చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరథి, ఆరుద్ర, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాత: నిడమర్తి పద్మాక్షి, యన్.పుష్పా భట్ విడుదల తేది: 14.04.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విచిత్ర జీవితం (1978) 4. విజయ (1979) 5. బొమ్మాబొరుసే జీవితం (1979) 6. చెయ్యెత్తి జై కొట్టు (1979) 7. జూదగాడు (1979) 8. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 9. మంగళ గౌరి (1980) ఈ తొమ్మిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
నా కోసం .... ఆనందం పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నా కోసం .... ఆనందం నీ కోసం .... అనురాగం మదిలో నిండిపోనీ విరిసే వయసుంది ... పిలిచే వలపుందీ విడరాని బంధం మనది నా కోసం .... ఆనందం నీ కోసం అనురాగం మదిలో నిండిపోనీ విరిసే వయసుంది పిలిచే వలపుందీ విడరాని బంధం మనది మురిపించే గాలి విరబూసే పూలు ఆటాడే కురులు వేటాడే కనులు మురిపించే గాలి నిరబూసే పూలు ఆటాడే కురులు వేటాడే కనులు నీ కౌగిట నేనుండే నీ సందిట నేనుంటే పొగమంచు పరదాలో మన మొకటె పోకుంటే తీరాలి మనలోని ఆశ కలిసిన హృదయాల కదలిన అధరాల పొంగింది మన ప్రేమ మధువు చెలి చూపుల సెగలో నులివెచ్చగ ఉంది బిగి కౌగిలిలోనే సొగసంతా ఉంది.... సిరి మల్లెల పొదరింట కలిసెనులే మన జంట నీలాల గగనాల మేఘాల పెనవేసుకోవాలి మనము కీలకిల నవ్వులతో వలపుల పువ్వులతో ముద్దాడు కోవాలి మనము ముద్దాడు
బంగినపల్లి మామిడిపండు పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఒలె ఒలె ఒలె బంగినపల్లి మామిడిపండు మంగినపూడి మల్లె చెండు కాపు కొచ్చింది అరెరె కన్ను కొట్టింది ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం ఒలె ఒలె ఒలె సందకాడ సందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అరెరె.... దోచుకున్నాడు తొంగి చూశాడు అమ్మమ్మో దోచుకున్నాడు. ఓ.... రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ....ఎగరేసుకు పోతేనే అందం ఎన్నాళ్ళీ పస్తులుంటే చిచ్చు కొడతాడు కొడుతుంది రెప్పచాటు చూపుతోనే రెచ్చగొడుతుంది అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందదమ్మో అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందమ్మో ఓ....రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతా ఇది పందెం ఒలే ఒలే ఒలె సందకాడ చందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అమ్మమ్మో దోచుకున్నాడు ముద్దంటే పొద్దువాల నివ్వమంటుంది పొద్దువాలి పోగానే నిద్దరంటుంది అందాలు పక్కేసి ఆరాట పెడుతుందమ్మో ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం పూతరేకు కోక మడత విప్పమంటాడు పూల పల్లకి ఎక్కమంటూ పోరు పెడతాడు కల్లోకి వస్తుంటాడు కాటేసి పోతుంటాడు. ఓ రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నాకోసం ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతేనే అందం ఒలే ఒలే ఒలె బంగినపలి మామిడిపండు మంగినపూడీ మల్లెచెండు కాపుకొచ్చింది అరెరె..... కన్నుకొట్టింది సందకాడ చందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అమ్మో దోచుకున్నాడు తొంగి చూసాడు అమ్మమ్మో దోచుకున్నాడు
అల్లి బిల్లి చిట్టిపాప పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల & కోరస్ అల్లి బిల్లి చిట్టిపాప మన మందర మొకటే చిట్టిపాప ఆడుతు పాడుతు చదవాలి ఆ చదువే సంపద కావాలి ఆవుల రంగులు వేరైనా పాలది ఒకటే రంగు పూవుల రంగులు వేరైనా పూజ మాత్రం ఒకటే ఎన్నో పేరులు ఉన్నా దేముడు మాత్రం ఒకడే ఆ సత్యం తెలియాలి సఖ్యత కలపాలి గాలి నేల నీరు నిప్పు ఆకాశం అయిదు కలసి రూపొందెను ఈ భూగోళం ఎన్నో జీవులు ఉన్నా మానవ జన్మే మిన్నా ఆ.... మనిషిగ బ్రతకాలి మంచిని పెంచాలి సూర్యుని కిరణాలెంతో వేడిగా ఉంటాయి సంద్రపు నీళ్ళు ఎండకు ఆవిరి అవుతాయి ఆవిరి మబ్బులు కాగా వానలు కురియును బాగా ఆ ఎండలు ఉంటేనే వానలు పడతాయి వానలు పడితేనే చేనులు పండేది. ఆహా....!
ఓ... చంద్రమా... పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల ఓ.... చంద్రమా .... ఒకనాటి ప్రియతమా ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా .... నీవు నాకు చేసిన బాస నీటి మీద రాసిన రాత తాళి కట్టిన కలువ కన్నా తళుకు లొలికే తారమిన్నా రోజూ మారే రూపం నీది మోజు పడిన పాపం నాది కలలే మార్చి కలలే చెరిపి మనువు మార్చి మంటలు రేపి మచ్చ పడిన మనసు నీది చిచ్చు రేగిన మనసు నాది కట్టగలవు మెడకో తాడు కన్నె వలపుకే ఉరితాడు
గుమ్మాడమ్మా గుమ్ముడి పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గానం: పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) గుమ్మాడమ్మా గుమ్ముడి గోకుల మంతా సందాడి వన్నెల కృష్ణుని చిన్నెలు వింటే మనసులు నాట్యం చేసేనమ్మ అల్లరి వాడమ్మా వన్నెల కృష్ణుడు చిన్నెలు వింటే మనసులు నాట్యం చేసేనమ్మా ఆల్లరి వాడమ్మా.... సంజవేళ స్నానం చేసి నీళ్ళు తెస్తుంటే మరుమల్లె పూల తోటలోన ఒంటిగ వస్తుంటే నా వెనక వచ్చాడు నా కళ్ళు మూసాడు ఒళ్ళంతా తడిమాడు ఒంపులే వెతికాడు నును సిగ్గు మొగ్గలు మీటి తొలి వయసు వాకిలి దాటి చుక్కల క్రింద పచ్చిక మీద పానుపువేసి రమ్మన్నాడే తుంటరి వాడమ్మా ఆరుబయట ఆదమరచి నిద్దరపోతుంటే నా జారు పైట చల్ల గాలికి జారిపోతుంటే నీడల్లే వచ్చాడు నిద్దట్లో లేపాడు సద్దయిన కాకుండా ముద్దివ్వ మన్నాడు గాలిలాగ చుట్టేసాడు పైటలాగి వాటేసాడు ॥గుమ్మాడమా తెల్లారేక తెలిసిందమ్మా నలిగిన పక్క నవ్విందమ్మా కొంటె వాడమ్మా
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ నీ నుదుట తిలకమ్ము దిద్ది నిత్య కల్యాణిగా చూసుకోని ఎన్నేళ్ళు వేచింది మనసు కన్నీరు కాగింది బ్రతుకు ఈ నాటి ఏకాంత సమయం ఏ రేయి లేనంత మధురం చెలియా ఈ మౌన వేళ నన్ను అల వోలె చెలరేగి పోనీ ఎవరైన ఎ వేళననైనా మన జాడ గమనించరారు జగమేలు పరమాత్ముడైనా మన జంట విడదీయ రాడు (దు) నీ కళ్ళలో నేను దాగి నిన్ను నా గుండెలో దాచుకోనీ కావాలి ఎన్నెన్నో కనులు నిన్ను కరువారగా చూసుకోను కావాలి ఎంతెంతో కాలం తీపి కలలన్నీ పండించుకోను రగిలే ఈ హాయిలో నా నన్ను బ్రతుకంత జీవించిపోనీ
No comments
Post a Comment