంలో... నా బజ్జీలకు లేనేలేవు సమ ఉజ్జీలు మతిమరుపును పోగొడతాయి అతి తెలివిని పుట్టిస్తాయి... ఆజీర్తిరోగం వున్నవాళ్ళకి... ఆకలి ఘాటు చూపిస్తాయి. . . ఈతకల్లు ఈరయ్యైనా... ఇప్పసారా అప్పన్నైనా... బ్రాందీ... విస్కీ... దొరలైనా... నా బజ్జీలంటే పడిచస్తారు
సూరీడు యెదమిటినాడు... పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు సూరీడు యెదమిటినాడు... నా సొగసంత రవళించె నేడు... వెలుగుల వల విసిరేసి.... తొలి వలపులు కాజేశాడు... సుమబాల కనుగీటగానే... ఈ సూరీడు యెద మీటినాడు... కను... సైగలు చెలి విసిరాకే... తను.. వెలుగుల వల విసిరాడు ఎండా వెన్నెల రెండూ కాని ఏదో తీయని గిలిగింత ఉండీ లేని బిడియంలోనే ఊహలకందని పులకింత ఆ... గిలిగింత... ఈ... పులకింత కలిపికూడితే.. జగమంత అందీ అందని అందాలెన్నో ముందుపోసినది ఈ ఉదయం అంతేలేని ఆనందంలో హరివిల్లైనది నా హృదయం .. ఆ... హరివిల్లు... కురిసే జల్లు... అనురాగానికి పుట్టిల్లు
తాకకుండా తనువు దోచిన పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల, యస్.పి.బాలు తాకకుండా తనువు దోచిన తాను వరసకు ఏమౌతాడు...? తాళి కడితే మొగుడౌతాడు తరిమికొడితే సగమౌతాడు... మాటువేసి మనసుదోచిన మగువ వరుసకు ఏమౌతుంది? తాళి కడితే ఆలౌతుంది తరిమికొడితే తేలౌతుంది... కళ్ళతోనే గాలం వేసి ఒళ్ళుమొత్తం గాయంచేసి ప్రేమగందం పెదవికి రాశాడు... తన పిచ్చినాలో రెచ్చగొట్టాడు... చిలిపి తలపుల తలుపులు తీసి సిగ్గులన్నీ ఆవలతోసి పంటినొక్కులు నాపై రువ్వింది. అహ పడకటింటికి కాలు దువ్వింది...
అమ్మ... ప్రేమకు మారుపేరు...పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, జేసుదాస్ అమ్మ... ప్రేమకు మారుపేరు... ఆమ్మ మనసు పూలతేరు... ఆ తేరునీడా సోకగానే నూరు జన్మల సేదదీరు... మండు వేసవిలో ముంగిట వెలసిన మంచుకొండ మా అమ్మ పవలూ రేయీ ఆరక వెలిగే పరంజ్యోతి మా అమ్మ... ఆలనకైనా... పాలనకైనా ఆదిదేవత మా అమ్మ... జన్మ జన్మలా పున్నెమువలన... నీ కమ్మని కడుపున పుట్టాను... మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా తల్లివి నీవే అంటాను... కలలోనైనా... మెలకువనైనా నీ దీవెనలే కోరుకుంటాను...
నా మాటా రామబాణం పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, రామకృష్ణ నా మాటా రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం నా మాటా మన్మధ బాణం నా పత్రిక ప్రేమ పురాణం ఉచితంగా సెక్స్ జ్ఞానం రుచి చూపడమే నా ధ్యేయం చక్కెర బొమ్మకు మీసాలొస్తే చక్కని కాలక్షేపం... రాతిరి పూటా రాణీ పేటా రసికుల పాలిటి స్వర్గం ... కాలే కడుపుకు మండే గంజి కమ్మని అమృతపానం.. మంచిని పెంచి మనోవికాసం కలిగించేవి బుక్స్... మంచం పట్టిన మనిషిని సైతం కదిలించేది సెక్స్... నీతి రీతీ లేని పత్రికలు జాతిని పతనం చేస్తాయి తాతలనాటి పుస్తకాలు తలగడకే పనికొస్తాయి... నా మాట మన్మధ బాణం నా పత్రిక ప్రేమపురాణం నా మాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం
వయసు మళ్ళిన అందగాడా పాట సాహిత్యం
చిత్రం: రామబాణం (1979) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి.బాలు, యస్.జానకి వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందకాడా... అర్ధరాతిరౌతుంది. ఆరాటం పెరుగుతూంది ఆగలేను అందుకోరా... సిగపూలూ వాడలేదు అప్పుడే... చెక్కిలైనా కందలేదు ఇంతలోనే... ఎంత సేపని ఎదురుచూసేది ? నా కోసమేనా ? ఎప్పుడింకా మోజుతీరేది? ఆరినీ ఏయ్ పిల్లా ఊ... ఇదుగో రా దగ్గరికి రా ఊ… హూ…… హ పట్టుకోలే ననుకున్నావా ? ఏయ్... ఏమిటి? చక్కిలి గిలా ? మరుమల్లెల పక్కేశాను బలే పనిచేశావ్ మంచి గందం తీసుంచాను ఆహా ఇంతకన్నా ఏమి చేసేది ? బోలెడున్నాయ్ అంత సూటిగ ఎలా చెప్పేది? నే చెప్తాగా.... వగలమారీ కుర్రది వయసుమళ్ళి నేనున్నాని చూడు చూడు నావంక సోకు తగ్గలేదింక రంగేళి రామ చిలకా నిన్ను వదల్లేను చచ్చేదాకా నిన్ను వదల్లేను చచ్చేదాకా...
No comments
Post a Comment