చిత్రం: సలార్ (2023) సంగీతం: రవి బసురూర్ నటీనటులు: ప్రభాస్, శ్రుతి హాసన్ దర్శకత్వం: ప్రశాంత్ నీల్ నిర్మాత: విజయ్ కిరగందూర్ విడుదల తేది:22.12.2023
Songs List:
సూరీడే గొడుగు పట్టి పాట సాహిత్యం
చిత్రం: సలార్ (2023) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: హరిణి ఇవటూరి సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టె పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడూ ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడూ ఏ ఏ ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కధనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరెళ్లు నిలవాలే ఏ ఏ ఏ కంచె ఒకడైతే అది మించె వాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి ధహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే సూరీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ
ప్రతి గాధలో రాక్షసుడే పాట సాహిత్యం
చిత్రం: సలార్ (2023) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: కోరస్ ప్రతి గాధలో రాక్షసుడే హింసలు పెడతాడు అణచగనే పుడతాడు రాజే ఒకడూ శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు హింసలనే మరిగాడు మంచిని మరిచే ఆ నీచుడి అంతు చూసాడు పంథంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి బలవంతుడైన ఎదిరించాలి మీ ఓర్పు నేర్పునిక చాటాలి గెలవాలంటె మన్నించాలి కోపం మరి లోపం అవ్వదా యుద్ధమైనా చిరునవ్వుతోనే నువు… ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆ శిలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతలా తలనే దించెయ్ జగడాలకే పోకురా పగనే తుంచెయ్ అది ఎప్పుడూ కీడురా నిజమను ధైర్యం అండరా కరుగును దేహం కండరా తెలివితో లోకం ఏలరా, నిలబడరా మనదను స్వార్ధం వీడరా మనిషికి మాటే నీడరా ఇచ్చిన మాటే తప్పితే, గెలవవురా కోపం మరి లోపం అవ్వదా యుద్ధమైనా చిరునవ్వుతోనే నువు… ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆ శిలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతలా
వినరా వినరా పాట సాహిత్యం
చిత్రం: సలార్ (2023) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సచిన్ బసురూర్ వినరా వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగంరా వినరా ఆ పగలు వైరం మధ్యన స్నేహంరా వినరా రగిలే మంటల మధ్యల మంచేరా వినరా మరిగే గరళం మధ్యన జీవంరా క్రోధాలే నిండిన లోకంరా స్వార్ధాలే అంటని బంధంరా మాట ఇచ్చాడో తానె అవ్తాడురా ఎరా కోపగించాడో తానె అవ్తాడురా సొరా మోసాలే నిండిన లోకంరా వేలంటూ మరవని బంధంరా దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా తాను నమ్మాడో విననే వినదంటరా మొరా
ఆరు సేతులున్నాగానీ పాట సాహిత్యం
చిత్రం: సలార్ (2023) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: కనకవ్వ ఆరు సేతులున్నాగానీ ఆదుకోను సెయ్యి రాదమ్మా గుక్కపెట్టి రందీలుంటే ఏడ జాడ కానరావమ్మా బక్కపలస భంటుల మీనా భగ్గుమంటూ కోపమేందమ్మా నొక్కా నొక్కి మొక్కుదామన్నా సత్రం ఇంకా లేనే లేదమ్మా కొలిసీ కొలిసీ గోసనేమో పడితినే పిలిసీ పిలిసీ… ఇడిసిపెడితినే
No comments
Post a Comment