చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025) సంగీతం: భీమ్స్ సిసిరోలియో నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 14.01.2025
Songs List:
గోదారి గట్టు మీద పాట సాహిత్యం
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కర భట్ల గానం: రమణ గోగుల , మధుప్రియ తరరిరరారే రరరా తరరిరరారే రరరా గోదారి గట్టు మీద రామ సిలకవే… ఓ ఓ, గోరింటా కెట్టుకున్న సందమామవే… గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే… ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే../ నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే… నీతోటీ కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే..! గోదారి గట్టు మీద రామసిలకనే… ఆ ఆ, గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే… హేయ్, విస్తరి ముందేసి పస్తులు పెట్టావే… తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే… ఛీ ఛీ ఛీ సిగ్గే లేని మొగుడు గారండోయ్ గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదికి రాకొండోయ్..! ఒయ్ ఒయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే సాప దిండు సంసారాన్ని మేడెక్కించావే… హుఁ, ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్…! గురకెట్టి పడుకోరే గూర్కాల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు… పెళ్ళైయి సాన్నాల్లే అయినా కానీ మాస్టారు తగ్గేదే… లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు. హేయ్, గోదారి గట్టు మీద రామ సిలకవే గోరింటాకెట్టుకున్న సందమామవే హేయ్ హేయ్ హుఁ హుఁ లలలాల లాల హుఁ హుఁ హె హె హేయ్ హో హో హోయ్ లలలాల లాల హుఁ హుఁ మ్ మ్………. కొత్త కోకేమో… కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే… ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టెయ్‍నా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టెయ్‍నా ఈ అల్లరి గాలేమో అల్లుకుపొమ్మందే మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటుందే అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చెయ్‍నా? ఏవండోయ్ శ్రీవారు మళ్లీ ఎపుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హెయ్, ఓసోసి ఇల్లాలా బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసిలకనే హుఁ, లలలా హా, నీ జంట కట్టుకున్న సందమామనే… హుఁ, లలలా తరరిరరారే రరరరా తరరిరరారే రరరా
# పాట సాహిత్యం
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: భీమ్స్ సిసిరోలియో , ప్రణవి ఊ ఊ ఊ ఊ ఊ ఊ… ఏయ్, నా లైఫులోనున్న ఆ ప్రేమ పేజీ తియ్‍నా, (తియ్‍నా) పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా, (మీనా) ట్రైనర్ గా నేనుంటే, ట్రైనీగా వచ్చిందా కునా వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోన చిత్రంగా ఆ రూపం... చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే ఓ యే ఓ... (ఓ యే ఓ) ఓ యే ఓ... (ఓ యే ఓ) కాకిలా తోటల్లో… కోకిల్లే కూసాయే లాఠీలా రెమ్మల్లో... రోజాలే పూసాయే మీను... డింగ డింగ డింగ డింగ్ మీను... డింగ డింగ డింగ డింగ్ మీను రింగ డింగ డింగ డింగ్ ఓలే ఓలే... ఫోన్‍లో... టాకింగ్ టాకింగ్ లాన్‍లో... వాకింగ్ వాకింగ్ బ్రెయిన్‍లో… స్టార్ట్ అయిందే నా మీద లైకింగ్... శనివారాలైతే... (శనివారాలైతే) సినిమా హాల్లోనా... (సినిమా హాల్లోనా) సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్‍లోన... సాయంత్రం అయితే గప్‍చుప్ స్టాల్‍లోన తెల తెలవారే గుడ్ మార్నింగ్‍కై వెయిటింగ్ తప్పేనా? కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో కలిపిన మాటలు ఇంకెన్నో మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే... బేబీ... టింగ రింగ రింగ రింగ్ బేబీ... టింగ రింగ రింగ రింగ్ బేబీ... రింగ డింగ డింగ డింగ్ ఓ ఓ ఓ... డైలీ... స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో... తేలింగ్ తేలింగ్ మీటింగ్ కాలేదంటే మిస్ అయిన ఫీలింగ్... [బా...? ఊ..! ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయ్ కదా, అలాంటివేమన్నా..?? ఎందుకుండవే భాగ్యం..! ఆ రోజు ఫెబ్రవరీ…. 14th ఫోర్టీన్థ్... అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము, కూసింత గుట్టుగా కలుసుకున్నామెహే.. ఇప్పటికీ ఆ మూమెంట్ తలచుకుంటే వణుకొచ్చేత్తాంది.] చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే ఉరుకుతు ఉండే తలపులనేమో బిడియములాపాయే అడుగు అడుగు ముందుకు జరుపుకొని ఒకరికి ఒకరము చేరువై... ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే… [ ముద్దు పెట్టేశావా బా...? లేదే భాగ్యం... తొలిముద్దు భాగ్యం నీకే దక్కింది. చాల్ చాల్లే...] బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ హా ఆ ఆ... బావ... నీదాన్నే నేను బావ… నిన్నొదిలి పోను బావ… నీ లవ్ స్టోరీకి పెద్ద ఫ్యానయ్యాను... ఓ ఆకాశమై... నే వేచుండగా ఓ జాబిల్లిలా... తానొచ్చిందిగా గుండెలో, ఓ ఓ నిలిచే జ్ఞాపకం మీనా...
బ్లాక్‌బస్టరు పొంగలూ.. పాట సాహిత్యం
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో , ప్రణవి ఏ.. కొక్కొరొకో కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకీ.. ఎంతలేసి వణికిందో.. ఏ మూలా పండుకుందో.. రథం ముగ్గు ఏసుకుంట.. ఏటుకూరి నాగలచ్చిమి.. ఎంత దూరమెళ్లిందో.. ఎటు పోయిందో.. హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో.. పండగొచ్చె గొబ్బియల్లో.. ఎవ్రీబాడీ గొబ్బియల్లో సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో.. పెద్ద పండగండీ గొబ్బియల్లో.. లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో.. కమాన్.. బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ.. బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ.. అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ.. ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ.. గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్.. నో దంగల్.. సెలబ్రేట్ ద పొంగల్.. హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో.. పండగొచ్చె గొబ్బియల్లో.. ఎవ్రీ ఇయరూ గొబ్బియల్లో.. కమ్ టు పల్లెటూరు గొబ్బియల్లో.. కలిసి మెలిసి గొబ్బియల్లో.. లెట్స్ హావ్ ఫన్నూ గొబ్బియల్లో.. యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ.. యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ.. అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ.. ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ..
No comments
Post a Comment