Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Circus Ramudu (1980)




చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
నటీనటులు: ఎన్.టి.రామారావు, జయప్రద, సుజాత
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కోవై చెలియన్
విడుదల తేది: 01.03.1980



Songs List:



అక్కాచెల్లెలు పక్కన చేరి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
అక్కాచెల్లెలు పక్కన చేరి బావయ్యంటే ఎట్టా
సుక్కల మద్దిన సెంద్రుడిమల్లే సిక్కునపడతాపిట్టా
అక్కపిట్టొ చెల్లిపిట్టొ పెద్దపిట్టొ చిన్నపిట్ట

చరణం: 1 
నాకు ఆకలా ఆగిచావదు.
నాకు దప్పికా తీరిచావదు
ఇద్దరు కలిసి ముద్దగ చేసి
నమిలేస్తుంటే ఎట్టా
ముద్దుల మద్దెల దరువులు వేసి
నడిపిస్తుంటే ఎట్టా
అక్క పిట్టొ చెల్లిపిట్టా గిల్లియిట్టా చంపకంటా

చరణం: 2
నాకు రేగితే ఆగిచావదు
జోడు పడవల స్వారి ఆగదు.
ఒక్కదెబ్బకే జంటపిట్టలు
ఎపుడో కొట్టిన వాణ్ణి
అదే దెబ్బకే చుక్కలు వెయ్యి
మొక్కిన భల్ మొనగాణ్ణి
అక్కపిట్టా చెలిపిట్టా ఆటపాట కట్టిపెట్టా

అక్కా చెల్లెలు పక్కనచేరి బావయ్యంటే ఎట్టా
సుక్కల మద్దిన చంద్రుడి మల్లె సిక్కునపడతా పిట్టా
అక్క పిట్టా చెల్లిపిట్టా పెద్ద పిట్టా చిన్నపిట్ట



ఘల్ ఘల్ మంది పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఘల్ ఘల్ మంది ఘల్ మంది గజ్జెల గుర్రం
వెయ్ వెయ్ మంది వెయ్య మంది వెయ్యర కళ్ళెం
కత్తి కట్టిన కోడి కన్నా వాడి దీనివయ్యారం
కూత కొచ్చిన పుంజు కన్నా మోత వీడియవ్వారం

చరణం: 1
తొలకరివే నువ్వయితే- తొలిచినుకే నేనయితే
కురవాలి నాపరుపం తడవాలి నీ అందం
చలికి నువు తోడయితే తెలిసి నీజోడయితే
గెలవాలి నా పందెం నిలవాలి మన బంధం
ఓరి దీని అందాలు ముందర కాళ్ళ బంధాలు
చంద్రగిరి గంధాలు చిలికిందిరో

చరణం: 2
అమ్మాయినడుమేదో సన్నాయి పాడింది
రవ్వంత కవ్వింత రాగాలు తీసింది
నీచూపే తగిలిందీ నావలపే రగిలిందీ
ఒళ్ళంత వయ్యారం తుళ్ళింత లాడింది
ఓరి దీని ముద్దంట చక్కల గిలిపొద్దంట
చుక్కల గిరి హద్దంట తెలిసింది రోయ్




సూరీడు చుక్కెట్టుకుంది పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, వాణీజయరాం 

పల్లవి:
సూరీడు చుక్కెట్టుకుంది
జాబిల్లి పువ్వెట్టుకుంది
పదలి చీరాగట్టి గోదారి పై టేసి
కడలి వస్తూన్నాది భూదేవి
భూదేవిలా నచ్చె నాదేవి

సూరీడు చుక్కెట్టుకుంది
జాబిల్లి పువ్వెట్టుకుంది
చలి చీరా గట్టి గోదారిపై చేసి
కదలి వస్తున్నాది భూదేవి
అభూదేవిలా వచ్చె నీదేవి

చరణం: 1
ముద్దు ముద్దుకీ పొద్దు పొడవాలి 
ముద్దబంతి పూలు పూయాలి
ఎండా వానా కురిసిపోవాలి.
గుండెలో ఎన్నెల్లే మిగలాలి

చుక్క మల్లె పూల పక్కమీదనేను
మబ్బు చాటున నీకు మన సిచ్చుకోవాలి.
పెదవికి పెదవులే ప్రేమకు పదవులై
జీవనమధువులై అందిన వేళ

చరణం: 2
పువ్వు పువ్వునా నువ్వు నవ్వాలి
పూల రుతువునై నేను మిగలాలి
పూలరుతువు నూరేళ్ళ ఉండాలి
ఆ--పులకరింత వెయ్యేళ్ళు పండాలి
పాలు పొంగే వయసు పట్టే మంచం మీద
కొంగు చాటున వలపు గుడి కట్టు కోవాలి.
తనువుకు తనువుగా తని నే తీరగా
మనసే మనుపుగా కలిసే వేళ




రాముడంటె రాముడు పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
ఏవండోయ్ - లేడీస్
ఏవండోయ్ - మిస్టర్స్ 
రాముడంటె రాముడు సర్కస్ రాముడు
సర్కస్ రాముడు... సర్కస్ రాముడు
సర్కస్...సర్కస్...సర్కస్... సర్కస్ రాముడు

చరణం: 1
పర్మిట్ పక్షుల రాజ్యంలో డామిట్ బ్రతుకే సర్కస్
లిక్కర్ పర్మిట్ చక్కెర లైసెన్స్
అడిగావంటే సైలెన్స్
మంత్రి గారికి దణ్ణం పెట్టు డూడూడూడూడూ
ఆఫీసర్లకి హారతి పట్టు డూడూడూడూడూ
చెప్పేవి శ్రీరంగ నీతులు
తీసేవి చల్లంగ గోతులు
నీతిలేని ఈ సర్కస్ కన్నా కోతులు చేసే సర్కన్ మిన్న
సిస్టర్స్ నోటియర్స్
బ్రదర్స్ నో ఫియర్స్
ఐయామ్ ఆల్వేస్ యువర్స్

చరణం: 2
కన్నెపిల్లకి పెళ్ళి చెయ్యడం కన్నతండ్రి కో సర్కస్
కడుపున కాళ్ళు పెట్టి బ్రతకడం కష్టజీనికో సర్కస్
అల్లుడి గారికి కట్నం పెట్టు డూడూడూడూడూ
అలిగి నప్పుడు కాళ్ళే పట్టు డూడూడూడూడూ
శ్రీకృష్ణ పరమాత్మ పింఛము
శ్రీరస్తు శుభమస్తు లంచము
మనుషులు చేసే సర్కస్ కన్నా మృగాలు చేసే సర్కన్ మిన్న




ఆకలి మీద అడపులి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఆకలి మీద అడపులి దీన్ని
ఆపలేను భజరంగ బలి
మిర్రి మిర్రి చూస్తాది చిర్రు బుర్రుమంటాది.
మింగిందా గోవిందా హరి హరి హరి హరి
ప్రేమే ఎరుగని పెద్దపులి దీని
మనసు మార్పు భజరంగబలి
గుర్రు గుర్రు మంటాది - గుచ్చి గుచ్చి చూస్తాది.
మింగిందా గోవిందా హరి హరి హరి హరి

చరణం: 1
తగల మాక నాయెంటబడి
తల్లీ నీకో దండం పెడతా
ఎనక్కి తిరిగి వెళ్ళకపోతే
ఏనుగు తొండం పెట్టి కొడతా
దండ యాత్రలకు బెదిరేదాన్నా
దండం పెడితే వదిలే దాన్ని
సరసం కాస్తా విరసం చేస్తే
నీతో సర్కస్ చేయించేస్తా

చరణం: 2
తోక ఒక్కటే తక్కువ గాని
కోతి బుద్ధి ఈ కోమలిది
మచ్చ ఒక్కటే తక్కున గాని
అమావాస్యలో జాబిలిది
కొండ ముచ్చువని తెలిసే వచ్చా
కొబ్బరంటి నా మనసే యిచ్చా
చీ చీ ఫో పో అన్నా వంటే
సింగం నోట్లో తల దూరుస్తా



ఓ బొజ్జగణపయ్య పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
నీ సవితెప్పుడో సెప్పవయ్య
నా సవితెవ్వరొ సెప్పవయ్య
ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య
నీ సివితెప్పుడో సెప్పవయ్య
ఈ సవితి పోరే తీర్చవయ్య

చరణం: 1
సంపంగితోటలో సనజాతి పువ్విస్తే
కొంపంటుకున్నట్టు గగ్గోలు
ఎన్నెట్లో జతగలిసి ఎచ్చగా కవ్విస్తే
తేళ్ళు కుట్టినట్టు సోకాలు
కిటుకేమిటో చెప్పు స్వామి అటుకులే పెడతాను స్వామి
ఉన్నదేమిటో చెప్పు తండ్రీ ఉండ్రాళ్ళు పెడతాను తండ్రీ

చరణం: 2
సందకాడ తనకు సలితిరిగినాదంటే
పులిమీద పుట్రలా యమగోల
సుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే
కళ్ళతోనే కాల్చి చంపాలా?
గొడవేమిటో చెప్పుస్వామి వడపప్పు పెడతాను స్వామీ
పూనకం తగ్గించు తండ్రీ పానకం పోస్తాను తండ్రీ

చరణం: 3
ఈణ్ణి నమ్మినాకు ఈడొచ్చి కూకుంది
దాన్ని నమ్మిగుడె గూడెక్కి కూసింది
వళ్ళు చూస్తే దాన్ని వాటేయమంటుంది
బుద్ధి చూస్తే వద్దు వద్దు పొమ్మంటుంది.
చెరకు పెడతా నీకుస్వామి చేసెయ్యి మా పెళ్ళి స్వామి
టెంకాయ కొడతాను తండ్రీ లగ్గమెప్పుడో చెప్పుతండ్రీ





అమావాస్యకి, పున్నమికి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కస్ రాముడు (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అమావాస్యకి, పున్నమికి రేగిందంటే మామో
పంబ రేగుతుందిరో మామో
మామ మామ మామ చీ పో చీమా దోమా

చరణం: 1
పిచ్చినాకు ముదురుతుంటే కచ్చనాకు పెరుగుతుంటే
చచ్చి సున్న మవ్వకుంటే ఒట్టు పెట్టు.. నీ
చచ్చు పుచ్చు నాటకాలు కట్టి పెట్టు 
వాటేసుకోబోయి పోటేసి పోతాను అరె అరె అరె అరె 
కాకెత్తి పోతోంది పిచ్చిగాలి నువ్వు
కాకి చూపు చూశావా బలి బలి బలి బలీ

చరణం: 2
బుద్ధి లేని మామ కంట బుర్రరామ కీర్తనంట
నీదుకాణ మెందుకంట కట్టి పెట్టు-నీ
తద్దినం పెట్టుకుంటే ఒట్టు పెట్టు
చిక్కాడే చిట్టి నాయనా- నాచేత
చిక్కి బక్క చిక్కి పోయినాడే
చేత కాక బిక్క చచ్చిపోయినాడే

చరణం: 3
అల్లుడంటే అర్థమొగుడు తగులు కుంటే అసలు మొగుడు
వళ్ళు గుళ్ళ చేయకుంటే లిట్టు తిట్టు- 
నిన్ను వళ్ళకాట్లో పెట్టకుంటే పట్టు పెట్టు
చుక్కెదురే మావయ్యో
దిక్కెవరూ లేరయ్యో
అత్తకు చెబితే పరువే హోగయే

No comments

Most Recent

Default