చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.బాలు నటీనటులు: వాణిశ్రీ, రంగనాథ్, చంద్రమోహన్, ఫటాఫట్ జయలక్ష్మి దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాత: సుందర్ లాల్ నహతా విడుదల తేది: 09.09.1978
Songs List:
రామచిలకా పెళ్ళికొడుకెవరే పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు రామచిలకా పెళ్ళికొడుకెవరే మాఘమాసం మళ్ళిరాదు మనువాడే పెళ్ళికొడుకెవరే ఏరులాంటి వయసు ఎల్లువైన వగసు ఎన్నెలంత ఎటిపాలై ఎదురీదేనా తుమ్మెదెవరో.... తుమ్మెదెవరో....రాకముందే తుళ్ళిపడిన కన్నేపువ్వా ఈడుకోరే తోడులేక కుములుతున్న ప్రేమమొలక గొంతులోని పిలుపు గుండెలోని వలపు తీగాతెగిన రాగమల్లె మూగబోయేనా గోరువంకా... గోరువంకా... దారివంకా ఎన్నెలంతా తెల్లవారే పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక
నా మామయ్య.... వస్తాడంట.. పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.జానకి లలిలాలిలాలో...(3) నా మామయ్య.... వస్తాడంట.. మామయ్య వస్తాడంట.... మనసిచ్చి పోతాడంట.... మరదల్ని మెచ్చి మరుమల్లె గుచ్చి ముద్దిచ్చి పోతాడంట ఆ మొద్దర్లు పోయేదెట్టా నా బుగ్గలే ఎరుపెక్కెనే ముగ్గేసిన నునుసిగ్గుతో మొగ్గేసిన తొలి సిగ్గులో గోరువంకా దారివంకా కోరుకున్న జంటకోసం ఆశలెన్నో అల్లుకున్న అంతలోనే ఇంతటలు..... పడుచోడు నవ్వాడంటే పగలంతా ఎన్నెల్లంటా.... వలపల్లె వచ్చి మరదల్లె ముంచి వాటేసుకుంటాడంట ఆణ్ణి పైటేసుకుంటానంట కల్లోకివచ్చి కన్నుకొట్టాడే కన్నెగుండెల్లో చిచ్చుపెట్టాడే గుండెల్లో నాకు ఎండల్లు కాసే కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసె వన్నెల్లు తడిసే మేనెల్ల మెరిసే పరువాలే పందిళ్ళంట - కవ్వించే కౌగిళ్ళంట మురిసింది ఒళ్ళు ఆ మూడుముళ్ళు ఎన్నాళ్ళకేస్తాడంట ఇంకెన్నాళ్ళ కొస్తాడంట కళ్యాణవేక సన్నాయి మోగ కన్నె అందాలే కట్నాలు కాగ మనసిచ్చినోడు మనువాడగానే గోరింక నీడ ఈ చిలకమ్మ పాడే చిలకమ్మా పాడే ఇంటల్లుడౌతాడంట ఇంక నాయిల్లు వాడేనంట మదిలోని వారు గదిలోకి వస్తే కన్నీరు గావాలంట... అదే ....పన్నీరై పోవాలంట
అమ్మీ అమ్మన్నలాలో పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల & బృందం అక్కమ్మ, చుక్కమ్మ, పెద్దక్క, చిన్నక్క, రంగమ్మ మంగమ్మ పెళ్ళి పేరంటానికి రండి సువ్వీ.... సున్వీ.... సువ్వీ .... సువ్వీ చుట్టాల సురధి పెళ్ళి పందిరి మంది సందడి రండీ చేరండీ అమ్మీ అమ్మన్నలాలో అంతరారండీ పెళ్ళీ పేరంటమండీ మళ్ళీ కాదండి మాఘమాసం మంచి మహూర్తం మాయింటి కళ్యాణం పద్మావతీ వెంకటేశ్వరుల పెళ్ళి రోగం ఇల్లు ఆలికితే పండుగకాదు నల్లులు తిర్చండి రంగవల్లులు తీర్చండి పెళ్ళి పనులకు పిలుపులుండవు చేతులు కలపండి అంగా చేతులు కలపండి దంచే పడతుల వంపు సొంపూ విసిరే నెలదుల విరుపూ మెరుపూ కన్నెల కిలకల గాజులు గలగల పసిపాటలకే పల్లవుందీ రాజనాల ధాన్యాలు విందు భోజకాలకు నాణ్యాలు దంపి గుండిగం నింపండి వండి వార్చడం మనవంతండీ చిత్రాన్నాలూ పరమాన్నాలూ కరకరలాడే గారెలు బూరెలు వద్దంటున్నా వడ్డించండి మారు వడ్డనకు మళ్ళీరండి మగువ జన్మకు మంగళసూత్రం మాయని తీయని వరమండీ ఏడు జన్మల అనుబంధానికి ఏడు అడుగులు నడవాలండీ మూడు పువ్వులు ఆరుకాయలై నూరేళ్లు వర్దిలండి....
కళ్యాణ వేళ సన్నాయి మోగ పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.జానకి కళ్యాణ వేళ సన్నాయి మోగ కన్నె అందాలే కట్నాలు కాగ మనసిచ్చినోడు మనువాడగానే గోరింక నీడ ఈ చిలకమ్మ పాడే చిలకమ్మ పాడే ఇంటల్లుడౌతాడంట ఇంక నా యిల్లు వాడేనంట మదిలోనివాడు గదిలోకి వస్తే కన్నీరు రావాలంట, అదే పన్నీరు పోవాలంట
రామచిలక పెళ్ళికొడుకెవరే పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.జానకి ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... రామచిలక పెళ్ళికొడుకెవరే మాఘమాసం మంచిరోజు మనువాడే పెళ్ళికొడుకెవరే ఏరులాంటి వయసు ఎల్లువైన మనసు ఎన్నెలంటి వన్నెచూసి ఎవరొస్తారో... తుళ్ళిపడకే..... తుళ్ళిపడకే... కన్నెపువ్వా తుమ్మెదెవరో రాకముందే ఈడుకోరే తోడుకోసం గూడు వెతికే కన్మెనె మొలక ఊరుదాటే చూపు చూపు దాటే పిలుపు ఆరుబయట అందమంతా ఆరబోసేనే గోరువంక... గోరువంక దారివంక కోరుకున్న జంటకోసం ఆశలెన్నో అల్లుకున్న అంతలోనే ఇంట ఉలుకా
గూడు చీకటి గువ్వ ఎన్నెలా పాట సాహిత్యం
చిత్రం: రామచిలక (1978) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.జానకి గూడు చీకటి గువ్వ ఎన్నెలా గుండెలు గువ్వలగూళ్లు ఈ గుండెలుగువ్వల గూర్లు గోదారొడ్డున కలిసిన చేతులు కట్టిన పిచ్చుక గూళ్లు అవి కట్టని దేవుడిగుళ్లు మద్దులు ముప్పైనాళ్లు ఆశలు అరవై ఏళ్లు కలలుగనే కన్నులతోనా ఎన్నెల కొన్నాళ్లు ఆ కలలే కరిగి ఎన్నెలచెరిగి వచ్చే కన్నీళ్లు ఏళ్లూ కోళ్లూ ఏడ్చే కళ్ళకు నవ్వే ఆనవాళ్లు ఎత్తే జన్మలు ఏడు వేసే ముళ్ళే మూడు పుష్వలకైనా నవ్వులు నేర్పేవాడే నాతోడు ఈ చల్లని చెలిమి తియ్యని కలిమి నాదే ఏనాడు చీకటి గూడు వలపులమోడు నవ్వే ఈనాడు ...
No comments
Post a Comment