Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2017"
Lakshmi Bomb (2017)



చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
నటీనటులు: లక్ష్మీ ప్రసన్న, పోసాని కృష్ణమురళి, హేమ 
దర్శకత్వం: కార్తికేయ గోపాల కృష్ణ 
నిర్మాత: గున్నపాటి సురేష్ రెడ్డి 
విడుదల తేది: 10.03.2017



Songs List:



చిన్ని తల్లీ చిన్ని తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కరుణాకర్ 
గానం: అశ్విని 

నీలాల కల్లనీ నీ బుజ్జి బుగ్గనీ
నా కంటి పాపలాగ చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలిమువ్వని
నా గుండె గూటిలోన దాచుకోన
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ
నీ పరుగులో ఉన్నాయమ్మా
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడె ఆ బ్రహ్మ…

చిన్ని తల్లీ చిన్ని తల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లీ బుజ్జి తల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే
ఓ అలె అలె అలాలె అలె అలె
ఓ అలె అలె అలాలె అలె అలె

నీ పాదం వేసేటి నేలంత నా ప్రాణం పరిచేసి ఉందంట
నీ చూపే సోకేటి గాలంత నా శ్వాసైపోయింది నేడింక
నీ కోప తాపాలలో నేనే అల్లాడి పోతానమ్మా
నీ మాట ముత్యాలలో నేనే ఆనందమవుతానమ్మా
ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగ చూపించుకోనమ్మా

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే
ఏఏ ఏఏ…

ఓ జన్మే చాలేట్టు లేదింక నా ప్రేమే నీతోటి పంచంగ
క్షణమైనా నువ్వు లేని చోటంతా విషమల్లే ఉంటుంది నా వెంట
నా గుండెసవ్వల్లనే వింటే నీ పేరే ఉంటుందమ్మా
ఓ వెండి వెన్నెల్లో ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా
ఓ నీ ముద్దు మోమింకా నా ముందు ఉంటేనె జాలింక కోరేదే లేదమ్మా

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే

నీలాల కల్లనీ నీ బుజ్జి బుగ్గనీ నా కంటి పాపలాగ చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలిమువ్వని నా గుండె గూటిలోన దాచుకోన
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ నీ పరుగులో ఉన్నాయమ్మ
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాడె ఆ బ్రహ్మ…

చిన్ని తల్లీ చిన్నితల్లి నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జితల్లీ బుజ్జితల్లీ నిన్నువీడి ఎడకెల్లలేనే




రంగు రంగు పూలలోనే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కరుణాకర్ 
గానం: అశ్విని 

రంగు రంగు పూలలోనే



తరుము తరుము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి 
గానం: హేమచంద్ర 

తరుము తరుము 



అగ్గై వస్తా నిన్నే బుగ్గే చేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: మనీషా ఈరబత్తిని , అశ్విని 

అగ్గై వస్తా నిన్నే బుగ్గే చేస్తా



లక్ష్మీ బాంబు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ బాంబు (2017)
సంగీతం: సునీల్ కశ్యప్ 
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి 
గానం: మనీషా ఈరబత్తిని 

లక్ష్మీ బాంబు

Palli Balakrishna Monday, August 29, 2022
Prematho Mee Karthik (2017)



చిత్రం: ప్రేమతో మీ కార్తీక్ (2017)
సంగీతం: షాన్ రెహమాన్
నటీనటులు: కార్తికేయ, సిమ్రత్ కౌర్
దర్శకత్వం: రిషి, రిషి రాజ్ 
నిర్మాత: రామశ్రీ గుమ్మకొండ, రవీంద్ర గుమ్మకొండ 
విడుదల తేది: 17.11.2017

Palli Balakrishna Wednesday, September 1, 2021
Anando Brahma (2017)


 
చిత్రం: ఆనందో బ్రహ్మ (2013)
సంగీతం: K (కృష్ణ కుమార్)
నటీనటులు: తాప్సీపన్ను, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుధీర్ బాబు
దర్శకత్వం: మహి వి. రాఘవ్
నిర్మాతలు: విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేది: 18.08.2017

Palli Balakrishna Saturday, March 6, 2021
Maa Abbayi (2017)
చిత్రం: మా అబ్బాయి (2017)
సంగీతం: సురేశ్ బొబ్బిలి
నటీనటులు: శ్రీ విష్ణు , చిత్ర శుక్ల
దర్శకత్వం: కుమార్ వట్టి
నిర్మాతలు: బలగ ప్రకాశ్ రావు, కుమార్ వట్టి
విడుదల తేది: 17.03.2017


Palli Balakrishna Sunday, February 28, 2021
Inkenti Nuvve Cheppu (2017)


చిత్రం: ఇంకేంటి నువ్వే చెప్పు (2017)
సంగీతం: వికాస్ కురిమెల్ల
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: చిన్ని చరణ్, శ్రీవిద్య
నటీనటులు: ప్రశాంత్, మణికంఠ సన్నీ, పూజిత, ప్రసన్న
దర్శకత్వం: శివశ్రీ
నిర్మాత: మళ్ళా విజయ ప్రసాద్
విడుదల తేది: 06.01.2017

నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
ధీరుడే దీనంగా మారె నీ వల్లేగా
మన్నించమంటే వినవుగా
నీ రాక నాకు చీకటింట దీపంగా
నన్ను చూడమాకు పట్టరాని కోపంగా
నిన్ను మా అమ్మకన్న అపురూపంగా అనుకున్నానుగా
నీ నువ్వులేని చూపునాకు నరకంగా
ఎన్ని పువ్వులున్నా ఎడారి ఎదురుంగా
నా తప్పునేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేవతగా

నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా

చరణం: 1
కెరటం లేని సంద్రం నేను నింగేలేని తారక నువు
నువ్వులేని సమయాన నేనసలు నేనేనా
గాలి నీరు ఆహారంతో బతికేస్తారే ఎవరైనా
నాకదే చాలదుగా నువ్వే నాకు ఊపిరిగా
బతికానే ఇన్నాళ్లు బహుమతిగా కన్నీళ్లు
ఇచ్చావే ఓ చెలియా ఇది నీకు న్యాయమా

నిన్ను నమ్ముకొని నీతో ఒంటరిగా
నువ్వు రమ్మన్న చోటుకి వచ్చాగా
నీకు అందుకే నేను అలుసయ్యాన
నను దండించావుగా
ఇది చేసిందంతా నువ్వేగా
ఈ విరహపు వెధ నీ వల్లేగా
మళ్ళీ నా పైనే పడి తప్పని నిందిస్తావుగా

నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా

చరణం: 2
మన్నించేటి గుణమేలేని మనిషివికావు నువ్వసలు
దేవతల జాతినువు ఎందుకే ఈ తగవు
నాలో నుండి నిన్నే వేరు చేసే వీలులేదు కదే
ప్రాణమై ఎదిగావు ఎలా వదిలిపోతావు
ఇంతకన్నా చెప్పలేనే నా హృదయం విప్పలేనే
నువుతప్పా ఏమిలేని మామూలు మనిషినే

నీ రాక నాకు చీకటింట దీపంగా
నన్ను చూడమాకు పట్టరాని కోపంగా
నిన్ను మా అమ్మకన్న అపురూపంగా అనుకున్నానుగా
నీ నువ్వులేని చూపునాకు నరకంగా
ఎన్ని పువ్వులున్నా ఎడారి ఎదురుంగా
నా తప్పునేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేవతగా

నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా

ఈ గాయం సులువుగ మానదుగా
ఈ గిడవలు త్వరగా మరువనుగా
అలాగని అనువంతైనా నీపై ప్రేమే తరగదుగా
ఉరుముల వెనకే  చినికులుగా
నడిరాతిరి పూర్తయి వెళుతురుగా
మన యుద్ధం తీర్చి ఇద్దరినొకటిగ
ప్రేమే కలుపునుగా...





Palli Balakrishna Friday, May 31, 2019
Sachin (2017)



చిత్రం: సచిన్ (2017)
సంగీతం: ఏ.ఆర్.రహ్మాన్ 
సాహిత్యం: వనమాలి
గానం: నకుల్ అభ్యంకర్
నటీనటులు: సచిన్ టెండూల్కర్
దర్శకత్వం: జేమ్స్ ఎర్స్కిన్
నిర్మాత:
విడుదల తేది: 26.05.2017

ఒఓఓ ఓ నేస్తం ఓ సోదరా
లోకనికంతా నువ్వేగ తారా
నిదురే వీడీ లేవాలి
ఓ ఆశతో మేల్కోవాలి
గెలిచె నువ్వే నువ్వే

దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే దేహమొక్కటే
దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే గెలిచే తీరు

దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే దేహమొక్కటే
దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే గెలిచే తీరు

దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే దేహమొక్కటే
దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే గెలిచే తీరు

ఆలకించాలిలే మాటలే ప్రేమతో
ఓటమే నిత్యమూ తలవడం ఎందుకో
జగతిలో ఉన్నతం దానిపేరే ఇండియా
జీవితం ప్రాణమూ నాకదే లేవయా
గుండెలో ప్రతి నరం పాడె నీ తలపుతో
ఆలకించాలి ఈ మాటనే ప్రేమతో

దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే దేహమొక్కటే
దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే గెలిచే తీరు

దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే దేహమొక్కటే
దేశమొక్కటే దేహమొక్కటే
ఓ దేశమొక్కటే గెలిచే తీరు



******  *******  ******


చిత్రం : సచిన్ (2017)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్ 
సాహిత్యం : వనమాలి
గానం : పరాగ్ ఛబ్ర, పూర్వి కౌటిష్, నికితా గాంధీ

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్

చీకటంతా కమ్ముకున్నా
వెలుతురుంది నీ చేతుల్లోనా
కలలు నిజమూ కాని వేళా
రాతిరైనా రద్దవ్వాలే నాఆశ
సగమైన సాగలేదు ఆట
కసిగాయం మానిపోలేదంటా
ఎదలోన మోగనివ్వు జేగంట
చెయ్ సాహసమే
చేరాలంటే గమ్యము

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్

గాలివీచే దిశను మార్చేయ్
ఎవ్వరెన్ని అంటూనే ఉన్నా
కాలమేగా నీకు తోడు
భారమంతా తనదే ఆ పైన
మది రేపు వైపు లాగుతుంది
కొత్త వేకువేదో చూపుతుంది
మును ముందు
రోజులన్ని నీవంటుంది
చెయ్ సాహమఏ
చేరాలంటే గమ్యమే

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్

సాహో సాహో సాహో ఇండియా
నువ్వో సైన్యం కదరా
సాహో సాహో సాహో ఇండియా
నువ్వో సైన్యం కదరా

సచిన్ సచిన్ సచిన్ సచిన్
సచిన్ సచిన్ సచిన్ సచిన్

Palli Balakrishna Sunday, February 17, 2019
Raju Gari Gadhi 2 (2017)


చిత్రం: రాజుగారి గది 2 (2017)
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్
దర్శకత్వం: ఓంకార్
నిర్మాత: పొట్లూరి వి. ప్రసాద్
విడుదల తేది: 13.10.2017

Palli Balakrishna Tuesday, January 22, 2019
Okka Kshanam (2017)


చిత్రం: ఒక్క క్షణం (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాహితి, అనురాగ్ కులకర్ణి
నటీనటులు: అల్లు శిరీష్ , సీరత్ కపూర్, సురభి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: వి.ఆనంద్
నిర్మాత: చక్రి చిగురుపాటి
విడుదల తేది: 28.12.2017

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే
ఏం జరుగుతుంది చెలిమనసిది
వెలిపోతుందెటో సరిగా కలువలేదే
నిన్ను అపుడే మిస్సింగ్ ఏమిటో

ఏమిటిది కొత్త కథ ఎప్పటిలా లేనుకదా
యు అర్ మై బేబీ
యు డ్రైవ్ మీ క్రేజీ
సీ యు బేబీ  యు అర్ మై బేబీ
కాంట్ టేక్ ఇట్ ఈజీ


Wanna wanna see you baby
Wanna wanna see you

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లా చెలీ నువ్వేనే నా కల
వాట్సప్ స్మైలీ లా మది మెరిసెనే మిల. మిల
ఇప్పటికిప్పుడు చూడాలని
అనిపిస్తున్నదే
రారమ్మంటు నా మౌనమే పిలిపిస్తున్నది

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby
Gonna gonna see

రోజు నాకు తెల్లవారదే నీ మెసేజ్ రానిదే
ఎంతసేపు మాటలాడినా సమయమే తెలియదే
వదిలిపోని ఈ పిచ్చికి పేరే ఏమిటో
నీకవుతున్న ఆ సంగతే నాలోను డిటో

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby (2)


Palli Balakrishna Wednesday, December 27, 2017
Manasuku Nachindi (2017)


చిత్రం: మనసుకు నచ్చింది (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సమీరా భరద్వాజ్
నటీనటులు: సందీప్ కిషన్, అమైరా డస్తర్, త్రిధా చౌదరి
దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
నిర్మాతలు: పి.కిరణ్, సంజయ్ స్వరూప్
విడుదల తేది: 26.01.2018

పల్లవి:
పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా
అలవాటే కద నువు కంటి పాపకి
తడబాటెందుకు నిను చూడటానికి
పదవే తల్లి పదమంటు నన్ను తరిమినది

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

కోరస్:
హే నంగ నంగ నారె నంగ నారె
నంగ నంగ నారె నంగ నారె
సయ్యా ఓరే సయ్యా ఓరే సయ్యా (2)

చరణం: 1
జంటకథ లెన్నో విన్నా ఎంతబాగుందో అన్నా
ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా
మొన్న మరి నీతో ఉన్నా నిన్న నీతోనే ఉన్నా
కొత్తగా కనుగున్నానా ఈ రోజున
ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే
నా అందాలకింక మెరుగులు దిద్దినా
ఓ వయ్యారి నయ్యా ఓ సింగారి నయ్యా
ముస్తాబయ్యి నీకోసమడుగేసినా
నను చూస్తూ నువు పొగడాలనున్నది
నా వెనకాలే తిరగాలనున్నది
అరెరె ఎందుకు అసలింత నాకు ఇంత అవసరమా

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

Palli Balakrishna Tuesday, December 26, 2017
Jai Simha (2017)



చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 12.01.2017



Songs List:



అనగనగా అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ యేసుదాస్

అనగనగా అనగనగా



ప్రియం జగమే పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్ రమ్యా బెహ్రా

ప్రియం జగమే




అమ్మకుట్టి అమ్మకుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జస్ప్రీత్ జీస్జ్, గీతా మాధురి

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నూవ్ ప్రేమ దందా నేనేమొ రజినిగందా 
నిన్నూ నన్నూ ఆపేది ఉందా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 1
అయ్యో చలిగా ఉందే .. కౌగిళ్ళా దుప్పటిలా కాపాడనా 
అయ్యో సెగలా ఉందే .. ఆరారా ముద్దులతో తడిపేయనా 
పద్దతిగ ఉండుటెలా తిమ్మిరినీ తట్టుకొనీ 
అందుకనే ఉండకలా చేతులనే కట్టుకునీ 
ఐతే అలాగైతే మీదా చెయ్యేసే చేసెయ్యి కరెంటునే సరఫరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 2
బాబోయ్ భయమేస్తుందే 
ఉండొద్దు ఒంటరిగా దగ్గరకొచ్చేయ్ 
బాబోయ్ సిగ్గేస్తుందే 
కాసేపే ఉంటదిలే కళ్ళే మూసేయ్ 
ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకనీ 
ఎంతకనీ ఊంటదిలే వయసు తలే దించుకునీ 
ఔనా ఔనౌనా పదా ఈరోజే తీర్చేద్దాం వయస్సులో గరగరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 

నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా





ఏవేవో ఏవేవో పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రేయఘోషల్, రేవంత్

పల్లవి:
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 1
తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది
నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే
ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది
తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది
జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

కోరస్:
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 2
హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని
నే చూపిస్తా ఇదిగో నువ్వు అని
ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని
నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని
అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)




జై సింహా థీమ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: నోయల్ సేన్
గానం:  వివేక్ హరిహరన్,  నోయల్ సేన్, ఆదిత్య అయ్యంగార్

జై సింహా థీమ్

Palli Balakrishna
Balam (2017)


చిత్రం: బలం (2017)
సంగీతం: రాజేష్ రోషన్
సాహిత్యం: రాజశ్రీ సుధాకర్
గానం: రాహుల్ నంబియర్, వందన శ్రీనివాసన్
నటీనటులు: హృత్తిక్ రోషన్ , యామి గౌతమ్
దర్శకత్వం: సంజయ్ గుప్తా
నిర్మాత: రాకేష్ రోషన్
విడుదల తేది: 25.01.2017

నే  పాడనా నా   ప్రాణమా (2)
మదిని దోచిన నయగారమా
స్వప్నాలలో ఏముందిలే  దోసిలిలో వరముందిలే 
ప్రేమ ఇపుడే కొత్త లోకం  దారి తెరచి పిలిచేనే 
నేను నీ బలమేనులే అది నిజమే కాదయా  (2)

సరదాలతో సందళ్ళతో  ఈ లోకమే మరిచెములే
అను రాగామే అనుబంధమై  మన జీవితం సాగాలిలే
నా గుండెలో నీ కోసమే  నునువెచ్చని చోటినుండిలే
నాలో నేను నీలో నేను  కొలువుందాములే...!

ఏ నాడు చేసిన పుణ్యమో నిజమైనది నేడు నా కల
నే కోరుకున్న నా దైవము నా తోడుగా నడిచేనిలా
తన వన్నెలే సిరి వెన్నెలై నా కోసమే వెలిసిందిలా
ఎన్నడూ వీడని జంటై మేమే కలిసుంటామిలా 

Palli Balakrishna Wednesday, December 13, 2017
2 Countries (2017)

చిత్రం: 2 కంట్రీస్  (2017)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం:
గానం: హరిచరన్ , కావ్య మాధవన్
నటీనటులు: సునీల్
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: యన్.శంకర్
విడుదల తేది: 22.12.2017

పల్లవి:
ఉల్లాసంలో... ఉల్లాసంలో... గెలిచానులే...
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు
మురిసేను మేను మెచ్చాలే నిన్ను

ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన

చరణం: 1
అలలా  అలలా ఇలలో కలలా సరదాలే సాగేనా
అధరం మధురం హృదయం ఉప్పొంగేనా
అలలా  అలలా ఇలలో కలలా ఆనందం ఆడేనా
నయనం కధనం నయనం పదిలం
కమలం కవనం పరువం మోగే
ఏహె సొగసు కావ్యమై
మది వంగి వంగి భోగి ఊగి తూగి తేలేనా
సొగసు కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ

ఉల్లాసంలో  ఉల్లాసంలో

చరణం: 2
అదిరే అదిరే మధువే అదిరే సరసాలే చిందేనా
అధరం మధురం హృదయం ఉప్పొంగేనా
అలలా అలలా లయలా లయలా ఆకాశం అందేనా
సరసం సమరం మిధునం మధనం
శ్రవణం సరళం సయనం ఊగే
ఎహె మధుర కావ్యమై
భూకం పాకం దాహం మొహం తాపం కాశం తీరేనా
మధుర కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ

ఉల్లాసంలో  ఉల్లాసంలో
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు
మురిసేను మేను మెచ్చాలే నిన్ను

Palli Balakrishna Friday, December 8, 2017
Indrasena (2017)


చిత్రం: ఇంద్రసేన  (2017)
సంగీతం: విజయ్ ఆంటోని
సాహిత్యం: బాషాశ్రీ
గానం: కార్తిక్
నటీనటులు: విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ
దర్శకత్వం: జి.శ్రీనివాసన్
నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని, రాధికా శరత్ కుమార్
విడుదల తేది: 30.11.2017

పల్లవి:
వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు
సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన

వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు

చరణం: 1
లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే
లోకంలోని ప్రేమంతా వీడై రూపం దాల్చెనే
అడిగి చూడు గాయమే చెప్పే వీడి గాధలే
ఉలినే ఓర్చుకున్న శిల్పం వీడు
నిజమే వేయికథల కందనీడు

సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన

వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు

చరణం: 2
కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే
కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే
సాయం అంటు ఎవ్వరోచ్చినా ప్రాణం ఇచ్చు రాజులే
కట్టలే కాలి కాలి బొట్టు అవులే
ఇతని బాధ చదువు చరితౌలే

సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన

వజ్రమా ముత్యమా ఎవరు వీడు
వీడ్ని పోల్చుటకు ఏదీ సరిపోదు
సొంతమా బంధమా ఏదీ కాడు
ఐనా కష్టమంటే చాలు వీడు వచ్చేస్తాడు

సత్యమే వీడు చల్లగుండ
సత్యమైన దెళ్ల వీడ్ని మొక్కకుండా
స్వచ్చం కన్నా ఎంతో స్వచ్చమైన వాడే ఇంద్రసేన



******  ******  ****** 


చిత్రం: ఇంద్రసేన (2017)
సంగీతం: విజయ్ ఆంథోని
సాహిత్యం: భాష్యశ్రీ
గానం: హేమచంద్ర, సుప్రియ జోషి
 
జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే
నిద్దురపోయే నా కంటి నిద్దురమొత్తం
వీడిపోయే హే నీవల్లే
చేరిపోయే నా రక్తంలో మత్తే ఎక్కి
తూగిపోయే హే నా వల్లే

జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే

ఎన్నెన్నో జన్మాలు వెతికాయి రాత్రంత
నా రెండు నయనాలు నీకోసము
నాలోని ఎరుపంత మింగేసి నీ పెదవి
కసితీర తీస్తుందె నా ప్రాణము
ఓఓ నడిచేటి నదిలాగె వచ్చావురా
అదిరేటి ఎద చప్పుడయ్యావురా
నన్నైన నే మరిచి పోగలనురా
అరె నిను మరిచి పోతే నేనుంటానయ్యా

జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే

ఆకాశమేదాటి స్వర్గాలె వెతికాను
నీలాంటి దేవత లేనే లేదు
ఏ భాషలేనట్టి నీ కంటి ఊసులకు
అర్ధాలు వెదికేను నా ధ్యానము
నువ్ ఔనన్న కాదన్న నా సోకువి
ఏడ్చిన నవ్విన నా బంటువి
గెలిచిన ఓడిన నా విజయమే
విడిచిన దాచిన నా ప్రాణమే

జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివే
మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే
భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివే
చూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివే



Palli Balakrishna Thursday, December 7, 2017
Saptagiri LLB (2017)


చిత్రం: సప్తగిరి LLB   (2017)
సంగీతం: బుల్గనిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: లోకేశ్వర్ , మంగళి
నటీనటులు: సప్తగిరి, కాసిస్ వహ్రా
దర్శకత్వం: చరణ్ లక్కాకుల
నిర్మాత: డాక్టర్ కె. రవికిరణ్
విడుదల తేది: 07.12.2017

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది
ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది
దేవుడంటే ఏడో లేడు నీలో ఉన్న ధర్మమేరా
పారిపోనీకు నీలో ఆశాదీపం
ధైర్యమంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా
ఒడిపోదులేరా నీ సంకల్పం
ఏ సాయం లేకున్నా నీ తోడు
ఒంటరిగా అందరికై పోరాడు
గెలవాలి నీలాంటి మంచోడు
గెలిచేలా చూస్తాడు పైవాడు

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది

ఏ మలుపున ఏమున్నదో మరి ముందుగ తెలిసేనా
ఏ మలుపున ఏమున్నదో మరి ముందుగ తెలిసేనా
వేసే ప్రతి అడుగు అరె చూడదుగా వెలుగు
ఐనా ముందడుగు వెయ్యడమేగా పరుగు
ప్రతిదెబ్బకు నిబ్బరమై నిలబడితే చాలు
నీ గొప్పలే డప్పులుగా పలకవ జేజేలు
విజయం నీదేలేరా ఏనాటికి నిజం
ముమ్మాటికి సందేహం దేనికి

ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది
ఆటు పోటు లేక పోతే జీవితమేముంది
పోను పోను దారి ఉంది
ముందుకు పోగా ఊపిరుంది
చీకటైన దారుల్లోనే  వేకువ పూస్తుంది
దేవుడంటే ఏడో లేడు నీలో ఉన్న ధర్మమేరా
పారిపోనీకు నీలో ఆశాదీపం
ధైర్యమంటే ఏదో కాదు నీలో ఉన్న న్యాయమేరా
ఒడిపోదులేరా నీ సంకల్పం
ఏ సాయం లేకున్నా నీ తోడు
ఒంటరిగా అందరికై పోరాడు
గెలవాలి నీలాంటి మంచోడు
గెలిచేలా చూస్తాడు పైవాడు


Palli Balakrishna
Hello (2017)



చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: అఖిల్ , కళ్యాణి ప్రియదర్శన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేది: 22.12.2017



Songs List:



హెల్లొ పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రేష్ఠా , వనమాలి
గానం: అర్మాన్ మాలిక్

హెల్లొ ఎక్కడున్న హెల్లొ 
ఎమయ్యవ్ హెల్లొ 
వింటున్నవా ఈ వేలలో 
హెల్లొ ఇటు రావా హెల్లొ 
హెల్లొ మరిచావా హెల్లొ 
గడిపేస్తున్న నీ ద్యాసలో 

హెల్లొ ఎక్కడెక్కడున్నవు 
హెల్లొ ఎం చేస్తున్నవు 
కనపడవా, వినపడవా 
ఎంత కాలమైన నన్ను చేరవా 
girl i say hello hello 
i feel the love 
and it makes me glow 
girl you are my love for sure 
i hear you calling me hello hello 

నువ్వెంత దూరమున్న 
ఏ చోట దాగి ఉన్నా 
నీ జాడ తెలుసుకోనా 
నీ చెంత చేరుకొనా 
యె నాడు వీడిపోనీ 
నీ తోడు నీడ నేనై 
నీ వెంటే నడిచి రానా 
నీతోనె ఉండిపోనా 
ఉండిపోనా.. 

హెల్లొ ఎక్కడున్న హెల్లొ 
ఎమయ్యవ్ హెల్లొ 
వింటున్నవా ఈ వేలలో 
హెల్లొ ఇటు రావా హెల్లొ 
హెల్లొ మరిచావా హెల్లొ 
గడిపేస్తున్న నీ ద్యాసలో 





అనగనగా ఒక ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీ ధృతి

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారే పసివాల్లు స్నేహంగా 
సంతోషమంత రెక్కలుగా 
రివ్వంటు యెగిరె పక్షులుగా 
ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా 
ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను 
కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ 
పాటేమొ సీను ఆటెమొ జున్ను 
ఒకటై యెదిగారె మధురంగ 

ప్రపంచమంత తమ ఇల్లంటు 
ప్రతి క్షణం ఒక పండుగగా 
కన్నీరు లేని కలలే కంటు 
చిన్నరి చెలిమే బలపడగా 
తియ తియ్యని ఊసులతో 
తెల తెల్లని మనసులలో 
కథ ఇలాగ మొదలయ్యెగా 
కథ ఇలాగ మొదలయ్యెగా 

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

యెగిరిన బుడకలలోన చెలిమె 
ఉరికిన పడవలలోన చెలిమె 
రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే 
మినుగురు వెలుగులలోన చెలిమె 
తొలకరి తేనెలలోన చెలిమె 
గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే 
ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే 
ఈ జీవితానికి బలమై నడిపెనులే 
ఈ సాక్ష్యాలే అనుభందాల 
బవనానికి స్థంబాలె 

అనగనగ ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

తెలపని కబురులలోన చెలిమె 
తిరగని మలుపులలోన చెలిమె 
దొరకని చూపులలో చెలిమె 
దోసిలి నింపింది 
జరిగిన నిమిషములోన చెలిమె 
యెరగని మరు నిమిషాన చెలిమె 
కాలం చెక్కిలిలో చెలిమె 
చుక్కై మెరిసిందే 
చిననాడు మురిపించే ఈ గురుతులె 
కనరాని దారిని చూపే మీ గురువులె 
ఉండాలంటు ఈ బతుకంతా 
ఈ మాటలకి కట్టుబడి 




తలచి తలచీ పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరణ్

తెలిసీ తెలియని ఊహలో 
కలిసీ కలవని దారిలో 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

విరిసీ విరియని స్నేహమై 
పలికీ పలకని రాగమై 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

పలకరించె పాటలా 
మనసూగెను ఊయలా 
ఎదిగింది అందమైన ఓ కలా 
ఏమయ్యిందో ఏమో గాని 
యెవరు పోల్చుకోని 
ఇరు దారుల్లొ యెటు నడిచారొ ఈ వేలా 
తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండ ఆశ జారిపోయెనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 

తెలిసీ తెలియని ఊహలో 
కలిసీ కలవని దారిలో 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

విరిసీ విరియని స్నేహమై 
పలికీ పలకని రాగమై 
యెటు వెల్లిందొ యెటు వెల్లిందో మనసే 

కన్నుల్లొ కల నిజమవక 
నిదురించవుగ ఈ హ్రుదయాలు 
ముల్లున్న తమ దారుల్లొ 
పరుగాపరులే ఈ పసివాల్లు 
ఆ నిన్నలో ప్రతి గ్నాపకము 
ఈ జంటనె వెంటాడేన 
ఆ లోకమె యెటు వెల్లిందొ 
కానరాదు కాస్తైనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండా ఆశ జారిపోయేనా 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 

ఇద్దరికి పరిచయమే 
ఒక కల లాగ మొదలయ్యిందా 
ఇద్దరుగా విడిపోయక 
అది కలాగానె మిగిలుంతుందా 
పసి వాల్లుగ వేరయ్యక 
ఇన్నల్లుగ యెమయ్యరొ 
ఈ నేలపై నలుదిక్కుల్లొ 
యెటు దాగి ఉన్నరొ 

తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 
యెదురు చూసి చూసీ యెంతకాలమైనా 
జత చేరకుండ ఆశ జారిపోయెనా 
తలచి తలచీ వెతికే కన్నులివిగో 
తిరిగి తిరిగీ అలిసే అడుగులివిగో 




ఏవేవో కలలు కన్న  పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అఖిల్ అక్కినేని, జోనిత గాంధి

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 

తలచుకున్న వేలలో తెలుసుకున్న వెలుగేమిటో 
కలుసుకున్న వేలలో క్షనముకింత విలుమేమిటో 
ఇలా నేను నా నువ్వు మనమైన ఈ వేలల్లో 
ఈ వెలుగేమొటో...ఈ పరుగేమిటో...మైమరపేమిటో 
హాయి గీతాలలో ఈ బాషేమిటొ భవాలేమిటో 
ఈ తియ్యనీ బంధాలేమొటో 

ఏవేవో కలలు కన్న 
ఏవైపో కదులుతున్న 
ఏమైందొ తెలియకున్న 
ఎన్నెన్నొ జరుగుతున్న 
ఏమొ ఏమైందో నాలోనె ఏమైందో 
ఏమొ ఏముందో ఇకముందేం కానుందో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 
ఇదేమి ఇదేమిటో...ఈమాయ పేరేమిటో 




అనగనగా ఒక ఊరు  పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా ఘోషల్

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారే పసివాల్లు స్నేహంగా 
సంతోషమంత రెక్కలుగా 
రివ్వంటు యెగిరె పక్షులుగా 
ఆకశమంత ఆటాడుకుంటు ఉన్నరు సరదాగా 
ఒకరేమొ సీను ఒక్కరెమొ జున్ను 
కలిసారె ప్రాణంగ కురిసారె వర్షంగ 
పాటేమొ సీను ఆటెమొ జున్ను 
ఒకటై యెదిగారె మధురంగ 

ప్రపంచమంత తమ ఇల్లంటు 
ప్రతి క్షణం ఒక పండుగగా 
కన్నీరు లేని కలలే కంటు 
చిన్నరి చెలిమే బలపడగా 
తియ తియ్యని ఊసులతో 
తెల తెల్లని మనసులలో 
కథ ఇలాగ మొదలయ్యెగా 
కథ ఇలాగ మొదలయ్యెగా 

అనగనగా ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

యెగిరిన బుడకలలోన చెలిమె 
ఉరికిన పడవలలోన చెలిమె 
రంగుల రట్నంలో చెలిమె చిందులు వేసిందే 
మినుగురు వెలుగులలోన చెలిమె 
తొలకరి తేనెలలోన చెలిమె 
గాజుల గలగలలో చెలిమె సందడి చెసిందే 
ఈ గ్నాపకాలన్ని నిలెచెనులే 
ఈ జీవితానికి బలమై నడిపెనులే 
ఈ సాక్ష్యాలే అనుభందాల 
బవనానికి స్థంబాలె 

అనగనగ ఒక ఊరు 
అనుకోకుండ ఒక నాడు 
కలిసారె పసివాల్లు స్నేహంగ 

తెలపని కబురులలోన చెలిమె 
తిరగని మలుపులలోన చెలిమె 
దొరకని చూపులలో చెలిమె 
దోసిలి నింపింది 
జరిగిన నిమిషములోన చెలిమె 
యెరగని మరు నిమిషాన చెలిమె 
కాలం చెక్కిలిలో చెలిమె 
చుక్కై మెరిసిందే 
చిననాడు మురిపించే ఈ గురుతులె 
కనరాని దారిని చూపే మీ గురువులె 
ఉండాలంటు ఈ బతుకంతా 
ఈ మాటలకి కట్టుబడి 




మెరిసే మెరిసే మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: హలో (2017)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్, శ్రీనిధి వెంకటేష్ , శృతి రంజిని

మెరిసే మెరిసే మెరిసే 
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే
కురిసే కురిసే కురిసే
నవ్వుల్లో వెన్నెల కురిసే 
ఇది కొత్తగా మారిన వరసే
ఆ సంగతి నాకు తెలుసే
సన్నాయి  మోగేనా అమ్మాయి
గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా
రావోయి అల్లరి అబ్బాయి
అందుకో ఈ చేయి ఒకటై సందడి చేసేలా

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)

రెండు గుండెల చప్పుడు ఒకటే
మూడు ముళ్ల ముచ్చట కాగా
ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా
ఏడు జన్మల బంధమిదేలే 
ఏడు అడుగులు వేస్తూ ఉంటే 
చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా
ఆనందం పువ్వుల మాలలుగా 
ఇప్పుడే అల్లెస్తూ హాయిగా తేల్చేగా
బంధాలే ఈ ప్రేమ జంటనిలా
పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా 

అరె షాదియాల వచ్చెరా షురూగిట్ల పరిషాను 
సంజైతాలేదా చెప్తా చూడు ఓ కహానీ
పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండె
ఇంక పెండ్లి అయ్యినంక ఆమె కొంగుబట్టి ఊగుడంతే
హోయ్ - అంతే 
హోయ్ - అంతే  అంతే 
మాటలాడనంటది వెయ్యకుంటే సోపు
అందగత్తె లెందరున్న నువ్వేమేటి తోపు అంటు
గాపులేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే
అంతే అంతే
ఆమె గొప్పలెన్నో జెప్పనీకి తిప్పలెన్నో పెట్టెనంట
సప్పగున్న లైఫ్ లోకి అప్పు లొల్లి తప్పదంతే
ఆడిగినన్ని చీరలింక నువ్వుతెచ్చి పెట్టకుంటే
మాటనీది ఇంటిలోన నడవదంతే నడవదంతే
అంతే అంతే అంతే

మెరిసే మెరిసే మెరిసే 
ఆ కన్నుల్లో ఏదో మెరిసే
ఆ మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే

దినక్ నక్ దిరణ తనక్ దిన దినక్ నక్ దిరణ
ఓ దినక్ నక్ దిరణ జోర్ సే డోలు బజావో నా (2)


Palli Balakrishna
Mental Madhilo (2017)


చిత్రం: మెంటల్ మదిలో  (2017)
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహార్
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: రేవంత్ , రజిని శివకుమార్
నటీనటులు: శ్రీ విష్ణు , నివేద పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత: రాజ్ కందుకూరి
విడుదల తేది: 24.11.2017

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ దారే కావాలా నీకు నాలా
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఏదోలా ఏదోలా నేను నీలా సాగే వేళ

నీలో సగమై ఓ నిజమై ఓ వరమై
వరమే నిజమై
నాలో సగమే ఓ  వరమై
ఓ నిజమై
నిన్నే పిలిచే ఓ పదమై ఓ స్వరమై
స్వరమే వరమై
నన్నే పిలిచే ఓ స్వరమే ఓ వరమై
అడుగులతోనే పరుగులు తీస్తూ
ఎటుపోనుందో ఏమో
పరుగెడు తూనే పడిపోతున్నా
పడమంటుందే మనసే

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా

ఓ నువ్వే ఎదురై ఓ మలుపై ఓ గెలుపై
గెలుపే ఓ మలుపై
ఓ నువ్వే ఎదురై ఓ గెలుపై ఓ మలుపై
నీకై వలచి ఓ కథనై ఓ కలనై
కలలో కథనై
నీకై వలచి ఓ కలనై ఓ కథనై
సరిపోవంటూ అడుగులు వేస్తే ఎదురీదాలో ఏమో
అలుపంటూనే పరిగెడుతుంటే నిలబడుతుందా మనసే

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాల నేను నీలా సాగే వేళా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ దారే కావాలా నీకు నాలా
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళ
హలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగ
చలో అంటు దూరం కూడా ఓకే అంటూ దూరం కాదా



******   ******  ******


చిత్రం: మెంటల్ మదిలో (2017)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: వివేక్ ఆత్రేయ
గానం: శక్తిశ్రీ గోపాలన్ 

ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా

ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
 
అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై

ఓఓఓ అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై

ప్రతిపదం పాదమై
ఓ గానమై నీ చెంత చేరదా
పదే పదే ఊసులై
ఊరించెనే ఎడారి వానలా

ఊఊఊఊ... ఊఊఊఊ



Palli Balakrishna Wednesday, December 6, 2017
Malli Raava (2017)




చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
నటీనటులు: సుమంత్ , ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
విడుదల తేది: 08.12.2017



Songs List:



మళ్ళీ రావా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శ్రావణ్ భరద్వాజ్

ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నే
ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నే
మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే
తరిమేస్తున్నా వదిలేస్తున్నా
ఏ కోపాలలో కాల్చినా కూల్చినా
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా ఓ ఎగసి ఎగసేనా

మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే



చినుకు చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

చినుకు చినుకు రాలగా
తెగిన తార తీరుగా
నడిచి వచ్చె నేరుగా
తళుకు తళుకు దేవతా

కాలం కదిలే...
వేగం వదిలే...
నేలంత వణికే...
కాలి కిందగా !!!

రెప్పలే రెక్కలై 
కన్నులే తేలెనే....!
గుండెకే చక్కిలిగింతలా 
తోచేనే... హేహే

మీసమైన రాని పెదవి 
మోయనంత సంతోషం 
క్షణముకొక్క కొత్త జన్మ 
ఎత్తుతున్న సందేహం...

మాటలసలే బయటపడని 
మధురమైన ఓ భావం 
వేల వేల కవితలైన
చాలనంత ఉల్లాసం....!

కోటిరంగులే ఒక్కసారిగా
నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా 
చల్లగాలులే ఉక్కపోతలా
ఉందిలే చూస్తే నువ్వలా 
ఎంత చెప్పినా తక్కువేనుగా 
చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే 
చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే
కొత్త కొత్త ఆశ రేపే 
తొలిప్రేమిదే 



Welcome Back To Love పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

Welcome Back To Love




ఈనాడు పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సాయి కృష్ణ, లలిత కావ్య


ఈనాడు



అడుగసలె పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

అడుగసలె నిలవదులె నా గుండె వదిలేసె
అలవాటె అయినదిలె కన్నీరె రాలదులే
నువు లేవని బరువె దిగదె
ఇక రావని మనసె వినదె
తప్పె నాదె ప్రేమె పోదే

వచ్చీ పోయె వానల్లె నీవైనావే
నేనేమొ నేలల్లె ఉన్నాలే
చూస్తూనె మారేటీ కాలమె నీవే
నేనేమొ ఆగున్నా నింగెలే
నీ ప్రేమనె మించినా బాదేమిటె
నా ప్రాణమె పంచనా నువ్ కోరితే
నా గుండెనె చీల్చేన నీలొ మౌనమె
మాటాదితె గాయమె మానేనే

ఊపిరిలా ఉన్నావే నిస్వాసై పొతావె
ఒంటరిగా నే లేనె
నాతోనె ఉంటావె
ఊహల్లొ కూడాను
నువు లేకా నే లేనె
ఒట్టెసీ అంటున్నా నువ్వె నేనే



చినుకు చినుకు (Reprise) పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: లలితా కావ్య

చినుకు చినుకు రాలగా
Chinuku (Reprise)



మళ్ళి రావా (Reprise) పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సునీత

Malli Raava (Reprise)

ఈ కాలం ఈ దూరం
దాచె ఉంచేన నిన్నె నిన్నె
ఈ గాయం ఈ మౌనం
మార్చె ఆపేన నన్నే నన్నే

మళ్ళి రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికి
మళ్ళి రావ లేవన్నవి
రావ చెంతె వదిలి చింతె

తరిమేస్తున్న వదిలేస్తున్న
ఈ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నదొ
ఈ ప్రేమె ఇలా
ఒహ్ ఎగసెగసేను

మళ్ళి రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికి
మళ్ళి రావ లేవన్నవి
రావ చెంతె వదిలి చింతె



తెలిసి తెలిసి పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: హరిణి ఇవటూరి

తెలిసి తెలిసి వేకువా
మనసు వెనక దాగెనా
కనుల తెరిచె లోపలా
రోజులెన్నొ గడిచెనా
నాలో కదలే నీలో మెదిలే
మేనెంత ఒనికే ఉన్నపాటుగా

నమ్మనే లేదులె నా మది నిన్నిలా
నన్నిల కమ్మెనె వెన్నెల ఇంతలా
వెతికి వెతికి ప్రేమని
తెలుపలేని వేదనే
కలిసి తెలిసి నేడిలా
ఉప్పెనంటి చేరువా

Palli Balakrishna
Khakee (2017)


చిత్రం: ఖాకీ (2017)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: గీబ్రాన్ , కార్తీక్
నటీనటులు: కార్తీ ,  రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: హెచ్ .వినోద్
నిర్మాతలు: ప్రభు యస్.అర్, ప్రకాష్ బాబు యస్. అర్
విడుదల తేది: 17.11.2017

కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా
ఏ నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే

కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా

కన్నుకొట్టి పోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా
ఏయ్ కన్నుకొట్టి పోయే పిల్ల గుండెల్లో నేనే ఉంటా
చెలియా నిన్ను తలచి నాకు సగమై పోయే ఈ జగమే
సఖియా నీవు లేక నాకు యుగమై పోయే ఓ క్షణమే
నువు ముందెల్లి పోతే నీ వెనకనే వస్తా
నువు ముందెల్లి పోతే నీ వెనకనే వస్తా
అరె చిలకమ్మా నువ్వే చెప్పమ్మా
ఈ మామే నీ లోకమని

నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే

కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా

నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
నీ గళ్ళ చీర ఎదురెపడితే
మోజు మత్తులో మనసే పడినది
సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానే
నీ ప్రాణమయ్యానే

కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనా
ఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనా


*******   *******   ********


చిత్రం: ఖాకీ (2017)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: అరవింద్ శ్రీనివాస్

ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు
మదుమాసం లోన ఆసే రాలెనే
నా ఉపిరి కూడ నన్నే వీడెనే

నా ప్రాణమా నా ప్రాణమా నేడు
స్రుతి లేని జతలో రాగం మోగెనే
చలి కాలం లోను సెగలే రేగెనే

ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు
మదుమాసం లోన ఆసే రాలెనే
నా ఉపిరి కూడ నన్నే వీడెనే

గతమంత తలపోసి బతికేను నీకోసం
వెతికాను నను నేను చికటిలో
మాటలె మౌనం గా మౌనం నీ ద్యనంగా
వెచేను నీ కొరకే సూన్యములో

ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు
మదుమాసం లోన ఆసే రాలెనే
నా ఉపిరి కూడ నన్నే వీడెనే

తనువును మనసును కలిపిన వలపే
తపనల సుడిలో మునిగేనా
చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే
చెరిగిన కలగా మిగిలేనా
తనువును మనసును కలిపిన వలపే
తపనల సుడిలో మునిగేనా
చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే
చెరిగిన కలగా మిగిలేనా

ఆ నింగి నేలతో కలిసేనా
తొలి సంద్యకు కలువలు విరిసేనా
ఎడబాటున ప్రాణం నిలిచేనా
ఎద చాటున ప్రేమే గెలిచేనా
నా తలపుల తలుపులు తెరిచి వేచా
కరిగే కన్నీరై

ఓ నేస్తమా ఓ నేస్తమా నేడు
మదుమాసం లోన ఆసే రాలెనే
నా ఉపిరి కూడ నన్నే వీడెనే

తనువును మనసును కలిపిన వలపే
తపనల సుడిలో మునిగేనా
చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే
చెరిగిన కలగా మిగిలేనా
తనువును మనసును కలిపిన వలపే
తపనల సుడిలో మునిగేనా
చిరు చిరు నవ్వులు చిలికిన పిలుపే
చెరిగిన కలగా మిగిలేనా


*******   *******   ********


చిత్రం: ఖాకీ (2017)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: అనుదీప్ , నమిత బాబు

చిన్ని చిన్ని ఆసలేవొ రెక్క విప్పుకున్నవీ
చిట్టి చిట్టి ఊసులేవొ రేకు విచుకున్నవీ
లాలి లాలి లాలి జొ జొ లాలి

నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నదీ
నిన్ను నన్ను జోల పాడి ఊయలూపుతున్నదీ
లాలి లాలి లాలి జొ జొ లాలి

కొత్త కొత్త పిలుపులే గుండె మీటుతున్నవీ
కోటి కోటి మాటలై గొంతు దాటుతున్నవీ
లాలి లాలి లాలి జొ జొ లాలి
లాలి లాలి లాలి జొ జొ లాలి

మారిపోయె లోకమూ
ఆగి చూసె కాలమూ
పులకరింత తొలకరించే ఈ క్షణమే

పల్లవించె ఓ స్వరం వెల్లువాయే సంబరం
అంబరాన్ని అందుకుంది నా హ్రుదయం
కమ్మనైన అమ్మతనం ఆడదాని జన్మఫలం
కంటిపాప అనుబందం రెప్పకెంత ఆనందం

చిన్ని చిన్ని ఆసలేవొ రెక్క విప్పుకున్నవీ
చిట్టి చిట్టి ఊసులేవొ రేకు విచుకున్నవీ
లాలి లాలి లాలి జొ జొ లాలి

నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నదీ
నిన్ను నన్ను జోల పాడి ఊయలూపుతున్నదీ
లాలి లాలి లాలి జొ జొ లాలి

కొత్త కొత్త పిలుపులే గుండె మీటుతున్నవీ
కోటి కోటి మాటలై గొంతు దాటుతున్నవీ
లాలి లాలి లాలి జొ జొ లాలి
లాలి లాలి లాలి జొ జొ లాలి



*******   *******   ********


చిత్రం: ఖాకీ (2017)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: అనుదీప్, నూతన మోహన్

తొలి వయసే నీలో నాలో
కౌగిల్లై బిగిసే చందం
ఎద పంచే తియ్యని మకరందం
కలలే విరిసి నిలవాలి కలిసిన అనుబందం
తనువే మనసై

తొలివయసే నువ్వు నేను
ఒడిలోన ఒదిగే రాగం
వినిపించె తేనెల అనురాగం
మురిసే యెదలో
చల్లంగా మోగె చలి తాలం
వలపే తలపై

తెలియని ఈ మైకం లోన పగలేదొ రేయెదో
వెచని ఈ మురిపెం లోన నిజమేదో కలయేదో
ఎదలో గదిలో చిలికే సుదలే
రేయి పగలూ కరిగే కదలే
నువ్వే లోకం నీతొ ఉంటే రోజు మదుమాసం

తొలి వయసే నీలో నాలో
కౌగిల్లై బిగిసే చందం
ఎద పంచే తియ్యని మకరందం
కలలే విరిసి నిలవాలి కలిసిన అనుబందం
తనువే మనసై

తొలిరేయికి కానుక నెనై పెదవులనీకందించా
కౌగిల్ల సంకెల్లేసి కాలాన్నే కరిగించా
మొదలే కానీ కదలే మనవి
మదనా రా రా ఇది మా మనవీ
కొరికే చలిలో ఉరికే గిలిలో పరువం పిలిచింది

తొలివయసే నువ్వు నేను
ఒడిలోన ఒదిగే రాగం
వినిపించె తేనెల అనురాగం
మురిసే యెదలో
చల్లంగా మోగె చలి తాలం
వలపే తలపై


Palli Balakrishna Sunday, December 3, 2017
Vivekam (2017)


చిత్రం: వివేకం (2017)
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సత్యప్రకాష్, షాషాతిరుపతి
నటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్, వివేక్ ఒబేరాయ్
దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: త్యాగరాజన్
విడుదల తేది: 24.08.2017

ఆనందమానందం ఆనందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే
కనుల నిండా కలల నిండా ఉంది నీవేలే
ఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లే
నా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదే
స్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే

ఆనందమానందమానందమే
ఒక్కోక్షణం నీతో అద్భుతమే
సరసాలు రాగాలు ఆనందమే
సరిపోని బింకాలు అద్భుతమే

ఒక నువ్వు పక్కనుంటే చాలునంటానే
స్వర్గమైనా నరకమైనా మరచిపోతానే
అర ముద్దులొ చలిమల్లెపూవై నలిగిపొతాలే
తెల్లారి పొద్దులో నీ గుండెగువ్వై ఒదిగిపోతాలే
నీవు నేను ఒక్కరె అనీవేళ చాటాలే
చంటి పాపై జననమై మన ప్రేమ వెలగాలే

ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే
ఆనందమానందం ఆనందమే

Palli Balakrishna Tuesday, November 21, 2017
Venkatapuram (2017)


చిత్రం: వెంకటాపురం (2017)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: వనమాలి
గానం: యాసిన్ నిజార్, కెక ఘోషల్
నటీనటులు: రాహుల్ హరిదాస్, మహిమా మక్వాన
దర్శకత్వం: వేణు మదికంటి
నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్
విడుదల తేది: 12.05.2017

ఎవరో ఎవరో ఎదురుగ
కలలా కలలా కనపడి
ఎపుడూ ఎరగని మాయే చేస్తున్నట్టూ
ఎదలో ఎదలో ఇపుడిక
నిజమై నిజమై నిలిచిన

తనతో నడిచా అన్నీ నువ్వేనంటూ
ఇది ముందెరుగని సంతోషం
ఉంటుందా ప్రతి నిమిషం
అనుకోకుండా నాకు ఎదురయ్యిందా
నా గుండెల్లో అడుగేసీ లోనంతా తిరిగేసీ
నన్నిట్టా తను బైటికి లాగేసిందా

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే
దినమే క్షణమై కరుగుతు
సమయం అసలే తెలియదు
నీతో గడిపే ఈవేళలోనా

నువు చూపే స్నేహంలో
నాలో ఈభారం నేడు మాయమాయెనా
పరుగో నడకో తేలక
పగలో రేయో చూడక
మనసే మునిగే ఒక హాయిలోనా
సిరివానా నీరెండా కలిసి
నా కంటా ఏడు రంగులేసెనా
నువు చూసే లోకంలో
ప్రతి చోటా నేనున్నాలే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

ఎగిరే ఎగిరే నా మనసే
అలలా లేచి పైపైకెగిరే
ఉరికే ఉరికే అది వరదై
తనతో చేరి జతగా ఉరికే

Palli Balakrishna

Most Recent

Default