-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Most Recent

Search Box

Comrade Kalyan – Oriya Pilla Song Lyrics in Telugu and English

Oriya Pilla Song Lyrics in Telugu and English – Comrade Kalyan

MOVIE DETAILS
Singer : Sid Sriram
Presented by : Kona Venkat
Producers : Venkata Krishna Karnati, Seetha Karnati
Banners : Kona Film Corporation, Skanda Vahana Motion Pictures LLP
Actors : Sree Vishnu
Actresses : Mahima Nambiar
Supporting Cast : Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye

Oriya Pilla Song Lyrics in Telugu and English – Comrade Kalyan

'Oriya Pilla' song from Comrade Kalyan movie is composed by Vijai Bulganin and sung by Sid Sriram. Lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar. Starring Sree Vishnu and Mahima Nambiar. Directed by Janakiram Marella and presented by Kona Venkat.

SONG INFORMATION
Song : Oriya Pilla
Movie : Comrade Kalyan
Singer : Sid Sriram

Oriya Pilla Song Lyrics in Telugu

ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదలనే ఓ ఒరియా పిల్ల వాలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ ఒరియా పిల్ల ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరరే అరరే, ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరరే అరరే, ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ… తనననా.. తురురు… తరి రారే.. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ… ఓ ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒకరు పుడతారు వాళ్లనే దేవతలు అంటుంటారు ఓ.. ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు అందుకే దేవుడు నిను చూపించాడు బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే అరరే అరరే, ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరరే అరరే, ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల ముడేసావు కనుల్నే నువ్వు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదలనే ఓ ఒరియా పిల్ల వాలేస్తూ నీ కురుల్నే చెడగొట్టేస్తావా మతుల్నే నువ్వు చంపేస్తావా ప్రజల్నే ఓ ఒరియా పిల్ల ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా అరరే అరరే, ఓ ఒరియా పిల్ల కదిలే నదిలా నడుముందే పిల్ల అరరే అరరే, ఓ ఒరియా పిల్ల అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల

Oriya Pilla Song Lyrics in English (Transliteration)

Mudesaavu Kanulne Nuvvu Kammesaavu Kalalne Ninnu Vadalanante Vadalane O Oriya Pilla Valesthu Nee Kurulne Chedagottesthava Mathulne Nuvvu Champesthava Prajalne O Oriya Pilla Iravai Naalugu Gantalu Ninne Choosthu Undela Em Cheyyalo Nuvve Konchem Cheppave Priyurala Moodu Vandala Aravai Rojulu Ninne Antuku Tirigela Sooryudu Chuttu Tirige Bhoomi Nenaipovala Arare Arare, O Oriya Pilla Kadile Nadila Nadumunde Pilla Arare Arare, O Oriya Pilla Atuga Tirigi Navvuthave Pilla Oh Oh Oh Oh Oh Oh Oh… Tananana.. Tururu… Thari Raare.. Oh Oh Oh Oh Oh Oh Oh… O Eppudo Nootiki Kotiki Neela Okaru Pudataaru Vaallane Devathalu Antuntaru O.. Ekkado Unduntunde Adrushtam O Chemchadu Anduke Devudu Ninu Choopinchaadu Brathikinchesaave Naalo Unna Praananne Podiginchesaave Naa Vandella Kaalanne Nadipinchesaave Nee Venakaale Paadanne Podipinchesaave Edapai Navvula Roopanne Arare Arare, O Oriya Pilla Kadile Nadila Nadumunde Pilla Arare Arare, O Oriya Pilla Atuga Tirigi Navvuthave Pilla Mude Saavu Kanulne Nuvvu Kammesaavu Kalalne Ninnu Vadalanante Vadalane O Oriya Pilla Valesthu Nee Kurulne Chedagottesthaava Mathulne Nuvvu Champesthaava Prajalne O Oriya Pilla Iravai Naalugu Gantalu Ninne Choosthu Undela Em Cheyyalo Nuvve Konchem Cheppave Priyurala Moodu Vandala Aravai Rojulu Ninne Antuku Tirigela Sooryudu Chuttu Tirige Bhoomi Nenaipovala Arare Arare, O Oriya Pilla Kadile Nadila Nadumunde Pilla Arare Arare, O Oriya Pilla Atuga Tirigi Navvuthave Pilla

Palli Balakrishna Sunday, September 20, 2026
Swathi Muthyam (1986) Telugu Songs Lyrics Album Cover

Swathi Muthyam (1986) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Swathi Muthyam (1986)
Banner : Poornodaya Movie Creations
Music : Ilaiyaraaja
Director : K. Viswanath
Producer : Edida Nageswara Rao
Actors : Kamal Haasan
Actresses : Raadhika Sarathkumar
Supporting Cast : Gollapudi Maruti Rao, J. V. Somayajulu, Nirmalamma, Allu Ramalingaiah
Release Date : 13 March 1986
MOVIE HIGHLIGHTS

Swathi Muthyam (1986) was selected as India's official entry for the 59th Academy Awards (Oscars) for Best Foreign Language Film.

• Directed by Kalatapasvi K. Viswanath, the film won three National Film Awards, including the National Film Award for Best Feature Film in Telugu.

• Ulaganayagan Kamal Haasan delivered a tour-de-force performance as the autistic and innocent adult 'Sivayya', winning the prestigious Nandi Award for Best Actor.

• Maestro Ilaiyaraaja crafted a timeless, devotional, and emotionally poignant musical score that won the National Film Award for Best Music Direction.

• The iconic cradle song "Vatapatra Saayiki", written by Dr. C. Narayana Reddy and sung by melody queen P. Susheela, remains one of the most revered lullabies in the history of South Indian music.

Suvvi Suvvi Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Suvvi Suvvi' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... చాలా బాగా పాడుతున్నారే ఆ... పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ... ఆ... ఆ... చుడండి ఆ... ఆ...ఆ...ఆ... ఆ... ఆఁ ఆ... ఆ... ఆ... ఆ... నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా తానననా తానాన తదరీ... నా... ఆ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా ఆ ఆ ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా ఓహో హో హో... ఆ... హా హా... ఏ...హే హే హే... అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే... గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ...

Vatapatra Saayiki Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Vatapatra Saayiki' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Singers : P. Susheela
లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి... ఆ... మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ కల్యాణ రామునికి కౌసల్య లాలి కల్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజ ముఖునికి... కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి పరమాంశభవునికి పరమాత్మ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జోజో జోజో జో... జోజో జోజో జో... అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమనుతునికి త్యాగయ్య లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ

Ramaa Kanavemiraa Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Ramaa Kanavemiraa' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
రామా కనవేమిరా (2) శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసధులందరూపదే పదే చూడగా శ్రీ రామచంద్ర మూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు రామా కనవేమిరా (2) శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా ముసిముసి నగవుల రసిక శిఖామనులు ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు సగారిదా మని దా మ ని ని ముసిముసి నగవుల రసిక శిఖామనులు థా థకిట థక జణుథ ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు థకజణు థకధిమి తక మీసం మీటే రోష పరాయణులు నీ దా మ ప మ స రీ గా మా సరి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామా కనవేమిరా కనవేమిరా... ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు ఆ... గుండెలు జారిన విభులు విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నర పంగవులు తమ ఒళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాఘ్రనులు ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా ఆ ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా అరెరరె ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహా ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా తాకిట తైయ్యకు తా దిమి తా రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీదచెయ్యివేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యివేసినాడు సీత వంక ఓరకంట చూసినాడు సీత వంక ఓరకంట చూసినాడు ఒక్కచిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు పెళపెళ పెళపెళ పెళపెళ పెళపెళ విరిగెను శివధనువు కళలోలికెను సీతానవవధువు జయ జయ రామా రఘుకుల సోమ జయ జయ రామా రఘుకుల సోమ దశరధ రామా ధైత్యవిరామ దశరధ రామా ధైత్యవిరామ జయ జయ రామా రఘుకుల సోమ జయ జయ రామా రఘుకుల సోమ దశరధ రామా ధైత్యవిరామ దశరధ రామా ధైత్యవిరామ సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే రామయ్య అదుగోనయ్య రమణీ లలామా నవలావణ్య సీమా ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా

Manasu Palike Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Manasu Palike' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
మనసు పలికే, మనసు పలికే మౌనగీతం, మౌనగీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే, మమతలొలికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు ఉఁ మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ మరుల జలకాలాడనీ ఆ... సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ పగలు రేయీ ఒదగనీ ఆ... హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోనీ రాగ దీపం వెలిగిపోనీ రాగ దీపం వేయి జన్మలుగా... మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే ఆ... ఆ... ఆ... ఆ... ఆ... కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ ఓనమాలు దిద్దనీ ఆ... పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ మొదటి తీపి... ఓ... లలిత యామినిలో కలల కౌముదిలో లలిత యామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా... మనసు పలికే, మనసు పలికే మౌనగీతం, మౌనగీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే, మమతలొలికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు

Chinnaari Ponnaari Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Chinnaari Ponnaari' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Acharya Aatreya, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారమ్మా నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో వెన్నకై దొంగలా వెళ్లితివేమో మన్నుతిని చాటుగా దాగితివేమో అమ్మా మన్నుతినంగ నే చిచువును ఆకొంతినో వెద్దినో చూదు నోలు ఆఆ వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామె కోపంరా పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది పచ్చికొట్టిపోయామా పాలెవలు ఇత్తారు ఆ బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు చెప్పు అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము అన్నమైన తింటాము తన్నులైన తింటాము కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య తిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నాన్న ఎవలమ్మా చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టేను పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ ఎవ్వరు నువ్వని ఈ ఈ ... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు ఆ వెళ్ళము వెళ్ళములేమ్మ చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

Dharmam Saranam Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Dharmam Saranam' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
ధర్మం... శరణం గచ్ఛామి దానం... శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ఇంతో అంతో... ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం లేదిక మరుజన్మం లేదిక మరుజన్మం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి తెల్ల వారితే కూడు దక్కకా పొద్దు వాలితే గూడు చిక్కకా తెల్ల వారితే కూడు దక్కక పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి కన్నవారికి కానివారమై కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి

Pattu Cheera Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Pattu Cheera' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by K. Viswanath, and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Lyricist : K. Viswanath
పట్టుసీర తెస్తననీ... పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా పట్టపగలల్లే ఓ సందమామా… తన్ననానె నానా తానానెనానా తన్ననానా… తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా ఆలినయ్యేదాకా వెల్లిపోమాకా ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా ఎన్నెలమ్మ ఓయ్ తోడూ ఓ సందమామా ఎన్నెలమ్మ ఆ అబ్బా

Vatapatra Saayiki Pathos Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Vatapatra Saayiki (Pathos)' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Dr. C. Narayana Reddy, and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Singers : P. Susheela
లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జోజో జోజో జోజో జో... జోజో జోజో జోజో జో...

Laali Laali Ending Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Laali Laali (Ending Song)' from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి శివయ్య మనసే చిన్నారి పాపై చిరునవ్వులొలికే స్వాతి ముత్యమై కలకాలం వెలిగే పవిత్ర దీపమై

Palli Balakrishna
Geethanjali (1989) Telugu Songs Lyrics Album Cover

Geethanjali (1989) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Geethanjali (1989)
Banner : Bhagyalakshmi Enterprises
Music : Ilaiyaraaja
Director : Mani Ratnam
Producers : C. Praveen Kumar Reddy, P. R. Prasad
Actors : Nagarjuna Akkineni
Actresses : Girija Shettar
Supporting Cast : Vijayachander, Radhabhai, Sowcar Janaki
Release Date : 12 May 1989
MOVIE HIGHLIGHTS

Geethanjali (1989) is an all-time immortal classic that won the National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment and seven Nandi Awards.

• Directed by master storyteller Mani Ratnam, the film is hailed as one of the greatest romantic tragedies ever made in Indian cinema.

• Maestro Ilaiyaraaja composed a divine, legendary soundtrack that remains a gold standard in film music composition.

• Legendary lyricist Veturi Sundararama Murthy penned poetic, philosophically rich lyrics for all seven tracks, winning a Nandi Award for Best Lyricist.

• Romantic masterpieces like "Om Namaha", "O Priya Priya", and the soul-stirring melody "Aamani Paadave" sung by S. P. Balasubrahmanyam hold timeless popularity across generations.

O Priya Priya Song Lyrics in Telugu – Geethanjali (1989)

'O Priya Priya' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాని నీడలు రాలు పూల దండలు నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగీనేల తాకేవేళ నీవే నేనై పోయే వేళాయె నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో ఓ ఈ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాళిదాసు గీతికి ప్రశ్న రాసలీలకి ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి ఆ అణాలు ఆశకి తాజమహలు శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధికన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ ఈ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమంది నీకసి నింగీ నేల తాకేవేళ నీవే నేనై పోయే క్షణాల లేదు శాసనం లేదు బందనం ప్రేమకే జయం ప్రేమదే జయం

Jagada Jagada Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Jagada Jagada' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం సై అంటే సయ్యాటలో... హే హే మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటలో నేడేరా నీకు నేస్తము, రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా, రానే రాదూ ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే తక తకధిమి తకఝణు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం పడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం మా పాట సాగేనులే... హో..హో నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే ఓ మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే తక తకధిమి తకఝణు జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగళ గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తకిట తకధిమి తకధిమి తక తకిట తాం తాం తాం తాం తాం

Aamani Paadave Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Aamani Paadave' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా (2) వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా పదాల నా యెద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేననీ... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో శుఖాలతో పికాలతో ధ్వనించినా మధూదయం దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ నేననీ... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా (2)

Nandikonda Vaagulona Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Nandikonda Vaagulona' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ...ఓ...ఓ...ఓ... నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది... ఏది, నా పేరేది... ఏది నా దారేది... ఏది, నా వారేరి... ఓ...ఓ...ఓ...ఓ... ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నుడుగు మోహిని పిచాసి నా చెలిలే శాఖిని విసూచి నా సఖిలే మోహిని పిచాసి నా చెలిలే శాఖిని విసూచి నా సఖిలే విడవకురా వదలనురా ప్రేమేరా నీ మీదా నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో భూత ప్రేత పిశాచ భేతాళ మారి జంభం జదంభంభం నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిను కట్టుకు పోతా నీ భరతం పడతా నిను పట్టుకు పోతా ఆ...ఆ... ఓ... ఓ... ఢాకిరి ఢక్కా ముక్కల చక్కా ఢంభో తినిపిస్తాన్ తాటకివనిపిస్తే తాటను వలిచేస్తాన్ గుంటరి నక్క డొక్కల చొక్కా అంబో అనిపిస్తాన్ నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కిస్తాన్ రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్ తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ రక్కిసమట్టా తొక్కిస బుట్ట పంబే దులిపేస్తాన్ తీతువ పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్ అస్త్రాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్ వస్త్రాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్ భూపోల మసజస తతగా శార్దూలా నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పెడతా నిను కట్టుకు పోతా నీ భరతం పెడతా నిను పట్టుకు పోతా ఎ... ఎ... ఏ... ఏ... నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో

Om Namaha Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Om Namaha' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో... ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో... రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా కాలము లేనిదై గగనము అందగా సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం ఒంటరి బాటసారి జంటకు చేరరా కంటికి పాపవైతే రెప్పగ మారనా తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో... ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో...

O Papa Lali Song Lyrics in Telugu – Geethanjali (1989)

'O Papa Lali' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి నా...జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ... సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి ఓ... మేఘమా ఉరమకే ఈ పూటకీ గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ... కోయిలా పాడవే నా పాటని తియ్యని తేనెలే చల్లిపో ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరుల అలపాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తియ్యగా ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా ఓ పాపా లాలి

Jallanta Kavvinta Song Lyrics in Telugu – Geethanjali (1989)

'Jallanta Kavvinta' song from Geethanjali (1989) movie is composed by Ilaiyaraaja, written by Veturi Sundararama Murthy, and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Geethanjali (1989)
Music : Ilaiyaraaja
Singers : K. S. Chithra
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కళ్ళాపి జల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

Palli Balakrishna
Orange (2010) Telugu Songs Lyrics Album Cover

Orange (2010) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Orange (2010)
Banner : Anjana Productions
Music : Harris Jayaraj
Director : Bhaskar (Bommarillu Bhaskar)
Producer : K. Naga Babu
Actors : Ram Charan
Actresses : Genelia D'Souza, Shazahn Padamsee
Supporting Cast : Siddu Jonnalagadda, Brahmanandam, Prabhu, Prakash Raj, Srinivas Avasarala
Release Date : 26 November 2010
MOVIE HIGHLIGHTS

Orange (2010) is widely celebrated as one of the greatest musical cult classics in modern Telugu cinema history.

• Present-day youth sensation Star Boy Siddu Jonnalagadda (of DJ Tillu fame) played a notable role in his early career as one of Ram Charan's close friends (Santhosh) in the movie.

• Musical maestro Harris Jayaraj delivered a sensational, timeless romantic soundtrack that won the Mirchi Music Awards South for Album of the Year.

• Mega Power Star Ram Charan presented a refreshingly modern, honest take on love, relationships, and romance as Ram.

• Lyricist Vanamali penned deeply introspective and poetic lyrics for songs like "Chilipiga" and "Nenu Nuvvantu".

• The opening anthem "Oola Oolala Ala (Sydney Nagaram)", sung vibrantly by NC Karunya, remains an iconic romantic youth song across generations.

Oola Oolala Ala Song Lyrics in Telugu – Orange (2010)

'Oola Oolala Ala (Sydney Nagaram)' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Surendra Krishna and Kedarnath Parimi, and sung by NC Karunya.

SONG INFORMATION
Movie : Orange (2010)
Singers : NC Karunya
ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love. I'm in love your my love your my love సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love. I'm in love your my love your my love ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్తుండాలా చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా సాగర తీరాన ఉదయంలా ఎదో తాజా ఉల్లాసమె ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే తెలుసుకున్నది కొంచమే ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగ లో లో పొంగిందే ఇవ్వాళే రాలే పాత బాదే నిన్ను చూడ ఆ లేత అల్లర్లే లాగాయిలా నేల విడి పాదం అదిందిలా అ ఏడు రంగుల్ని మార్చానిల నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా అప్పుడే పుట్టిన పాపలా నువ్వు కొంత కాలం విచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువ్వు చల్ల గాలి చల్లినావుగా ఇవ్వాళే వాలే కొత్త హయే నిన్ను చూడ ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మాదేసీ లోనే సర్ఫింగ్ చేస్తుందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I am in love I am in love you are my love

Chilipiga Song Lyrics in Telugu – Orange (2010)

'Chilipiga' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Vanamali, and sung by Karthik.

SONG INFORMATION
Movie : Orange (2010)
Lyricist : Vanamali
Singers : Karthik
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదేలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరై పోతున్నా మళ్లీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచం మధురము కొంచం విరహము కొంచం పరువము కొంచం ప్రణయము

Nenu Nuvvantu Song Lyrics in Telugu – Orange (2010)

'Nenu Nuvvantu' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Vanamali, and sung by Naresh Iyer and Nadeesh.

SONG INFORMATION
Movie : Orange (2010)
Lyricist : Vanamali
Singers : Naresh Iyer, Nadeesh
నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! ఓ గర్ల్.. నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !! ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా... గాగా.. నా ప్రేమలోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ఓ...! నిజాయితీ ఉన్నోడినీ నిజాలనే అన్నోడినీ అబద్దమే రుచించనీ అబ్బాయినీ ఒకే ఒక మంచోడినీ రొమాన్సులో పిచ్చోడినీ పర్లేదులే ఒప్పేసుకో సరేననీ ముసుగేసుకోదు ఏనాడూ... ఓఓ.. నా మనసే ఓ భామా .. ఓఓ.. నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ..! నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ ఓ గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా ఒకనాటి తాజ్ మహలైనా నా ముందూ పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే...ఓఓఓ.. ! నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా ! నువ్వే లేకుంటే ఏమౌతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా !! ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాకా నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓఓ...ఓఓ... నానానా..నానన్నాన్నా...హో...

Hello Rammante Song Lyrics in Telugu – Orange (2010)

'Hello Rammante' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Ramajogayya Sastry, and sung by Vijay Prakash.

SONG INFORMATION
Movie : Orange (2010)
Singers : Vijay Prakash
హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హాల్లో రమ్మంటే హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా 24 carrot lovely ప్రేమ 24 x7 నీ పై కురిపిస్తున్నా ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా Every second నీకై పడి చస్తున్నా ఏడు రంగులుగ సులువుగ ఏడు రంగులుగ సులువుగ విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టం అంటోంది సరేలే అని బదులు ఇస్తే తప్పేముంది హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా అందమైన కలలు చూస్తు ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అందుకోసమే నీ ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగలాంటి నా ప్రేమ ఇది జీవ నధి నాధం చేతులారా గుండెలో నింపుకో సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా ప్రేమ గా ఓ ఓ ఓ హాల్లో... హాల్లో... హాల్లో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే హాల్లో రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే

O'Range Song Lyrics in Telugu – Orange (2010)

'O\'Range' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Vanamali, and sung by Benny Dayal.

SONG INFORMATION
Movie : Orange (2010)
Lyricist : Vanamali
Singers : Benny Dayal
ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి మౌంట్ ఎవరెస్ట్ ఐ (లెట్స్ గో ) ఎదిగేయ్ లవ్ నీ చేరాలంటే కావలిక డేరింగ్ మాకేనాస్ గోల్డ్ ల (లెట్స్ గో ) తాగేయ్ లవ్ నీ ఉండాలంటే చేయాలిక కాబింగ్ కమ్మని కవితల కబురుల్లో కనపడధమ్మో లవ్ ఊఉ నిజాన్ని దాచే హార్ట్ ఊళ్ళో ఏఈ ప్రేమని వదిలి పోలేవు ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి లెట్స్ గో లెట్స్ గో నే వేయి సార్లు ప్రేమిస్తా నా గుండలోన ఫీల్ ఉంది నే క్రొత్త చరిత నీ రాస్త నా లవ్ లో లైఫ్ ఉంది నే కన్నా కళను సాధిస్తా నా లోన పచ్చి నిజం ఉంది ఎద లోకి తొంగి చూసావా నువ్వు వణికేయ్ తెగువుంది ఓహ్ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకెయ్ ప్రేమ నువ్వు ధామ ధామ ధామ ధామ ధామ ధరికెయ్ ధామ పగలే కళలను చూపించే వయసుకు పడిపోకమా నిజముగా నిన్నేయ్ ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమా ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి లవ్ మంచు పూలు కురిపిస్తే నువ్ మంట రేపి చంపొద్దు లవ్ చేయి కలుపుతానంటే నువ్ చెలిమిని తుంచొద్దు లవ్ అమృతాన్ని తాగిస్తే నువ్ చేదు విషం చిమ్మదు లవ్ పల్లవించు పాటైతే తన గొంతును కోయదు హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకీ సైరా నువ్ వైరా వైరా వైవైవైర పందమే వైరా ప్రేమికులంతా ఒకటైన నిలవారు నాతో పోటీ ఒకరికి ఒకరన్న ప్రేమలో ఏముంది లేదా గ్యారెంటీ ఓ రేంజ్ లవ్ ఆరంజ్ లవ్ ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమిని ఎపుడు చూడంది ట్రుథ్ ఆర్ డేర్ అని కెళ్తా హెయిన్ ఏయ్ కభీ హే హార్ట్ జోరిది అబిబి ప్రేమను తాగేయ్ హనీ బీ థాట్స్ వై మేర దిల్ చాహతే హెయిన్ సభి మౌంట్ ఎవరెస్ట్ ఐ (లెట్స్ గో ) ఎదిగేయ్ లవ్ నీ చేరాలంటే కావలిక డేరింగ్ మాకేనాస్ గోల్డ్ ల (లెట్స్ గో ) తాగేయ్ లవ్ నీ ఉండాలంటే చేయాలిక కాబింగ్ కమ్మని కవితల కబురుల్లో కనపదధమ్మో లవ్ ఊఉ నిజాన్ని దాచే హార్ట్ ఊళ్ళో ఏఈ ప్రేమని వదిలి పోలేవు

Rooba Rooba Song Lyrics in Telugu – Orange (2010)

'Rooba Rooba' song from Orange (2010) movie is composed by Harris Jayaraj, written by Vanamali, and sung by Shahil Hada and Chinmayi Sripaada.

SONG INFORMATION
Movie : Orange (2010)
Lyricist : Vanamali
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబ రూబ రూ... ఊఊ... రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా ఇంచి దూరమే అంటున్నా ఎలా వుండగలవు అంటుంది నిన్ను తాకమని తొందర చేసే నా మదే కొంటె చేతలే చేస్తున్నా తనేం చేసిన కాదనదే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ఓ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా రెక్కలోచ్చినట్టుంటుందే మదే తేలిపోతుంటుందే రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే ఓ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే నీతో ఉంటె సంతోషం కాదా నిత్యం నా సొంతం రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హాయ్ రబ్బ తౌబ తౌబ హే తౌబ తౌబ తు హై మేరి మెహబూబా అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తుందే సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే రూబ రూబ రూ...ఊఊ...

Ye Vaipugaa Song Lyrics in Telugu – Orange (2010)

'Ye Vaipugaa (Theatrical Version)' song from Orange (2010) movie is composed by Harris Jayaraj and sung by Suchith Suresan.

SONG INFORMATION
Movie : Orange (2010)
Lyricist : Vanamali
Singers : Suchith Suresan
ఏ వైపుగా దాగున్నాదో వెతికే నాకలా సంద్రాన్నే మించే ఓ ప్రేమలా నన్నింతగా వేదించినా మనసే నేడిలా మళ్ళీ ఆ ఉహల్లోకే పరుగులా! ఒక్కో క్షణం నీకోసమై ఒక్కో ముఖం చూపేదెలా? ఏ వైపుగా దాగున్నాదో వెతికే నాకలా సంద్రాన్నే మించే ఓ ప్రేమలా నన్నింతగా వేదించినా మనసే నేడిలా మళ్ళీ ఆ ఉహల్లోకే పరుగులా!

Palli Balakrishna
Nuvvu Naaku Nachhav (2001) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Naaku Nachhav (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Banner : Sri Sravanthi Movies
Music : Koti
Director : K. Vijaya Bhaskar
Dialogue Writer : Trivikram Srinivas
Producer : Sravanthi Ravi Kishore
Actors : Venkatesh
Actresses : Aarti Agarwal, Asha Saini
Supporting Cast : Prakash Raj, Sunil, Brahmanandam, Chandra Mohan
Release Date : 06 September 2001
MOVIE HIGHLIGHTS

Nuvvu Naaku Nachhav (2001) is widely regarded as one of the finest family romantic-comedy films in the history of Telugu cinema.

• The film marked the debut of late actress Aarti Agarwal, making her an overnight star alongside Victory Venkatesh.

Trivikram Srinivas penned razor-sharp, hilarious, and heartwarming dialogues that hold cult status even today.

• Music Director Koti delivered a timeless, melodic blockbuster album with legendary lyrics from Sirivennela Seetharama Sastry.

• The wedding celebration number "Aakasam Dhigi Vachi", sung by S. P. Balasubrahmanyam, remains an essential track across Telugu wedding celebrations.

Unna Mata Cheppaneevu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Unna Mata Cheppaneevu' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Tippu and Harini.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
Singers : Tippu, Harini
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా పంతం మానుకో - భయం దేనికో నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగ వేయ్యకలా హాయి వలా నీమీదికొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడా దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చేయనే నీతో ఎలా వేగనే నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా పంతం మానుకో - భయం దేనికో ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా

O Navvu Chalu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'O Navvu Chalu (Naa Cheliya Paadhaalu)' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితె చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తూంటే పువ్వుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

Aakasam Dhigi Vachi Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Aakasam Dhigi Vachi' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

Naa Chupe Ninu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Naa Chupe Ninu' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by K. S. Chithra and Sriram Prabhu.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది

O Priyathama Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'O Priyathama (Aa Neeli Gaganaana)' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Bhuvanachandra, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
Lyricist : Bhuvanachandra
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం… శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ ప్రితమా దయగనుమా. నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఔననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా

Okkasari Cheppaleva Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Okkasari Cheppaleva' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Kumar Sanu and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా కలలన్నవి గలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

Palli Balakrishna
Mahendragiri Varahi (2026) – What A Logic Sir Ji Song Lyrics in Telugu and English

What A Logic Sir Ji Song Lyrics in Telugu and English – Mahendragiri Varahi (2026)

MOVIE DETAILS
Music : Anup Rubens
Lyricist : Kasarla Shyam
Singer : Jassie Gift
Producers : Madhu Kalipu, Laxman
Music Label : Junglee Music
Release Year : 2026

What A Logic Sir Ji Song Lyrics in Telugu and English – Mahendragiri Varahi (2026)

'What A Logic Sir Ji' song from Mahendragiri Varahi (2026) movie is composed by Anup Rubens and sung by Jassie Gift. Lyrics are written by Kasarla Shyam. Directed by Santhosh Jagarlapudi.

SONG INFORMATION
Song : What A Logic Sir Ji
Music : Anup Rubens
Lyricist : Kasarla Shyam
Singer : Jassie Gift

What A Logic Sir Ji Song Lyrics in Telugu

ఆహ్ రోబోల మధ్యన రోజు తిరిగేస్తూ ఉన్నా బాబాల కాళ్లను మాత్రం వదలలేకున్నా రాకెట్ల పైకెక్కి చంద్రుణ్ని తాకేసొస్తున్నా లాకెట్ల ఉచ్చుల్ని మాత్రం దాటలేకున్నా క్యూఆర్ కోడ్‌తో పైసల్ అల్లాడిస్తున్నా యాలకులు లవంగాలెట్టి పర్సుని పచారీ కొట్టే చేస్తున్నాం వాట్ ఏ లాజిక్ సర్ జీ వాట్ వాట్ వాట్ వాట్ వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! జీ! హే కంప్యూటర్ లోనైనా చివరికి జాతకమే చూస్తాము ప్రయోగశాలకు ముహూర్తానికి పంచాంగం తిరగేస్తాము అరే ప్రెగ్నెన్సీపై ప్రేయర్ చేసి, తాయత్తులనే కడతాము హార్ట్‌లో హోలే పడ్డా, హోలీ వాటర్ చల్లేస్తాము టెలిస్కోప్‌లో డైరెక్ట్‌గా చుక్కలు లెక్కెడుతున్నా గ్రహణం రోజున తలుపులు మూసి సంప్రోక్షణ చేస్తాము వాట్ ఏ లాజిక్ సర్ జీ వాట్ వాట్ వాట్ వాట్ వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! జీ! అరే, రాయి రాయి రాపిడి చేసి నిప్పుని కనిపెట్టాము ఈ చీకటి తెరలను తొలగించేటి సూర్యులం అవ్వలేమా హే గుండెని తీసి గుండెని పెట్టే తెలివికి కేరాఫ్ మనము ఈ గుడ్డి కన్నును తెరిపించేటి వెలుగులం అవ్వలేమా అరచేతిలో ప్రపంచాన్ని చిటికెలో చేర్చే వాళ్ళం పిడికిలి బిగించి రేపటి రోజుకు కొత్త రూపునిద్దాము వాట్ ఏ లాజిక్ సర్ జీ వాట్ వాట్ వాట్ వాట్ వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! వాట్ ఏ లాజిక్ సర్ జీ, వాట్ ఏ లాజిక్ సర్ జీ కంట్రీ మొత్తం ఫైవ్ జీ, మన బుర్రలు డ్యామేజ్! జీ!

What A Logic Sir Ji Song Lyrics in English (Transliteration)

Ahh robo la madhyana roju thirigesthu unna Baba la kaallanu matram vadhala lekunna Rocket la paikekki chandrunni taakesosthunna Locket-la ucchulni matram dhaatalekunna QR code tho paisal alladisthunna Yalakalu lavangaaletti purse-ni pachari kotte chesthunam What a logic sir ji What What What What What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! Ji! Hey computer-lo naina chivariki jaathakame chusthamu Prayogashalaku muhurthaniki panchangam thiragesthamu Arey pregnancy-pai prayer chesi, thayatthulane kadathamu Heart-lo hole-ae padda, holy water challesthamu Telescope-lo direct ga chukkalu lekkeduthunna Grahanam rojuna thalupulu moosi samprokshana chesthamu What a logic sir ji What What What What What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! Ji! Arey, raayi raayi raapidi chesi nippuni kanipettamu Ee cheekati theralanu tholagincheti sooryulam avalema Hey gundeni theesi gundeni pette teliviki care of manamu Ee guddi kannunu theripincheti veluthuruam avalema Arachethilo prapanchanni chitikilo cherche vallam Pidikili bhiginchi repati rojuku kotha roopuniddamu What a logic sir ji What What What What What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! What a logic sir ji, What a logic sir ji Country motham 5G, mana burralu damage! Ji!

Palli Balakrishna Friday, September 18, 2026

Most Recent

Default