చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ, డా॥ సి.నారాయణరెడ్డి నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ, రాజశ్రీ దర్శకత్వం: బి.విఠలాచార్య నిర్మాత: పింజల సుబ్బారావు విడుదల తేది: 12.03.1970
Songs List:
శుక్లాంబర ధరం విష్ణుమ్ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: మాధవ పెద్ది, సావిత్రి శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్ శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
సకల విద్యామయీ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: ఘంటసాల సకల విద్యామయీ ఘన శారదేందు రమ్య పాండుర రూపిణీ రాజతార్థ విద్యలెల్లను నేర్చితి, విమల మార్గ దీక్ష నడిపింపుమా, భారతీ నమస్తే
నాదు గురుదేవు కార్యార్ధి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: ఘంటసాల నాదు గురుదేవు కార్యార్ధి నౌచు నేడు వచ్చితిని, ఎట్టి విఘ్నముల్ బడయకుండ కరుణ దీవింప వేడితి కరము మోడ్చి విజయమును గూర్పుమా! నమో విఘ్నరాజా ! !
పొన్న చెట్టు మాటున పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.జానకి పొన్న చెట్టు మాటున పొద్ధువాలి పోయింది గున్న మావి గుబురున కోయలమ్మ కూసింది పల్లవి: హేయిరే పైరుగాలి ఆగి ఆగి యిసిరింది. అరెరె పైట చెంగు ఆగలేక ఎగిరింది. వయసే వాగులాగ దూకింది. గుండెలో కొండమల్లె గుబాళించి నవ్వింది చరణం: 1 గడుసరి సూరీడు పడమట చేరాడు ఇంపైన సందెపడుచు చెంపలు రెండు గిలాడు అది తలచుకుంటె వలమాలిన పులకరింత అది తెలుసుకుంటే చిలిపి సిగుల చిలకరింత చరణం: 2 నచ్చిన చినవాడు మెచ్చిన జతగాడు నాపైన మనసుపడి రేపో మాపో రాకపోడు వాడు వెంటబడితే జంట గూడితే యెన్నెలపంట వాడి కంటి పాపలో కొంటె సూపునై కాపురముంటా
కిలకిల బుల్లెమ్మా పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఘంటసాల, యస్.జానకి కిలకిల బుల్లెమ్మా ! ఒహెు! ఒహెు కిలాడి బుల్లెమ్మా నీ ఒంటిమీద చెయ్ ఎయ్యంగానే వులిక్కి పడతావే బడాయి మాఁవయ్యో: ఉహు: ఉహు: ఉహు: ఆడావు డేందయ్యో! నువు పట్టపగులే నను పట్టుకొందవూ పరువు పోతదయ్యో నీ బి త్తర సూపులు సూసీ నీ నడకల వూపులు సూసీ నా మనసూ జిల్ జిల్ మంటాదే సేతులోన సిక్కినావు, బూకరించి పోలేవు సిగ్గు వొదిలి రావే నాదానా కన్నెపడుచు కంటబడితే నమ్మి కాస్త దగ్గరకొస్తే మొగ వోళ్లూ సైగలు చేస్తారూ ఒళ్ళుపైన తెలుసు కోరు యెనక ముందు సూసుకోరు యెర్రెక్కి పైన బడతారూ మీ సంగతి తెలుసును లేవే ముందట్టా చెబుదురులేవే నేనెరగని వాళ్లా పోవే ఎగిరి ఎగిరి పడతారు బిగువు కాస్త సూపుతారు సల్లంగ దారి కాస్తారూ ! ఎవరూ ? మీరూ! అవ్వ ! అవ్వలేదు బువ్వలేదు రా నవ్వులాట కాదులే పో పో రా - పో రా - పో
గత సువిజ్ఞాన పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: ఘంటసాల గత సువిజ్ఞాన ప్రకాశమ్ము మరల కల్గించితివి తల్లీ కారుణ్యవల్లీ జయ తిమిరి నిర్దూత దరహాస వల్లరీ జయప్రణవ నాదాత్త ఝంకార బంభరీ సకల సంపత్కరీ జ్ఞానేశ్వరీ నమో ...
జో జో లాలి లాలి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: పి.సుశీల జో జో లాలి లాలి లాలీ చిన్నారి పాపాయి లాలీ ఎన్నెన్ని జన్మాల పుణ్యాల ఫలమో ఈ తల్లి ఒడిలోన వెలిశావు తండ్రీ నా కంటి పాపా నిదురింప వోయీ నా పాల యెదలోని దీపాని వోయీ హాయీ హాయీ హాయీ!
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే నీ రూపులోన నీ చూపులోన ఏ రాచ కళలో మెరిసేననీ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే ఆద్యుడేద ఏ కొంటె ఎరుడో గంధర్వ వీరుడో నా కళ లోన నవ్వేననీ చరణం: 1 కులికే వయసే పులకించిపోగా కొంగు ఆగుతుందా ఎదలో కదలే పొంగు ఆగుతుందా పువ్వల్లే మారిపోయి - ముద్దుల్లో తేలిపోయి కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా చరణం: 2 వలచే జాబిలి యిలపైన రాగా కలువ దాగుతుందా విరిసే మురిసే తలపు దాగుతుందా తీగల్లే అల్లుకుంటే - ఓ ఓ గుండెలో ఝలుషంటే ఆమె: ఓ ఓ దాచినా దోరవలపు దాగుతుందా
రా వెన్నెల దొరా పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ఆహా హ అహ హ అహ హ ఓహో ఓ ఓ ఆహ హ హా రా వెన్నెల దొరా కన్నియను చేరా రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ రా వెన్నెల దొరా కన్నియను చేరా రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ నీ మగసిరి నగవులు చాలునులే నీ సొగసరి నటనలు చాలునులే నీ మనసైన తారను నే కానులే రా వెన్నెల దొరా వింత కనవేరా రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా ఎద నిండిపోరా చందమా ఆ ఆ నీ పగడపు పెదవుల జిగి నేనే నీ చెదరని కౌగిలి బిగి నేనే నా ఎద నిండ నీవే నిలిచేవులే రా వెన్నెల దొరా కన్నియను చేరా రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ రా వెన్నెల దొరా వింత కనవేరా రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ
నా వయసు సుమగంధం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: పి.సుశీల, విజయలక్ష్మి నా వయసు సుమగంధం నా మనసు మకరందం కొని పోవోయి వలపుల నా రాజా అందగాడా జలకాలాడే సుందరి నీకె వేచిందీ. సిగు సింగారాల బిగువూ చూచె లేవే సిగ్గు నిండారంగ నిన్నే కోరి చేరె అయ్యొ, యింతేన మరియే మొ అనుకున్నానూ వేడి రగిలే విరహం సాగె చెంతకు రాడేమె చెలికాడు ప్రేమ బాణం నీపై గురిపెట్టాడే భామ అయ్యొ యేమౌతావో, చక్కని చెక్కెర బొమ్మ ఏమె యీ బాధ పడలేనెయీ వేళా
స్వాగతం స్వాగతం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: పి.లీల, యస్.జానకి & కోరస్ స్వాగతం స్వాగతం శాత్రవ జన జైత్ర స్వాగతం సుకృతావతార దయ సేయుమురా రతనాల బాట పయనింపుమురా రతి రాజ సార రణరంగధీర వర శుభ గుణ సువదన భూరి భూరమణ పూజ తాబ చరణా పూబాల వికసించె నీ నవ్వులో భూమాత పులకించె నీ దారిలో పున్నెము పురివిచ్చె వన్నెల సిరి హెచ్చె అందాలె నిను మెచ్చె ఈవు యేజనని నోముపంట వవురా శ్రీ దేవి నెలకొన యీ మందిరం రారాజ వరులైన రాదుర్లభం రమ్మిటు జయశీల రంజిత జనపాల నీ మ్రోల రసలీల మువ్వలే పలికె దివ్వెలే కులి కెరా
ధన్యోస్మి ధన్యోస్మి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: ఘంటసాల ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా శ్రీమన్మహా సర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ! పావనీ ! నిత్యసౌభాగ్య సంపన్న సంవర్దినీ, శ్రీమహాలక్ష్మి మాణిక్య సౌవర్ల హేరాళ హారావళీ రంజితా మేయ చాంపేయ గాత్రీ పయోరాశిపుత్రీ ! నమోవిష్ణు పత్నీ నమస్తే, నమస్తే, నమస్తే, నమం
శుక్రవారపు పొద్దు పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: యస్.జానకి శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్వె నూదగవద్దు బువ్వ నెట్టద్దు తోబుట్టువుల మనసు కష్ట పెట్టద్దు తొలి సంజ మలిసంజ నిదుర పోవద్దు మాతల్లి వరలక్ష్మి నిను వేడదపుడు ఇల్లాలు కంట తడి పెట్టనీ యింట కల్లలాడని యింట గోమాత వెంట ముంగిళ ముగ్గులో పసుపు గడపల్లో పూలలో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు
అందాల బొమ్మను నేను చెలికాడ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: విశ్వప్రసాద్ గానం: ఎల్. ఆర్. ఈశ్వరి అందాల బొమ్మను నేను చెలికాడ మందార వల్లిని నేను విలుకాడ ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా.. చేరిపోరా మోహన రాజా మన్మధ రాజా నీలో కదిలే కోరిక లేవో నీలో మెదిలే లాలసలేవో మారాము చేసెను లేరా గారాలు ముగించి రారా తనువంతా తీయని తాపమురా తనువంతా తీయని తాపమురా నాలో మెరిసే అందము నీదే నాలో కురిసే చందము నీదే జాగేలా వేగిర లేరా-కౌగిట్లో బిగించ రారా నిను కోరి చేరిన భామనురా
జయ జయ మహాలక్ష్మి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970) సంగీతం: యస్. పి. కోదండపాణి సాహిత్యం: చిల్లర భావన్నారాయణ గానం: యస్.జానకి జయ జయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి ఈ దివ్య కథ చూడ యేతెంచినట్టి అందరికి అలరారు అఖిల భోగాలు సకల సౌక్యమ్ములు సర్వ సంపదలు పిల్లల పాపలు కొలంగ సిరులు కలుగంగ దీవించి తరుణించవమ్మా కరుణించవమ్మా ఓ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి
No comments
Post a Comment