Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chandini Chowdary"
Gaami (2024)



చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నరేష్ కుమారన్
నటీనటులు: విశ్వక్‌సేన్‌, చాందిని చౌదరి,
అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద
దర్శకత్వం:విద్యాధర్‌ కాగిత
నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌
సహ నిర్మాత: శ్వేతా మొరవనేని
విడుదల తేది: 08.03.2024



Songs List:



గమ్యాన్నే చేధించే పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: అనురాగ్ కులకర్ణి,  స్వీకర్ అగస్తి, సుగుణమ్మ 

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

సొమ్మసిల్లిపోయి కూలింది కాలం
సత్తువంటూ లేక ఇంకెంత కాలం
సన్నగిల్లకుంది ఈ వింత దూరం
దిక్కుతోసకుండ ఇంకెంత దూరం

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపద

కాలకూటమైన ఈ తీపి స్పర్శ
అమృతంగా మారే దారుందా ఈషా
తనువు నీలమౌతూ పెడుతుంటే ఘోషా
జీవమున్న చావు పొందిందా శ్వాస

బేతాళ ప్రశ్నేదో వాలిందంటే
బదులిచ్చి తీరాలి కాదా
లోనున్న భయమంటూ పోవాలంటే
దాగున్న సత్యాన్ని వెతకాలంటా

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే ఛేదించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం
చూసి చూడనట్టే ఉంటుంది లోకం
జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం
నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం

కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా
ఎదురీది చేరాలి ఒడ్డు
దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా
ఎదిరించే తెగువుంటే కాదోయ్ అడ్డు

చేయూతనిచ్చే ఆశే ఉంటే
ఆ గామి రాదా నీకై
గాయాన్ని దాటి చేరాలంటే
నిన్నే నువ్వు గామివై

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా

గమ్యాన్నే చేధించే
స్థైర్యంతో పదా
ధైర్యాన్నే సంధించెయ్
వచ్చిందో ఆపదా



శివం పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ 

నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు కదా

హే మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివమ్
శివమ్ శివమ్ శివం

నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

నీతో నిను వెతికేది
నీలో నిను కలిపేది
అన్వేషణ నీ కొరకను
సంఘర్షణ ఆది ఇది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహనానికే అది తీర్చే
చుక్కాని దొరికిందిరా

నీ నిన్నల్లోని గాయాలే
నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న
మరణాన్ని చెరిపెయ్యరా

జీవం నీలోనే ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెళ్ళి
మోక్షాగామివవ్వరా

చావైనా సిద్ధం శివమ్
ప్రాణంకై యుద్ధం శివమ్
నీలానికి సంకెల శివమ్
శివమ్ శివమ్ శివం

బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర

వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా

హరహర హరహర హర
హరహర హరహర హర
హర హర హర హర హర
హర హర హర హర హర

ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో
ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో

లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి
మోక్షగామివవ్వరా

హే మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువుకే రక్షే శివం శివం
శివమ్ శివమ్ శివం

హరహర హరహరా
హరహర హరహరా




అరిరారో పాట సాహిత్యం

 
చిత్రం: గామి (2024)
సంగీతం: స్వీకర్ అగస్తి, నరేష్ కుమారన్
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక 
గానం: హరిణి ఇవటూరి 

అరిరారో 


Palli Balakrishna Sunday, August 11, 2024
Sammathame (2022)



చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి 
దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ 
విడుదల తేది: 2022



Songs List:



కృష్ణ అండ్ సత్యభామ పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యాజిన్ నిజార్ , శిరీష భార్గవతుల

నేనూహించలే నేననుకున్న అమ్మాయి
నువ్వేనని అసలూహించలే..!
నేనూహించలే ఇంతీజీగా
నే నీకు పడతానని అస్సలూహించలే..!

ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి
సరికొత్త వెలుగే ఇదా

వేరే పనిలేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని
కొంతసేపు మరి కొంతసేపు
పోనీదు అంత త్వరగా

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా

అందం తప్పేలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో
నా మాట వినబోదులే

ఈ మాటలే తగ్గించరా
నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు డూపేలే… నీకైనా ఒకేలే
ముద్దంటే పైపైకే తిడతావులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా

డ్రెస్సే బాగుందే మంటల్నే
పుట్టిస్తుందే గాని
పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే

నా ఇష్టమే నాకుండదా
నీ టేస్టులే రుద్దేస్తే తగునా
డ్యూయెట్టు సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే

కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా





బుల్లెట్ లా పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సామ్రాట్ 
గానం: రితేష్ జి. రావు 

చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సామ్రాట్ 
గానం: రితేష్ జి. రావు 

బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే
చాక్లెట్టులా నీ నవ్వునే చూసి నేను
హాట్ కేకులా మెల్టయ్యానే

ప్రతి రోజూ నీ కళ్ళనే
తొంగి తొంగి నే చూసే
ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో
ఇంకేం ఇంకేం కావాలే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

నిన్న మొన్న లేని హాయే
నువ్వొచ్చాకే చుట్టేసిందే
నాకే నీను నచ్చేసానే
నన్నే నీకు ఇచ్చేసానే

నీ మాటల్లో మాయేదో గమ్మత్తుగుందే
ఏ బాటిల్ లో లేనంత మత్తుందిలే
రేయైన పగలైనా హాయైన దిగులైన
నాతోడు నువ్వుంటే నాకింక సమ్మతమే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

నిదుర లేదే నేరం నీదే
హద్దే లేనీ ప్రేమే నాదే
ఇద్దరమొకటై బతికేద్దామే
వద్దనకుండా హత్తుకుపోవే

ఏ చోటున్న నీ గొంతే వినిపిస్తూ ఉందే
ఏ పాటిన్న రానంత కిక్కుందిలే
జగమంతా సగమైన క్షణమేను యుగమైన
ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే

చంపేయకే మనసిట్ఠే
నువ్వు లాగి పీకి తోసేయకే
ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెల్లోన
ఇంత ప్రేమ నింపెయకే
చిత్రహింసలేంటి ఇలా

బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే
కమ్మిట్టులా అయిపోయానే
 




బావ తాకితే పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: మల్లికార్జున్, మాళవిక

తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం, ఆ ఆ… తననం తననం, ఆ ఆ
తననం తననం, ఆ ఆ… తననం తననం

చిటపట చినుకులు కురిసెనులే, మ్ మ్
ఎదలో అలజడి రేగే, జుం జుం జుం జుం
పడి పడి తపనలు తడిసెనులే, మ్ మ్
తనువే తహ తహలాడే, జుం జుం జుం జుం

ఏమి జరిగిందో
నీ జారు జారు పైట జారిపోతుంది
ఈడు దాడుల్లో
నా ఒంటి నుండి సిగ్గు పారిపోయిందే

కొండల్లో కోనల్లో… వాగుల్లో వంకల్లో
ఎన్నెన్నో వేషాలే వేద్దామా
ఎంచక్కా ఇంపుల్లో… తైతక్క ముద్దుల్లో
ఊరేగి ఆహ అందామా

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే

తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
తననం తననం… తననం తననం
లాల లలలలా లాల లలలలా
లల లాల లలలలా లల లల లలలలలా
జుం జుం జుం జుం జుం జుం జుం జుం

మాటా మాటా… చూపు చూపు
ఏకం చేసే వేళల్లోనా, మ్మ్ మ్మ్
కాలక్షేపం చేయొద్ధంది కొంటె కోరిక
జుం జుం జుం జుం

రాలేనంటూ రారమ్మంటూ
సైగల్లోనే సంబంధాన్ని
తెలియజేస్తూ ఉన్న నేను
హాయ్ హాయ్ నాయకా
జుం జుం జుం జుం

ఏదో ఏదో చేసావే మ్యాజిక్కే మ్యాజిక్కే
ఆగేలాగా లేదే లోలో మ్యూజిక్కే
వచ్చావంటే వేగంగా నా దిక్కే నా దిక్కే
ఐబాబోయ్ అంతా నా లక్కే

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే
జుం జుం జుం జుం
జుం జుం జుం జుం

నిద్ర గిద్రా మాకేమాత్రం
వద్దొద్దంటూ చెప్పే కళ్ళు
నలుపు రంగు రాత్రిలోన
ఎరుపెక్కాలమ్మా, జుం జుం జుం జుం

పెదవి పెదవి సున్నితంగా
రాజూకుందే మోజుల్లోన
రాణించేటి రాజా నిన్ను ఆపాతరమా

జివ్వు జివ్వు అంటుందే… లోలోన లోలోన
బజ్జోబెట్టుకోవా నన్ను ఒల్లోన
ఏనాడైనా నీ ఇష్టం కాదంటూ ఉన్నానా
ఊ అంటే, ఊహు అన్నానా

బావ తాకితే… మురిసే మురిసే
లేత పరువం మెరిసే
భామ కులుకులు… తెలిసే తెలిసే
ఆగనన్నది వయసే




నందలాల పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: కరిముల్లా

హరిలోరంగ హరి
ఇది కదా మొదలయ్యే దారి
కనుల కంచె దాటి
కల కంచిని వెదికే వారి

హరిలోరంగ హరి
బరి తెలియని బాలమురారి
సరిగా గడసరిగా మారి
బైలుదేరే చూద్దమురారి

కొనలేని కోరికలన్నీ ఏకరువు పెట్టాడే
ఆ కొరత తీర్చే నారీ 
మరి యాడున్నాదో
లోకమే ఏకమై చూసినా
తెలియని లోతితడే

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
గోపీనాథ కోలాహలమై
పట్నం బాలికొచ్చెను కదరా

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
వీధి వీధిలో ఎదురయ్యే కథ
మనలాంటోడే కదరా

కాలమే పరిగెడుతుంటే
కాలితో గొడవడుతాడే
మొండిగా నమ్మిందొకటే
మంచని అంటాడే

కొనలేని కోరికలన్నీ
ఏకరువు పెట్టాడే
ఆ కొరత తీర్చే నారీ
మరి యాడున్నాదో
లోకమే ఏకమై చూసినా
తెలియని లోతితడే

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
గోపీనాథ కోలాహలమై
పట్నం బాలికొచ్చెను కదరా

నందలాల గోకుల బాల
కృష్ణ నవ్వుల నది ఇతడేరా
వీధి వీధిలో ఎదురయ్యే కథ
మనలాంటోడే కదరా




తెలుసో లేదో పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: హరిచరణ్, దినేష్ రుద్ర

జిలుగైన చెంగావి… జిగి మీరు కుచ్చిళ్ళు
చిన్ని యడుగుల మీద చిందులాడ
నీటైన రత్నాల తాటంకముల కాంతి
కుల్కు గుబ్బలమీద గునిసియాడా
 
గురుతైన అపరంజి
గొప్పముత్తెపు సత్తు మోవిపై
నొక వింతా ముద్దుగుల్కా

తెలుసో లేదో కలలో చూశా
అపుడెపుడో నాలో నిన్నే కలిశా
ఎవరిని చూసో ఎవరన్నావో
పరుగొదిలిక కొంచం ఆగే మనసా

సో సో… తెగ పోరుతో లైఫులో
సోలో… అనుకుంటూ పడుంటే
స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా
 
అన్నో, తెగ ఊహలు వద్దుర
అమ్మో, తన లెక్కలు వేరో
ఏమో, కలిసే ఇక చూడరా
ఏమౌతుందో

ఎపుడూ ఒకటే పరిపాటా
తనకే పడదా సరదా
అసలే పడవే పనీపాటా
మనసే వేయదే పరదా

వీరు వీరే మరి వారు వారే
అరె వేరే వేరే దిశలొకటిగా
కలిసెనా..?

సో సో… తెగ పోరుతో లైఫులో
సోలో… అనుకుంటూ పడుంటే
స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా

అన్నో, తెగ ఊహలు వద్దుర
అమ్మో, తన లెక్కలు వేరో
ఏమో, కలిసే ఇక చూడరా
ఏమౌతుందో

రంగవల్లి నేలలా
చంటిపాప జోలలా
అంటుకోనె ఉండదా
జంట తారలా టెన్ టు ఫైవ్

అమ్మలా ఆలోపే ఆలిలా మారదా
ఓపిగ్గా కనులను నిమురుతూ
కలలను నిలపదా

అల తాకిడి లేకనే
కడలై ఎద మారే
మనసంచులదాకా ఏదో హాయే

అల తాకిడి లేకనే
కడలై ఎద మారే
మనసంచులదాకా ఏదో హాయే




ప్రేమా ఇది ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: సమ్మతమే (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: ఆదిత్య RK

నిమిషమైనా ఆగునా
నిలవదే ఎపుడు కాలమే
క్షణము కూడా ఉండదే
తిరగడం మాని భూమిదే
ఎవరికో ఎందుకో
మనసులే మారితే ఎలా

లేదు ఎవరి మీద హక్కు
నీకు తెలియదా..?
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

నిమిషమైనా ఆగునా
నిలవదే ఎపుడు కాలమే
క్షణము కూడా ఉండదే
తిరగడం మాని భూమిదే

నిన్నింత నమ్మిందనే నీకింత అలుసా
ప్రేమిస్తే అయిపోతుందా బానిస
ప్రతిదీ నీతో పోల్చి అడిగితే
తనది కూడా నీవే బ్రతికితే

ప్రేమా ఇది ఏమో మరి
చేసావులే నీకు నీవే మోసమే
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

ఇన్నాళ్లు చూపించిన కోపాలు బహుశా
దూరంగా పేరే మార్చి చేరేనా
ఇంతా చేసి చోటు వెతికితే
సమము కాని కంటతడి ఇదే

ప్రేమ ఇది ఏమో మరి
చేసావులే నీకు నీవే మోసమే
లేదు ఎవరి మీద హక్కు నీకు తెలియదా
ఇంతే తెలుసుకుంటే
ఎపుడు నీకే తెలియలేదెలా

Palli Balakrishna Monday, July 11, 2022
Colour Photo (2020)




చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 23.10. 2020



Songs List:



తరగతి గది దాటీ..పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: కాల భైరవ

తొలి పలుకులతోనే..
కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే..
గుసగుసలను వింటూ..
అలలుగ వయసు

పదపదమని తీరం చేరే...
ఏ పనీ పాట లేనీ...
ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా...

ఊరూ  పేరూ లేని 
ఊహా లోకానా...
తారాతీరం దాటీ..
సాగిందా ప్రేమా...

తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... నేడే...

రాణే.. గీత దాటే.. విధేమారే..
తానే... తోటమాలి దరే చేరే...
వెలుగూ నీడల్లే....
కలిసే సాయంత్రం
రంగే లేకుండా...
సాగే చదరంగం

సంద్రం లో నదిలా...
జంటవ్వాలంటూ...
రాసారో లేదో...
ఆ దేవుడుగారు...

తరగతి గది దాటీ...
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... 




అరెరే... ఆకాశంలోన పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, కాల భైరవ

అరెరే... ఆకాశంలోన
ఇల్లే కడుతున్నావా.....
సూరీడు కూడా పడలేనిసోట...
రంగేసినాడు తలదాసుకుంటా..
తనరూపు తానే తెగ సూసుకుంటా.. ఆ ఆ...
మా కిట్టిగాడు పడ్డాడు తంటా.. ఆ...

అరెరే.. ఆకాశంలోన
ఇల్లే కడుతున్నానా....

ఓ..ఓ..ఓ..ఓ...

సిత్రలహరి పాటంట తాను..
రేడియోలో గోలంట నేను..
బొమ్మ కదిలేలా....
గొంతు కలిసేనా.....
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ...
నేనేమో కట్టైన టిక్కెట్టునీ...
మన జంట హిట్టైన సినిమా అనీ...
అభిమానులే ఒచ్చి సూత్తారనీ.....

పగలు రేయంటూ..లేదు..
కలలే కంటూ.. ఉన్నా...
తనతో నుంచుంటే.. చాలూ.. ఊఊ...
కలరు ఫోటోలోనా.....




ఏకాంతం లేనే లేదు పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: రమ్యా బెహ్రా

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లేనిండుగా
కడవరకు తోడుండగా

నా కోపం నా ద్వేషం
నా తోడే రావేమో నాతో నాతోనే...
నా గాయం నా సాయం
నా తోడే రావేమో నాతో నాతోనే...

ఏకాంతం లేనే లేదు
అయినా మనసే ఊరుకోదు
నిశ్శబ్దం కొత్త కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఏకాంతం నా లోనే లేదు
నిశ్శబ్దం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఓ నేమోయలేని పొరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది అనిండుగా
కడవరకు తోడుండగా

నేమోయలేని పొరపాటులెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా





కాలేజ్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: హేమ చంద్ర


కాలేజ్ సాంగ్



తరగతి గది ఫొటోస్ పాట సాహిత్యం

 
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: హేమ చంద్ర


తరగతి గది ఫొటోస్


 


చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 23.10. 2020









తరగతి గది పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: కాల భైరవ




తొలి పలుకులతోనే..
కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే..
గుసగుసలను వింటూ..
అలలుగ వయసు

పదపదమని తీరం చేరే...
ఏ పనీ పాట లేనీ...
ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా...

ఊరూ పేరూ లేని 
ఊహా లోకానా...
తారాతీరం దాటీ..
సాగిందా ప్రేమా...

తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... నేడే...

రాణే.. గీత దాటే.. విధేమారే..
తానే... తోటమాలి దరే చేరే...
వెలుగూ నీడల్లే....
కలిసే సాయంత్రం
రంగే లేకుండా...
సాగే చదరంగం

సంద్రం లో నదిలా...
జంటవ్వాలంటూ...
రాసారో లేదో...
ఆ దేవుడుగారు...

తరగతి గది దాటీ...
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే...
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే... 




అరెరే... ఆకాశం పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, కాల భైరవ





అరెరే... ఆకాశంలోన
ఇల్లే కడుతున్నావా.....
సూరీడు కూడా పడలేనిసోట...
రంగేసినాడు తలదాసుకుంటా..
తనరూపు తానే తెగ సూసుకుంటా.. ఆ ఆ...
మా కిట్టిగాడు పడ్డాడు తంటా.. ఆ...

అరెరే.. ఆకాశంలోన
ఇల్లే కడుతున్నానా....

ఓ..ఓ..ఓ..ఓ...

సిత్రలహరి పాటంట తాను..
రేడియోలో గోలంట నేను..
బొమ్మ కదిలేలా....
గొంతు కలిసేనా.....
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ...
నేనేమో కట్టైన టిక్కెట్టునీ...
మన జంట హిట్టైన సినిమా అనీ...
అభిమానులే ఒచ్చి సూత్తారనీ.....

పగలు రేయంటూ..లేదు..
కలలే కంటూ.. ఉన్నా...
తనతో నుంచుంటే.. చాలూ.. ఊఊ...
కలరు ఫోటోలోనా.....






ఏకాంతం పాట సాహిత్యం

చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: సాయి కిరణ్ 
గానం: రమ్యా బెహ్రా








కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది లేనిండుగా
కడవరకు తోడుండగా

నా కోపం నా ద్వేషం
నా తోడే రావేమో నాతో నాతోనే...
నా గాయం నా సాయం
నా తోడే రావేమో నాతో నాతోనే...

ఏకాంతం లేనే లేదు
అయినా మనసే ఊరుకోదు
నిశ్శబ్దం కొత్త కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఏకాంతం నా లోనే లేదు
నిశ్శబ్దం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు
నా యుద్ధం నాతోనే

ఓ నేమోయలేని పొరపాటులెన్నో
ఎన్నో ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో

కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా
గతముంది అనిండుగా
కడవరకు తోడుండగా

నేమోయలేని పొరపాటులెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో
ఎన్నో ఎన్నెన్నో
ఎన్నో ఎన్నెన్నో
కన్నీళ్లు కొన్నేళ్లుగా
రానన్న రాలేదుగా


Palli Balakrishna Sunday, January 17, 2021
Howrah Bridge (2017)

చిత్రం: హౌరా బ్రిడ్జ్ (2017)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: పూర్ణాచారి
గానం: హరిప్రియ
నటీనటులు: రాహుల్ రవీంద్ర , చాందిని చౌదరి
దర్శకత్వం: రేవన్ యాదు
నిర్మాతలు: మాండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాస్, నల్లి కిరణ్ కుమార్
విడుదల తేది: 24.11.2017

రాధా గోపాలా గోకులా బాల రావేరా
మనసు విని రావేరా రావే రావే రాధా మాధవా
హౌరా వారధిలా తేలినది మనసే ఈవేళ
మనవి విని రాధా కృష్ణ రాధా కృష్ణ మురళీ ముకుందా

హృదయలయాలకించరా
ఎదురుపడి స్వాగతించరా
కన్నెకలలల్ని వేచాయి నిన్ను కోరాయి
మూగబోయాయి మాకు తెలుపరా


నిన్నే కోరార కనులు కలలన్ని నీవేరా
తెలుసుకొని ప్రియమారా దరిచేరావే నీవే నేనుగా
మనసున గీశారా నీ ప్రతిమ ప్రధముడు నీవేరా
ప్రతిక్షణము నువ్వే నేనై నేనే నువ్వై పోయా వింతగా

Palli Balakrishna Thursday, November 16, 2017
Samanthakamani (2017)


చిత్రం: శమంతకమణి (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: సుదీర్ బాబు, సందీప్, నారారోహిత్, ఆది, సుమన్, చాందిని చౌదరి, కైరా దత్, జన్నీ హనీ
దర్శకత్వం: వి. ఆనంద్ ప్రసాద్
నిర్మాత: శ్రీరామ్ ఆదిత్య
విడుదల తేది: 14.07. 2017

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

ఏదో దొరికేస్తాది ఇక్కడికొచ్చాక
ముందేదో కదిలేస్తాది కిక్కంటూ ఎక్కాక
పొందేది పోయేది నీ సొంతం లెక్క
తెలిసేది తెల్లారి నిద్దర లేచాక

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

Palli Balakrishna Tuesday, October 31, 2017

Most Recent

Default