Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sati Anasuya (1971)




చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: జమున, శారద, కాంతారావు, శోభన్ బాబు, రాజాబాబు, సత్యన్నారాయణ, ప్రభాకర్ రెడ్డి 
మాటలు: సముద్రాల జూనియర్
దర్శకత్వం: బి. ఎ. సుబ్బారావు
బ్యానర్: శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్
నిర్మాత: సుందర్లాల్ నహత
విడుదల తేది: 10.06.1971



Songs List:



ఆహా ఏమందు ఆ దైవలీల పాట సాహిత్యం

 
నారదుని పాట-1

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు 

ఆహా ఏమందు ఆ దైవలీల
ఊహాతీతము కాదా॥
వరములు కురిసే కరుణాంతరంగ
కలుషములన్నీ కడిగే గంగ
పాప పిశాచాల పొలాయెనౌరా ||ఆహా||



సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు పాట సాహిత్యం

 
సరస్వతి పద్యం-1

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సముద్రాల(జూ)
గానం: సుమిత్ర

సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు
అఖిల నాదాల కాధారమైన నేను
సరసి జాసను కూరిమి సఖియనేని
భస్మమైపోవుగాక ఈ పాపచయము



అష్టసిరుల నేలు యజమానురాలను పాట సాహిత్యం

 
లక్ష్మి పద్యం -2

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: విజయలక్ష్మి

అష్టసిరుల నేలు యజమానురాలను
హరియురంబు నందు వరలు చెలిని
నేను పరమ సాధ్వి నైనచో ఈ గంగ
విగత సకల దోషయగునుగాక!




అష్ట సిద్ధులకధిదేవి నైతి నేని పాట సాహిత్యం

 
పార్వతీ పద్యం-3

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: వనంత

అష్ట సిద్ధులకధిదేవి నైతి నేని
అఖిల లోకైక మాత నేనైతి నేని
అమర సాధ్వుల కారాధ్యనైతినేని
ఈ పిశాచగణము నశియించుగాక !




పతి సేవయె నాటికి జీవాధారము పాట సాహిత్యం

 
అససూయ పాట - 2

రచన: సముద్రాల (జూ)
పాడినవారు: పి. సుశీల

పతి సేవయె నాటికి జీవాధారము గాదా
సతికిలలో దైవము వేరేకలదా నాధుడే కాదా

చరణం: 1
పతిపదయుగమే మంగళకరము
పతిపదధూళియె శోభాకరము
పతియే సతి సౌభాగ్యము
పతిపదజలమే గంగాజలము
సతి తొలిజేసిన పూజాఫలము
పతియే సతికి లోకము
సతికిలలో దైవము వేరేకలదా నాధుడేకాదా
||పతిసేవయే||

చరణం: 2
పతి భుజియించిన శేషాహారము
అతివల పాలిట అమృతసారము
పతియే సతికి ప్రాణము
స్వామి సేవే ముక్తికి త్రోవ
సంసారాంబుథి దాటే నావ ....
సతికి పతియే మోక్షము
నతికిలలో దైవము వేరేకలదా నాధుడే కాదా
॥పతి సేవయే||



సకలావనినే నడిపినవారే పాట సాహిత్యం

 
నారదుని పాట-3

పాడినవారు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
రచన: డా. నారాయణ రెడ్డి

సకలావనినే నడిపినవారే
సతులను తమలో నిలిపినవారే
భార్యావశులము కాదన్నారే
నారదయాగం నడిపేది వారే॥
ఆహా ఏమందు ఆ దైవలీల
ఊహాతీతముకాదా ||



గంగాథరాయ గరుడధ్వజ వందితాయ పాట సాహిత్యం

 

అత్రి శ్లోకం - 4

పాడినవారు : పి. బి. శ్రీనివాస్

గంగాథరాయ గరుడధ్వజ వందితాయ
గండస్ఫుర ద్భుజగ మండల మండితాయ
గంథర్వ కిన్నర సుగీత గుణాత్మకాయ
హాలాస్య మథ్య నిలయాయ నమశ్శివాయ




ఓ చెలీ! అందాల వేళలో ఆనంద డోలలో పాట సాహిత్యం

 
నర్మద పాట.4

పాడినవారు: ఎస్. జానకి & బృందం
రచన : డా. నారాయణరెడ్డి

ఓ చెలీ! అందాల వేళలో ఆనంద డోలలో
అలవోలె తేలగా రావే ఓ చెలీ ॥
మందారం మాకందం మరుమల్లి మాలతి
మనసారా పిలిచెను లేవే
||ఓ చెలీ ||

చరణం: 1
ఆటో సుమబాల ఘుమ ఘుమలాడింది
ఇటో భ్రమరంబు ఝుమ్మని పాడింది
ఇదే రసానంద మౌనేమో
వసంతానుభవమేమో
వనమంతా నవ్వెనే
పరువం పరవశించెనే

చరణం: 2
మరులూరించే మలయసమీరం
కెరటాల ఉయ్యాల లూగెనే
చిలిపిగ సాగెనే జిలుగుపైట లాగెనే
నీల గగనమ్ము మిలమిలా మెరిసింది
నేడు జగమంతా మయూరమై కులికింది.
ఈ తెలియరాని అనుభూతి
తేనె లొలుకు నవగీతి
ఏనాడూ ఎరుగనే




నటనమే చూడరా పాట సాహిత్యం

 
రంభ నృత్యగానం - 5

రచన: ఆరుద్ర
పాడినవారు ఎస్. జానకి

నటనమే చూడరా
నా విలాసమంతా నీదేరా
ఓరచూపుల మనోజ్ఞ భావం
దోరవయసు మరాళనృత్యం
నగవు వగలు నవీన నాట్యం
లతాంగిశోభ నితాంతలాస్యమే ॥నటనమే ॥
రమణి హొయలే రసాల నిలయం
సుదతి సొగసే సుఖాల శిఖరం
వధువై మధువై వరించు పరువం
లభించె వలపు తరింపచేయరా ॥నటనమే ॥



ముల్లోకములకు కన్నతల్లులు పాట సాహిత్యం

 
నారద పాట - 6

రచన: డా. సి. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ముల్లోకములకు కన్నతల్లులు
మునులకు సురలకు కల్పవల్లులు
తగని అసూయకు తలపడినారే
ఎంతెంతవారైన ఇంతే అయారే
ఆహా ఏమందు అదైవలీల
ఊహాతీతము కాదా ॥




ప్రభూ దయానిధే పాట సాహిత్యం

 
అనసూయ పాట - 7

పాడినవారు: పి. సుశీల
రచన : కొసరాజు

ప్రభూ దయానిధే
దివ్యతేజా! ఓ నాగరాజా! జయశుభ చరితా
ఫణికుల జాతా! మమ్ముబ్రోవవా!
విశ్వహితా భయరహితా వినవే మా మొరా!
ఓ నాగరాజా!

చరణం: 1
నాగులచవితికి మరువక నీకూ
పాలు పోయుదుము కాదా -
పాలు పోయుదుము కాదా
మధుర మధురమగు పాయసముల
వేద్యము నిత్తుము కాదా!
నీ పూజ సేయుదుము కాదా!
పాలను పోసే పడతిని కానా
జాలిని చూపవు న్యాయమేనా నీ కిది ధర్మమేనా
విషంగ్రక్క చూచేవా-నాపతి ప్రాణం తీసేవా
పసుపు కుంకుమ నిల్పి కాపాడవా
ఓ నాగదేవతా!

చరణం: 2
మహావిష్ణుపానుపు వే-శివుని మెడలోనిహారము వే
భువిచేమోడ్పులం దెద వే-ఇటు సేయంగ నీకగునే
యుగము లెమారినా
జగములెమారిన
దైవముగా నిను ధ్యానింతుమూ
నిను పూజింతుమూ
దయలేదా! మామీదా! గుణభరితా
ఓ నాగదేవతా!



ఆలయమేలా అర్చనలేలా పాట సాహిత్యం

 
నర్మద పాట 8

చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా

ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా

ఆ దైవము నిజముగ ఉంటే
అడుగడుగున తానై ఉంటే 
గుడులేల, యాత్రలేలా?

పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా

పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం 
మదిలోన వెలిగే అందం గమనించునా
పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం 
మదిలోన వెలిగే అందం గమనించునా

ఈ లోకులతో పనియేమి
పలుగాకులు ఏమంటేమీ
నా స్వామి తోడురాగా 

పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా

ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా




ఎద్దుల బండీ-మొద్దులబండీ పాట సాహిత్యం

 
యుగళగీతం - 9

సుఖానంద్ & చంప 

రచన: కొసరాజు 
పాడినవారు : ఎల్. ఆర్. ఈశ్వరి, యస్.పి.బాలు 

ఎద్దుల బండీ-మొద్దులబండీ
కదలదు యీనాటు బండీ! |
చల్లంగ లాగు అంగేసి సాగూ
అలుపొస్తే అక్కణ్ణి ఆగూ॥
కూర్చున్నదానికి నీకేమి తెలుసు
నిల్చొని లాగే నాగోడూ

గుండ్రాయిలాగా ఉన్నావు బాగా
ఒక పట్టు పట్టేసి చూడూ
అప్పళంగాదూ దప్పళంగాదూ
తెడ్డేసి తిప్పటం కాదూ
ముప్పూట తింటావు-మొనగాడినంటావు
యీ కాస్త పని కోపలేవు ॥ ఎద్దుల
గప్పాలు చాలించి గంతేసిదిగివచ్చి
దమ్ముంటే ఒక చెయ్యి వెయ్యి

నేనొస్తె నీకెంతొ అవమానమయ్యేను
ఆదిగూడ నీ చేత్తో వెయ్యి
నాకర్మ కాలింది_యీరాత రాసింది
ఇంకేమి చెయ్యాలినేనూ
ప్రాణాలు బిగబట్టి - బలమంతచూ పెట్టు
పైనుండితోను నేనూ... హర్ హర్
||ఎద్దులబండీ||





నర్మద పద్యం - 4 పాట సాహిత్యం

 
నర్మద పద్యం - 5

రచన: డా. నారాయణరెడ్డి 
పాడినవారు పి. సుశీల

దాహమున ప్రాణనాధుని తనువుతూ లె
కాలవశమున నేనిట కూలిపోతి
పార్వతీనాథ! నాకింక పతిని కొలుచు
భాగ్యమందించి మమ్ము కాపాడవయ్య !



రతీ మన్మథుల గానం-10 పాట సాహిత్యం

 
రతీ మన్మథుల గానం-10

రచన : దాశరధి
పాడినవారు: ఎస్. జానకి, పి. బి. శ్రీనివాస్

ఓ చెలీ విడువలేనే నీ కౌగిలి
సొగసైన నీలి నింగీలో
తొంగిచూచె జాబిలి 
తలపు ఉయ్యాల లూగాలిరారా
గెలుపు మనదేర ఈ రేయిలో
కలసి ఆటలాడి పాటపాడే వేళలో
నేడు వనిలోన విరిసిన వాసంతశోభల

ఓ! మదన నవమోహనా ॥
తనువు పులకింప జేసేనురా
ఓ! మదన నపమోహనా!
మధువులు చిందెడ్ నీ చూపులే
నా మనసు దోచుకొనేలే....

తపసికైనను తాపంరేపే మోహం నింపే
నీ రూపం ఎంత అపురూపము
పంచశరా మదనా
సుకుమారా! నవమోహనా,
వెల్లువై ఇలకు దూకే తెలి వెన్నెల
చెలరేగి కూయు కోయిల
నీకు నాకు తోడుగా
జంటగా వలపు పంటగా
చెరకు వింటితో
పూలబాణం వేయాలిలే ॥



హిమగిరి మందిరా గిరిజా సుందరా పాట సాహిత్యం

 
అనసూయ పాట - 11

రచన : డా. నారాయణరెడ్డి
పాడినవారు: పి. సుశీల

సాకీ: హే ప్రభో !
గరళమ్ము మ్రింగి లోకములనే కాపాడి
ధరణిపై దయబూని సురగంగ విడనాడి
ప్రమధుల కొలువులో పరవశించేవా
తాండవార్భటిలోన తనువు మరిచేవా॥

పల్లవి:
హిమగిరి మందిరా గిరిజా సుందరా
కరుణా సాగరా మొరవిన రారా॥

చరణం: 1
భుజంగ భూషణా అనంగభీషణా
కరాళ జ్వాల లెగిసెరా
కావగరారా! ప్రభో శంకరా

చరణం: 2
పతి సేవయే జీవనమై నిలిచిన నేను
పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు
జటాచ్ఛటాధరా
జగద్భయంకరా
దురంత మాపి వేయరా
పరుగునరారా! ప్రభో ఈశ్వరా





నర్మద - పాటు 12 పాట సాహిత్యం

 
నర్మద - పాటు 12

రచన :డా. నారాయణ రెడ్డి
పాడినవారు: పి.సుశీల 

దినకరా జయకరా
పావనరూపా జీవనదాతా ॥

చరణం: 1
ప్రధమకిరణం సోకిననాడే
ప్రాణవల్లభుని పొందితిగాదా
మంగళ కరములు నీ కిరణమ్ములు
మాంగల్యమునే హరియించునా దినకరా

చరణం: 2
లోకములన్నీ వెలుగించుదేవా
నా కనువెలుగే తొలగించేవా
కరుణా సింధూ కమలబంధూ
ఉదయించకుమా ఓ సూర్యదేవా !
చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో
హరణా
సకలచరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్ధరణా
ద్వాదశాదిత్య రూపా రోదసీ కుహర దీపా,
ఉదయించకుమా ఉదయించకుమా ॥




నారదుని పాట - 13 పాట సాహిత్యం

 
నారదుని పాట - 13

రచన : డా. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ముద్దుల భార్యల ముచ్చటతీర
మువ్వురుమూర్తులు ఒకటైనారా
భార్యావశులో భక్తాధీనులో
విదితము సేయగ వెళుతున్నారా
ఆహా ఏమందు ఆ దేవలీల
ఊహాతీతము కాదా



త్రిమూర్తుల గానం - 14 పాట సాహిత్యం

 
త్రిమూర్తుల గానం - 14

రచన : డా. నారాయణరెడ్డి
పాడినవారు:పి. బి. శ్రీనివాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జయదేవ్

మంచి మనసును మించిన దైవం
మహిలో కలదా నరుడా ఇది
మరువకురా పామరుడా||

ముక్కు మూసుకొని నీటమునిగినా
మోక్ష సంపద దొరకదురా
చిత్తశుద్ధి లోపించిన పూజలు
చేసిన ఫలితం చిక్కద రా
దేవుని నామము లెన్నైనా దీ
వించే దైవం ఒక టేరా ॥
మంచి మనసును
తోటి మనిషినే అంటరాదని
గీటు గీసుకొని ఉన్నావా
కులమతాలనే కోటలు కట్టే
కుమ్ములాడుకుంటున్నావా
అందరు దేవుని సంతతియేనని
అసలు సత్యమే మరిచేవా




అనసూయ : పదం 5 పాట సాహిత్యం

 
అనసూయ : పదం 6

రచన :సముద్రాల (జూ)
పాడినవారు: పి. సుశీల

పతియే దైవంబుగా నెంచు పడతినేని
స్వామి పదసేవ మరువని సాధ్వినేని
నన్ను అవమాన మొనరింపనున్న మునులు.
ఈక్షణమునందె పాపలయ్యెదరు గాక !



నాదదుని పాట - 15 పాట సాహిత్యం

 
నాదదుని పాట - 15

రచన: డా|| నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

పసితన మెరుగని పరమమూర్తులే
పసితన మేమిటో చవిచూసినారా
పతిసేవనలో బ్రతుకును గడిపే
సతి మహిమను చాట సమకట్టినారా
ఆహా ఏమందు ఆదైవలీల
ఊహా తీతము కాదా ॥



ఎన్ని జన్మల ఎన్ని నోముల పాట సాహిత్యం

 
అనసూయ పాట - 16

రచన: డా॥ నారాయణరెడ్డి
పాడినవారు: పి. సుశీల & బృందం

ఎన్ని జన్మల ఎన్ని నోముల
పుణ్యమో ఈనాడు కంటిని
జగములూపే ముగురు మూరులె
చంటి పాపలు కాగా । మా
యింట వూయల లూగ !!
లాలీ | లాలీ
బృందం : లాలీ | లాలీ
నొసటి వ్రాతలు వ్రాసి వ్రాసీ
విసిగినావో నిదురపో

బృందం : బ్రహ్మయ్య తాతా నిదురపో
అసుర కోటుల దునిమి దునిమి
అలసినావో నిదురపో
బృందం : నారయ్య నాన్నా నిదురపో
ప్రళయ తాండవమాడి ఆడీ
సొలసినావో నిదురపో
బృందం: శివయ్య బాబూ నిదురపో
లలిత కళలకు నిలయమైన
వాణియే నాకోడలాయె
బృందం: లాలీ జయలాలీ

లాలితముగా సిరులనొసగే
లక్ష్మియే నా కోడలాయె
బృందం: లాలీ శుభలాలీ
పతిని కొలిచిన భాగ్యమేమో
పార్వతియె నా కోడలాయె
బృందం: లాలీ ప్రియలాలీ 

No comments

Most Recent

Default