చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: కృష్ణ, విజయనిర్మల దర్శకత్వం: విజయనిర్మల నిర్మాత: ఎస్. రఘునాథ్ విడుదల తేది: 29.11.1976
Songs List:
ఈ కాలం పది కాలాలు పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల పల్లవి: ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చెరిసగాల భావనతో.. యుగయుగాల దీవెనతో రేపు మాపు లాగా కలసిఉందాము.. కరిగిపోదాము.. కరిగిపోదాము.. నాలో.. నీలో.. నాలో నీలో నువ్వు నేను మిగిలి పాడతాను.. పాడి. . ఆ.. ఆ.. ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చరణం: 1 నిన్నటిలో నిజంలాగానే రేపు తీపిగావుంటే... ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే చావని కోరికలాగే...పుడుతుంటాను.. తిరిగిపుట్టి చావకుండా బ్రతికుంటాను ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ చరణం: 2 నా జన్మకు ప్రాణం నీవై.. నీ ప్రాణికి ఆత్మను నేనై కాలానికి ఇరుసువు నీవై.. తిరుగాడే వలయం నేనై ఎన్ని తరాలైనా.. మరెన్ని యుగాలైనా వీడని బంధలై.. కావ్యపు గంధాలై నాలో.. నీలో.. నాలో నీలో నువ్వు నేనుగా మిగిలి పాడతాను.. పాడి ఆడతానూ.. ఆ. . ఆ.. ఆ.. ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ.. ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
పులకింతలు ఒక వేయీ పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: అప్పలాచార్య గానం: యస్.పి.బాలు, పి.సుశీల పులకింతలు ఒక వేయీ కౌగిలింతలు ఒక కోటీ నిన్నుకలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 1 నీ మగసిరి వడుపున వురవడిలో నా సొగసుల పండుగ చేసేనూ నీ కోర చూపుల వెచ్చదనంలో.. కోరిక నేనై మిగిలేనూ.. జన్మ జన్మలకు నిన్నే.. నిన్నే..ఏ..కొలిచేనూ..కొలిచేనూ.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 2 నీ నవ్వులలో..విరజాజులు విరిసినవి నీ కన్నులలో..సిరి మల్లెలు పూసినవి..ఈ.. ఎంత చూసినా..ఏమి చేసినా..తనివితీరనంటుంది మనసు నిలివ నంటుంది.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. రజనీ..నీ.. విజయ్..విజయ్.. చరణం: 3 మనిషి పోయినా..మనసు మిగిలి ఉంటుంది ప్రేమించే గుణం..దాన్ని వదలనంటుంది..వదల నంటుందీ మన కలలు పండీ మనసు నిండీ నింగి నేలా నిలిచేదాకా నిలవాలీ..మన ప్రేమ నిలవాలీ పులకింతలు ఒక వేయీ కౌగిలింతలు ఒక కోటీ నిన్నుకలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి మనసారా..పిలవమంటున్నవి రజనీ..నీ.. లలల్లల్లాలలా రజనీ..నీ.. లాలలలాలలా రజనీ.. లాలల్లాలలలా రజనీ.. లాలలాలలలా...
రావోయి యీరేయి పోదాము రావోయి పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల రావోయి యీరేయి పోదాము రావోయి
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాట సాహిత్యం
చిత్రం: దేవుడే గెలిచాడు (1976) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: జాలాది గానం: పి.సుశీల పల్లవి: గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే చరణం: 1 పలకరించేదీ నా ప్రాయం పులకరించేదీ నీ హృదయం పలకరించేదీ నా ప్రాయం పులకరించేదీ నీ హృదయం నా లావణ్యం నీ ప్రణయం నా లావణ్యం నీ ప్రణయం కలిసే మంగళ సమయం గంగా యమునల సంగమం గంగా యమునల సంగమం గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే..కోయిల నీదైతే చరణం: 2 మెరిసి మెరిసి తొలకరి జల్లై కురిసి కురిసి వలపుల వానైనదీ మెరిసి మెరిసి తొలకరి జల్లై కురిసి కురిసి వలపుల వానైనదీ మురిసీ మురిసీ నాలోపలి నెమలి పురివిప్పి నాట్యమాడిందీ నాట్యమాడిందీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే కోయిల నీదైతే
No comments
Post a Comment