చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ దర్శకత్వం: వి.మధుసుదనరావు నిర్మాత: జి.సత్యనారాయణరాజు విడుదల తేది: 11.01.1980
Songs List:
శంభో హరహర పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు శంభో హరహర.... భోళాశంకర వినరా వినరా జంగం దేవర శివశివ శంకర....యివరం సెప్పర బస్తీ బాబులకు... అరెరెరెరే .... నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే ఎట్టాంటోడో తెలిసేందుకు..... రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥ సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥ పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....? ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥
నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు నిన్నా మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో ఎంత ఎదిగినావే........ పెళ్ళీడు వచ్చింది అమ్మాయి పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని ఉబలాటపడ్డాను చూద్దామని ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో చూశాను చెల్లీ.... మన తల్లిని.... ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం ఓర్వనిదైనా..... తప్పని దూరం ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల ఏనాటికైనా ....అది ఆడపిల్ల చేశానమ్మా..... నే చేయగలది ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి
మేకారే మేకా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ మేకారే మేకా .... హే.... మేకా తోకారే తోకా... హే.... తోకా మిల మిలలాడే కన్నులతో మిస మిసలాడే వన్నెలతో చుర చురలాడే చూపులతో కొర కొరలాడే కోర్కెలతో బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ ఒకరిని ఒకరు ఒరుసుకొని ముందూ వెనకా వెనకా ముందూ ముందూ వెనకా వెనకా ముందు ముందుగ వెళుతుంటె .... పెట పెటలాడే పదహారేళ్ళు చిమ చిమలాడే యిరవై యేళ్ళు చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు బరిలో దూకే పందెం కోళ్ళు కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ పిట్టల్లాడు కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా ఒకరిని ఒకరు తరుముకొని పగలూ రేయీ రేయీ పగలూ పరుగులు తీసూ ఉరకలు వేసు పడుతూ లేసుంటే....
గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ గీతా .... ఓ గీతా .... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ రాజా....ఓ రాజా.... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ పర దేశంలో.... ఆవేశంలో ప్రేమించిన మనకనుమతి .... బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో మనవాడినచో అనుబంధం ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును అనురాగ బంధం ముడివేసుకోనీ చిరునవ్వులతో పులకింతలతో వికసించిన మధువనం యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో మురిపించే బిగికౌగిలి జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ
నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల అనురాగ శిఖరాన అందాల తోట ఆ చోట కోనేట సయ్యాటలాడాలి కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి మువ్వల రవళి మోహన మురళీ మధురం మధురం మానసకేళీ
No comments
Post a Comment