చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ నటీనటులు: వెంకటేష్, ఆర్య, శ్రద్ధా శ్రీనాద్, రుహని శర్మ, అండ్రియ జర్మియా దర్శకత్వం: శైలేష్ కొలను నిర్మాత: వెంకట్ బోయనపల్లి విడుదల తేది: 13.01.2024
Songs List:
బుజ్జికొండవే పాట సాహిత్యం
చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: యస్.పి.చరణ్ బంగారమే బంగారమే నువ్వు నా వరమే నీ క్షేమమే, నీ సంతోషమే నను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే పుట్టుకంటె నీదే, దేవతల్లే నన్నే చేరుకుంటివే, గుండెపట్టనంత ప్రాణమంటే నీవే, నాన్న లాగా నన్నే ఎంచుకుంటివే, ఓ చంటిపాపనై నీతో నన్ను ఆడనివ్వవే నీ ఆట పాట ముద్దు ముచ్చట తీర్చనివ్వవే నా ఆయువంత నువ్వు అందిపుచ్చుకుని చిందులాడవే బుజ్జికొండవే నా బుజ్జికొండవే బుజ్జికొండవే నా బుజ్జికొండవే… బంగారమే బంగారమే నువ్వు నా వరమే నీ క్షేమమే నీ సంతోషమే నను నడిపించే బలమే… ఏదో జన్మలో అమ్మవే నా పాపవైనావిలా నమ్మవే లోకాన పూసే ప్రతి నవ్వు తీసి పువ్వుల దండ చేసి నీకందించనా నీకై కన్నకలలా ఉంది జీవితం ప్రతి ఋతువు నీకై తేవాలి వసంతం నా ఆనందాలకి అద్దం పట్టిన కంటి చెమ్మవే నా అదృష్టాలన్నీ భూమికి దించిన బుట్ట బొమ్మవే నా గుండెపైన చిందులాడ వచ్చిన జాబిలమ్మవే. బుజ్జికొండవే… నా బుజ్జికొండవే బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే బంగారమే బంగారమే నువ్వు నా వరమే నీ క్షేమమే నీ సంతోషమే నను నడిపించే బలమే (ప్లీజ్ నవ్వు నాన్న) ఏదో జన్మలో అమ్మవే నా పాపవైనావిలా నమ్మవే
సింపుల్ జెంటిల్ పాట సాహిత్యం
చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: కార్తీక్ మనివాసగం గానం: కార్తీక్ మనివాసగం సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ సింపుల్ జెంటిల్ ఐ’మ్ ఫ్రీ గోల్డెన్ సన్ షైన్ అంగ్రీ
లెక్క మారుద్దిరా పాట సాహిత్యం
చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: పృద్వి చంద్ర రగిలే క్రోధము, నడిచే యుద్ధము జననం భస్మం నుండేలే అరె ఎవరాసిద్ధము, మరణము తథ్యము అతడే మృత్యువులే పగ పగ సెగ సెగ పోరే నీదా ధగ ధగ యుగాలుగా తీరే పోదా చెడునిక ఆపెయ్ నరకము చూపే… నవ సైంధవుడే నవ సైంధవుడు, నవ సైంధవుడూ ఆట మొదలయే వేట మొదలయే రక్త మడులు పారే జాత మొదలయే, కోత మొదలయే కొత్త పదునుతోనే పగ పగ సెగ సెగ పోరే నీదా ధగ ధగ యుగాలుగా తీరే పోదా చెడునిక ఆపెయ్ నరకము చూపే కలి సైంధవుడే కొంచెం బెదరడే లక్ష్యం విడువడే అష్టం కొలవడే మంత్రం అలవడే పడి పడి ఎగబడి కలబడి ముట్టడి వదలడులే ఇకా అరె కుదరదు కట్టడి బతకరు తలబడి నిలబడిపోకా మరి ఎదురుగ నిలబడి సిగబడె సత్తువిది మిగలదులేమ్మా అరె చెదిరిన లెక్కను కుదురుగ మార్చెడి కుదుమిది దెబ్బా లెక్క మారుద్దిరా నా కొడకల్లారా..! ధగ ధగ యుగాలుగా తీరే పోదా
సరదా సరదా పాట సాహిత్యం
చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి శ్రద్ధ: ఏం చేసావ్ ఈరోజంతా? వెంకీ: మధ్యాహ్నం మోడీ గారితో మీటింగ్ అయింది. దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చి వచ్చా,ఊ..! లేకపోతే నేనేం చేస్తాను. హహహ. శ్రద్ధ: ఆపకు, మాట్లాడుతునే ఉండు. బావుంటది, నువ్ మాట్లాడితే. వెంకీ: నా వయసెంతో తెలుసా..? శ్రద్ధ: ష్… ఇదా నేను మాట్లాడమంది..! బేబీ సారా: నాన్న వెంకీ: హే, నిద్రపోలేదా బంగారం. ఊ, దా దా బేబీ సారా: ఆంటీ, నువ్వు మాతోనే ఇక్కడ ఉండిపోవచ్చు కదా..! రోజు మీ ఇంటికి ఎందుకు వెళ్తావ్. వెంకీ: మను ఆంటీ కొన్ని రోజుల తర్వాత మనతోనే ఉంటుంది. ఏమంటావ్ మను ఆంటీ? శ్రద్ధ: అంతే..! వెంకీ: అంతే. ఊ, అంతే ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరివెన్నెలలో తడిసే గువ్వలం చిరునవ్వులలో చననం ఇది చాల్లే… ఇంతే చాల్లే ఇదిలా నిత్యం ఉంటే చాల్లే ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా ఊపిరిలో సుమగంధాలే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం కలలా ఉందేంటీ నిజం నిజమేనందీ నయనం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసింది హృదయం అందాల పూల వందనాలు చేసే రాదారులే తల నిమురుతున్న పలకరింపులాయె చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగింది సమయం మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదేలే కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల సరదా సరదా సరదాగా సాగిందీ సమయం మనసు మనసూ దూరాలే మటుమాయం మనకు మనకూ పరదాలే లేనే లేవందాం ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం
రాంగు యూసేజూ పాట సాహిత్యం
చిత్రం: సైంధవ్ (2024) సంగీతం: సంతోష్ నారాయణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్ రేయ్, అరె బాధలలోనే తెగ ఏడుపులోనే నువు తాగుతున్నావ్ రా రేయ్ దిల్ కుషీ కుషీలోనే భల్ చిందులతోనే నువ్వు తాగి చూడరా ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది కుషీనే డబల్ చేస్తావా లేక బాధనే డబల్ చేస్తావా, హా ఏడుపే డబల్ చేస్తావా ఏసే చిందునే డబల్ చేస్తావా, ఆ ఆ ఆవ్ చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్ చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ మందుని చెయ్యద్దురా రాంగు యూసేజ్ రాంగ్ యూసేజ్, రాంగ్ దునియాలో అందరికీ దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని సివరికి నీకు నువ్వు దూరమయ్యి నువ్వే ఒక ఒంటరయ్యి ఈ సెల్లే నీకు జైలు సెల్లయిందే రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే, హ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యుసేజు చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు ||2|| నీలో తెలివే… నీకు బానిసవ్వాలే ఆ తెలివే తెలివి మీరి అతి తెలివిగ అది మారి నీ బానిసకే నవ్వు బానిసయ్యావే రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెడు అన్నది నేడు మంచి ఫ్యాషనయిందే మంచి మాసెడ్డగ బోరు కొట్టిందే, ఏ ఏ ఏయ్ మంచి టైమ్ తీరిపోయి చెడు వైపే జారిపోయి లైఫులోన లైటన్నది ఆరిపోయిందే రేయ్, రాంగు రాంగు రాంగు రాంగు చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజు చెయ్యకు చెయ్యకు లైఫుని చెయ్యకు రాంగు యుసేజు
No comments
Post a Comment