చిత్రం: ANIMAL (2023) సంగీతం: Jam8,Shreyas Puranik, Harshavardhan Rameshwar, Vishal Mishra, Manan Bhardwaj, Jaani సాహిత్యం: అనంత శ్రీరామ్ నటీనటులు: రణబీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి దర్శకత్వం: సందీప్ వంగ నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కృష్ణ కుమార్, మురాద్ కేతాని విడుదల తేది: 01.12.2023
Songs List:
అమ్మాయి అమ్మాయీ పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: Jam8 సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: రాఘవ చైతన్య, ప్రీతం నింగి నేలా నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏదీ తోడురాలా ఏంటీ వేళా ఇది మాయే ప్రాణం చేతుల్లో ఉందే ఈ ప్రణయం పైపైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీ పీ సన్నాయి అమ్మాయి అమ్మాయీ ఈ ఈ ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే స్వర్గమా అమ్మాయీ ఈ ఈ అమ్మాయీ ఈ ఈ అమ్మాయి
నే వేరే నువ్వేరే పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: Jam8,Shreyas Puranik సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తిక్ హో ఓఓ ఓ ఓ ఓ హో ఓఓ ఓ నా దేహమంత నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా హో నా మౌనమంత నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే నాకన్నా నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో ఓ ఓఓ ఓ ఓ హో ఓఓ ఓ నీ పాదం స్పృశించాకే నే తాకానే నీ పెదవిని నీ ద్వేషాన్ని ముందుగా కలిసి మళ్లీ చూస్తా నీ ప్రేమనీ కసురాల దాగిన కనికరమా అలకల మాటున అనురాగమా శిశిరాలే జాడిలా ఎదురైనా మరల రాదా మరుక్షణాన వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా నువ్ నొచ్చుకున్న చోటే నను నేను శిక్షించుకుంటా నే నావై నువు తోవై ఆఖలేస్తమా ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ ఓ ఓ నేనేమో ఎండనైతే నువ్వేమో నా వానవిల్లే ఈ జంట ఉన్న చోటే వెలగాలలా వానవిల్లే నే రాత్రై నువు పగలైతేనే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
నాన్న నువ్వు నా ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సోనూ నిగం నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా ఏ కానుకలో నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా
ఎవరెవరో నాకెదురైనా పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: విశాల్ మిశ్రా సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: విశాల్ మిశ్రా ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటె ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాలకన్న సొగసెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవసమేదో మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే
కాశ్మీరులాంటి సీమలలో పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: మానన్ భరద్వాజ్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రేయా గోషాల్, యజిన్ నిజార్ చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఏ దారి లేదేంటో సెలయేరు పారేలా ఈ తోటలో ఎక్కడా ఏ వాలు లేదేంటో ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో ప్రేమనిలా పూయించాలో ఏంటో ఇవాళే ఇవాళే అలా వాలిపోదా కాశ్మీరులాంటి సీమలలో ఆ రోజులాగే అలా తేలిపోదా జీలమ్మనల్లాంటి ప్రేమలలో మ్ అందాల లోయ చేసేటి మాయ జతగా మరోసారి చూద్దాం ప్రియా చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే స్వర్గం అదంట పోదాం పదా ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే నేర్పిస్తా ప్రేమంటే ఏంటో ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం దేవకన్యలుండే ఆ గ్రామములో ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు లోటనేది ఉండదిక నీ మదిలో నువ్వు అడిగితే తీసుకెళ్ళనా ఆ చోటులోన చలి ఉంది చానా వణుకుతూ నీవుంటే చూస్తూ అలా ఎలా తాలనే అయ్యో లేడీ కూన చలిమంటలై నన్ను నీ మాటలే తాకుతుంటే చలేస్తాదా ఏంటో నీ కౌగిలే నన్ను ఓ కంబలై కాచుకుంటే వణుకుతానా ఏంటో నా ముందు నువ్వుండి మాటాడుతుంటె కదిలే కాలాన్నే ఆపేయనా ఆ గూటి పడవల్లో నీ గుండెపై వాలి నిదురిస్తా నేడే ఆ సీమలలో ఏదేమి అవుతున్నా ఏ గొంతు ఏమన్నా తేలుస్తా నిన్నే నా ప్రేమలలో
యాలో యాలో పాట సాహిత్యం
చిత్రం: ANIMAL (2023) సంగీతం: జాని సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అనురాగ్ కులకర్ణి యాలో యాలో
No comments
Post a Comment