చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్ దర్శకత్వం: విజయ్ బిన్నీ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి విడుదల తేది: 14.01.2024
Songs List:
ఎత్తుకెళ్ళి పోతావా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రామ్ మిరియాల ఉల్లి మల్ల సీర గట్టి కజ్జలు పైకెగగట్టి ఉల్లి మల్ల సీర గట్టి కజ్జలు పైకెగగట్టి ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందన రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందనా బీర పువ్వు రైక సుట్టీ బిల్లంత బొట్టు పెట్టి బీర పువ్వు రైక సుట్టీ బిల్లంత బొట్టు పెట్టి బైటకడుగు పెట్టనంటవ భామా రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందన రమణి ముద్దుల గుమ్మ నందన రావే రావే భామ నందనా (ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా) బెల్లం సెరుకు సూపుల దాన అల్లం మిరప మాటలదాన బొండుమల్లి నడుము దాన బండెడు సోకుల ఓ నెరజాన నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే ఎంత ఎంత, ఎంత ముద్దుగున్నావంటే ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే హే, చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే (మరి అట్టా ఉంటె ఏం చేస్తాం) ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె నా గుండెకోటలో రాణివి నువ్వంట నా రెండు కాళ్ల పల్లకిలోనా ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నా సామిరంగా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, (నా సామిరంగా) ఈ గీత తొక్కితే, మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా, (నా సామిరంగా) ఒక్కడు అంటే ఊరందరు మా ఊరంటే ఒక్కొక్కడు ఒక్కరు అంటే… ఊరందరు మా ఊరంటే… ఒక్కొక్కడు మాతోటి, మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా ఈ గాలిలో పౌరుషముంది ఈ మట్టిలో పంథం ఉంది ఈ నీటిలో ప్రేమా ఉంది ఈ నీటిని తాగి, మట్టిని తాకి గాలిని పీల్చి, ఎదిగిన ఈ దేహంలో శ్వాస ఉన్నంత వరకు విశ్వాసం ఉంటాది ప్రాణమున్నంత వరకు అభిమానం ఉంటాది మాతోటి, మాతోటి మాతోటి పేచీ పడితే సామిరంగా… నా సామిరంగా అరె సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా సామిరంగా… నా సామిరంగా
దేవుడే తన చేతితో పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: యం.యం.కీరవాణి గానం: శాండిల్య పీసపాటి దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం అంజిది, కిష్టయ్యది విడదియ్యని ఒక బంధం చిరునవ్వులు పూసే స్నేహం చిరుగాలికి ఈల నా పాఠం కడతేరని ఆనందంలో కడదాకా సాగే పయనం దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం ఏరా, ఒరే అనేటి ప్రాణమిత్రులు పరాచకాలతోటి ఆటపాటలు అన్నయ్య ఉంటే చాలుగా ప్రాణాలు పంచే తీరుగా కలిసింది పాలు తేనెలా కలిపింది కాలం ప్రేమ పొంగేలా దేవుడే తన చేతితో రాసిన కమ్మని ఒక కావ్యం అంజిది, కిష్టయ్యది విడదియ్యని ఒక అనుబంధం
దుమ్ము దుకాణం పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: సాహితి చాగంటి, కరిముల్ల, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్ ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన వాళ్ళు బంధుమిత్రులు అన్నదమ్ములు పిల్లాపాపలు కుర్రమూకలు పెద్దొళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసిన సందడి పేరే దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం ఈలలు వేస్తారు కొందరు గోలలు చేస్తారు కేకలు పెడతారు కొందరు అరుపులు అరిచేరు ఈ అరుపులకన్నా కేకలకన్నా అల్లరికన్నా గడబిడకన్నా అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలకులే అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే ప్రేమ తబలా ఢోలకు మోతలే దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం పనిస గరిగమగమపమగరిగమప నిరినిస నిదమగరి గనిసమమగరి మమగరి మమగరినిస మమప నిసగమపనిస చెట్టూ ఊగింది, ఆటకు చేనూ ఊగింది పిట్టా ఊగింది, కోడిపెట్టా ఊగింది ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప తలుపు కిటికీ అన్నీ ఊగి….. పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు జిల్లాలో పాతికూల్ల పైదాక పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు జిల్లాలో పాతికూల్ల పైదాక పాకింది చూడు, పాకింది చూడు పాకింది చూడు దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ దుమ్ము దుకాణం దుం దుం దుం దుకాణం అరె దుముకు దుముకు దుం దుం దుం దుం దుకాణం
ఇంకా ఇంకా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: యం.యం.కీరవాణి గానం: సత్యయమిని, మమన్ కుమార్ ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే తెలియని భావమేదో మనసులో తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే నిన్ను చూసి… నన్ను చూసి చెప్పాలని, చెప్పాలని అనిపిస్తుందే… ఏమని? గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇపుడే ఇపుడే నీకు నేననీ గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే తెలియని భావమేదో మనసులో తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే నిన్ను చూసి… నన్ను చూసి చెప్పాలని, చెప్పాలని అనిపిస్తుందే… ఏమని? గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇపుడే ఇపుడే నీకు నేననీ గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
సీసా మూత ఇప్పు పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024) సంగీతం: యం.యం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: రేవంత్, మల్లికార్జున్, సచిన్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండిన్య పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే రైస్ మిల్లు నెల జీతం రై రైమని పెరిగిందంటే ఫెవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్లు పడిందంటే ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే పక్కింటోడికి లాసొస్తే హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు బోరు కొడితే బీరు కొట్టు బాధ పడితే బ్రాందీ కొట్టు ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు మూడంతా పాడైపోతే పై మూడు కలిపి కొట్టు కట్టుకుందాన్తో కల్లే కొట్టు అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు సోదర సోదర అన్నోల్తో సోడా కలిపి కొట్టు రా రా పోరా అన్నోల్తో రా గానే కొట్టు మనకన్నా పెద్దోల్లొస్తే మస్కా కొట్టు… సాటుగ మందే కొట్టు మొదటి పెగ్గు ఎయ్యగానే మత్తు కమ్ముకొస్తాది రెండో పెగ్గు పడగానే ఒళ్ళు తేలిపోతాది మూడు నాలుగైదు పెగ్గులు గొంతులోకి దిగగానే… నా సామిరంగ… సిత్రాలే సిత్రాలు నా సామిరంగ… పెరటిలోని పిల్లి కూన బౌ బౌ అంటాది నూతిలోని సేపపిల్ల సుట్ట కాల్చుతాది సేతిలోని ఇసనకర్ర సికెను ముక్కై పోతాది మూలకున్న ఇసుర్రాయి ఎండి కంచమే అది తొంబై రూపాయల నోటు జేబులోంచి జారుతాది తొడుక్కున్న గల్ల లుంగీ సొక్కా అయిపోతది ఆ ముంగటేడు పోయిన మా ముసలి తాత ఎదరకొచ్చి ఏరా అబ్బీ..! తినలేదా, ఏమి తాగట్లేదా బక్క సిక్కి పోయావు..! ఏందిరా ఇదీ? అని పలకరిస్తాడు, ప్రేమగ హెచ్చరిస్తాడు… ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో అరెరెరె మందుని కనిపెట్టినోడు యాడున్నాడో ఆడి కంటికి ముక్కుకి సెవులకి కాళ్ళకి మూతికి సేతులకి దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏం సెయ్యాలి సెప్పు సీసా మూత ఇప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు ఏసెయ్యాలి సిప్పు సిప్పు మీద సిప్పు
No comments
Post a Comment